ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వరుసగా రెండో రోజూ తగ్గిన చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య


రెండో రోజు కూడా కొత్త కోవిడ్ కేసులకు మించి కోలుకున్నవారిసంఖ్య

దేశవ్యాప్తంగా 17.5 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ

ఇప్పటిదాకా 18-44 వయోవర్గం వారికి 30 లక్షలు దాటిన టీకాలు

Posted On: 12 MAY 2021 12:31PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 37,04,099 కు తగ్గింది. ఇది మొత్తం నమోదైన పాజిటివ్ కేసులలో 15.87% వాటా.  గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 11,122 తగ్గింది. ఇలా చికిత్సలో ఉన్నవారి సంఖ్య తగ్గటం వరుసగా ఇది రెండో రోజు. ఆ విధంగా ప్రస్తుతం చికిత్సపొందుతూ ఉన్నవారిలో  82.51% మంది 13 రాష్టాలకు చెందినవారున్నారు.

 

గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో మార్పును రాష్ట్రాలవారీగా ఈ క్రింది చిత్ర పటంలో చూడవచ్చు.

 గత కొద్దివారాలుగా రోజురోజుకూ చికిత్స పొందుతూ ఉన్నవారి సంఖ్యలో మార్పును ఈ చిత్రపటంలో చూడవచ్చు.

 

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ బారినుంచి కోలుకున్నవారి సంఖ్య 1,93,82,642 కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం   83.04% గా నమోదైంది.. గడిచిన 24 గంటలలో 3,55,338 మంది కోవిడ్ బాధితులు కోలుకోగా కొత్తగా కోలుకున్నవారి సంఖ్య కంటే కొత్త కేసులు గత రెండు రోజులుగా తక్కువగా ఉండటం గమనార్హం.

కొత్తగా కోలుకున్నవారిలో 71.58% మంది పది రాష్టాలకు చెందినవారు.

భారత ప్రభుత్వం విదేశాల నుంచి అందుతున్న సాయాన్ని అత్యంత వేగంగా రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేస్తోంది. కోవిడ్ నియంత్రణలో రాష్టాలు చేస్తున్న కృషికి ఈ సాయం అండగా నిలుస్తోంది. ఇప్పటివరకు  9,200 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు, 5,243 ఆక్సిజెన్ సిలిండర్లు, 19 ఆక్సిజెన్ ఉత్పత్తి ప్లాంట్లు, 5,913 వెంటిలేటర్లు, సుమారు 3.44 లక్షల రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు అంతర్జాతీయం సాయంగా అందగా వాటిని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపింది. వేగగా రాష్ట్రాలకు చేరటానికి వీలుగా కస్టమ్స్, రవాణా అనుమతులను వేగవంతం చేసింది.

మరోవైపు  మూడో దశ టీకాల కార్యక్రమం కూదా మొదలవటంతో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 17.52 కోట్లు దాటింది.

ఈ ఉదయం 7 గంటలకు అందిన తాత్కాలిక నివేదిక ప్రకారం 25,47,534 శిబిరాల ద్వారా మొత్తం 17,52,35,991 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  95,82,449 మొదటి డోసులు.  65,39,376 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న  1,41,49,634  మొదటి డోసులు, 79,52,537 రెండో డోసులు, 18-45 వయోవరగం వారు తీసుకున్న 30,44,463  మొదటి డోసులు, 45-60 ఏళ్ళ వారు తీసుకున్న 5,58,83,416 మొదటి డోసులు, 78,36,168 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న  5,39,59,772 మొదటి డోసులు, 1,62,88,176 రెండో డోసులు ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

95,82,449

2వ డోస్

65,39,376

కోవిడ్ యోధులు

1వ డోస్

1,41,49,634

2వ డోస్

79,52,537

18-44 వయోవర్గం

1వ డోస్

30,44,463

45 - 60 వయోవర్గం

1వ డోస్

5,58,83,416

2వ డోస్

78,36,168

60 పైబడ్డవారు

1వ డోస్

5,39,59,772

2వ డోస్

1,62,88,176

 

మొత్తం

17,52,35,991

 

ఇప్పటిదాకా దేశమంతటా ఇచ్చిన టీకాలలో 66.67% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం.

18-44 వయోవర్గానికి చెందిన 4,79,282 మందికి  గత 24 గంటల్లో మొదటి డోస్ ఇచ్చారు. దీంతో ఈ వయోవర్గంలో ఇప్పటిదాకా 30 రాష్టాలు, కేంద్రపాలితప్రాంతాలకు చెందిన   30,44,463 మంది మొదటిడోస్ టీకాలు తీసుకున్నట్టయింది.   ఆయా రాష్టాలలో 18-44 వయోవర్గం వారు తీసుకున్న టీకాల వివరాలు ఈ పట్టికలో ఉన్నాయి.

 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్-నికోబార్ దీవులు

1,099

2

ఆంధ్రప్రదేశ్

812

3

అస్సాం

1,22,442

4

బీహార్

2,39,453

5

చండీగఢ్

2

6

చత్తీస్ గఢ్

1,026

7

ఢిల్లీ

4,21,487

8

గోవా

1,344

9

గుజరాత్

3,56,297

10

హర్యానా

3,30,236

11

హిమాచల్ ప్రదేశ్

14

12

జమ్మూ కశ్మీర్

29,659

13

జార్ఖండ్

94

14

కర్నాటక

47,627

15

కేరళ

586

16

లద్దాఖ్

86

 17

మధ్యప్రదేశ్

48,985

18

మహారాష్ట్ర

5,96,090

19

మేఘాలయ

4

20

నాగాలాండ్

4

21

ఒడిశా

69,018

22

పుదుచ్చేరి

1

23

పంజాబ్

4,835

24

రాజస్థాన్

4,91,826

25

తమిళనాడు

19,810

26

తెలంగాణ

500

27

త్రిపుర

2

28

ఉత్తరప్రదేశ్

2,17,292

29

ఉత్తరాఖండ్

34,157

30

పశ్చిమ బెంగాల్

9,675

మొత్తం 

30,44,463

 

గడిచిన 24 గంటలలో 24.4 లక్షలకు పైగా టీకా డోసులు ఇచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన 116వ రోజైన 18,543 శిబిరాల ద్వారా మే 11న 24,46,674 టీకా డోసుల పంపిణీ జరిగింది. వారిలో 10,92,452 మంది మొదటి డోస్ తీసుకోగా 13,54,222 మంది రెండో డోస్ తీసుకున్నారు.

తేదీ : మే 11, 2021 (116వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

17,147

2వ డోస్

32,699

కోవిడ్ యోధులు

1వ డోస్

90,338

2వ డోస్

96,445

18-44 వయోవర్గం

1వ డోస్

4,79,282

45 -60 వయోవర్గం

1వ డోస్

3,58,076

2వ డోస్

6,19,017

60 పైబడ్డవారు

1వ డోస్

1,47,609

2వ డోస్

6,06,061

మొత్తం

1వ డోస్

10,92,452

2వ డోస్

13,54,222

 

గత 24 గంటలలో 3,48,421 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో పది రాష్ట్రాల వాటా  71.22% ఉంది. మహారాష్టలో అత్యధికంగా ఒక రోజులో  40,956 కేసులు రాగా, కర్నాటకలో 39,510, కేరళలో  37,290 వచ్చాయి.

దేశంలొ రోజువారీ జరుగుతున్న కోవిడ్ పరీక్షలను, నిర్థారణ జరుగుతున్న కేసులను ఈ దిగువ చిత్రపటం చూపుతోంది

జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల శాతం ప్రస్తుతం 1.09% గా ఉంది. గత 24 గంటలలో 4,205 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.  ఇందులో పది రాష్ట్రాల వాటా  73.17%  కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 793 మంది, కర్నాటకలో 480 మంది ఒకరోజులో కోవిడ్ తో చనిపోయారు. 

***

 



(Release ID: 1717914) Visitor Counter : 184