ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు/ యుటిలతో కోవిడ్ వాక్సినేషన్ పురోగతిని సమీక్షించిన కేంద్రం
రెండవ డోసుకు ప్రాధాన్యత కల్పించనున్న రాష్ట్రాలు; రెండవ డోసుకోసం భారత ప్రభుత్వ మార్గం ద్వారా కేటాయించిన వాక్సిన్లలో కనీసం 70% కేటాయింపు
కనీస వాక్సిన్ వృధాపై రాష్ట్రాల దృష్టి; వాక్సిన్ ఉత్పత్తిదారులతో నిత్యం ఫాలో అప్; రెండవ డోస్ తీసుకునేందుకు ప్రజలలో అవగాహన కల్పించడం
Posted On:
11 MAY 2021 2:58PM by PIB Hyderabad
కోవిడ్ టీకాకరణ (వాక్సినేషన్) ఏ స్థాయిలో సాగుతోందో సమీక్షించేందుకు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్ఎం) ఎండీలతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, కోవిడ్19 పై పోరాటం చేసేందుకు టెక్నాలజీ, డాటా మేనేజ్‌మెంట్ పై సాధికార బృందం చైర్మన్, కోవిడ్ -19 వాక్సీన్ర్వహణపై జాతీయ నిపుణుల బృంద సభ్యుడు డాక్టర్ ఆర్ ఎస్ శర్మ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ అతిపెద్ద కార్యక్రమాలలో ఒకటైన దేశవ్యాప్త కోవిడ్ 19 వాక్సినేషన్ కార్యక్రమాన్ని 16 జనవరి 2021న ప్రారంభించారు. సరళీకరించిన ధరలు, వేగవంతమైన జాతీయ కోవిడ్ 19 వాక్సినేషన్ వ్యూహంతో 1 మే,2021 నుంచి 18 ఏళ్ళుపై బడిన పౌరులను జోడించేందుకు దానిని విస్త్రత పరచారు.
రాష్ట్ర నిర్ధిష్ట డాటాతో వాక్సినేషన్ డ్రైవ్‌కు సంబంధించిన వివిధ అంశాలను పట్టి చూపుతూ వివరణాత్మకమైన ప్రెసెంటేషన్‌ను ఇచ్చిన తర్వాత, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి దిగువన పేర్కొన్న అంశాలను నొక్కి చెప్పారుః
మొదటి డోసు తీసుకున్న లబ్దిదారులందరికీ రెండవ డోసు కోసం లబ్ధిదారులకు ప్రాధాన్యత కల్పించాలి. రెండవ డోసు కోసం వేచి ఉన్న పెద్ద సంఖ్యలోని లబ్ధిదారుల అవసరాలను తీర్చాలి.
ఈ విషయంలో, రాష్ట్రాలు భారత ప్రభుత్వ మార్గాల ద్వారా (ఉచితంగా) సరఫరా చేసిన వాక్సిన్లలో 70%న్ని రెండవ డోసు వాక్సినేషన్ కోసం మిగిలిన 30%న్ని తొలి డోసు కోసం రిజర్వ్ చేయవచ్చు. అయితే ఇది సూచన మాత్రమే. రాష్ట్రాలు దానిని 100%నికి పెంచే స్వేచ్ఛ వారికి ఉంది. ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం కోసం రాష్ట్రాల వారీగా కోవిన్ గణాంకాలను వారితో పంచుకున్నారు.
రెండు డోసుల వాక్సిన్‌తో సంపూర్ణ వాక్సినేషన్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పేందుకు అవగాహనా ప్రచారలను చేపట్టవలసిందిగా రాష్ట్రాలను కోరారు.
ప్రాధాన్యత గ్రూపులు (45+ వయసున్న వారు, ఎఫ్ఎల్ డబ్ల్యు, హెచ్‌సిడబ్ల్యు)ను అత్యధికంగా కవర్ చేసిన వివరాలను అందిస్తూ, ప్రాధాన్యతా గ్రూపులకు వాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలను కోరారు.
భారత ప్రభుత్వ మార్గం ద్వారా రాష్ట్రాలకు అందచేయనున్న కోవిడ్ వాక్సిన్ల గురించి పారదర్శకమైన రీతిలో రాష్ట్రాలకు తెలియచేయడం జరిగింది. మెరుగైన, సమర్ధవంతమైన ప్రణాళికలను సిద్ధం చేసుకునేందుకు రానున్న పక్షానికి ఏ మేరకు ఇవ్వనున్నారో తెలియచేశారు. అలాగే, 15-31 మే కాలానికి కేటాయింపులను మే 14న వారికి తెలియజేయనున్నారు. రానున్న 15 రోజులకు తమ వాక్సినేషన్ సెషన్లకు ప్రణాళికలను సిద్ధం చేసుకునేందుకు రాష్ట్రాలు ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు.
అలాగే, వాక్సిన్ వృధాను కనీస స్థాయికి తీసుకురావలసిందిగా రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. మొత్తంగా చూసినప్పుడు చెప్పుకోదగినంతగా వృధా తగ్గినప్పటికీ, అనేక రాష్ట్రాలు ప్రధానంగా ఈ వృధాను తగ్గించవలసిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సూచించారు. వాక్సిన్లు యుక్తంగా ఉపయోగించేలా వాక్సిన్లను ఇచ్చేవారికి పునః శిక్షణను ఇచ్చి, నూతన అవగాహనను కల్పించవలసిందిగా రాష్ట్రాలకు/ కేంద్ర ప్రాంత ప్రాంతాలకు సూచించారు. జాతీయ సగటును మించిన అన్ని రకాల వృధాలను ఇకపై ఆ రాష్ట్రం లేక కేంద్ర పాలిత ప్రాంతాలకు తర్వాత ఇచ్చే కేటాయింపుల్లో సర్దుబాటు చేస్తారు.
ఈ నేపథ్యంలో, కొన్ని రాష్ట్రాలు తమ వద్దనున్న మంచి శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తల కారణంగా ప్రతికూల వృధా అవుతోందని నమోదు చేయగలిగాయి. సాధారణంగా కేటాయించిన దానికన్నా వారు ప్రతి వయాల్ నుంచి గరిష్టంగా డోసులను తీసి వినియోగిస్తున్నారు.
వాక్సినేషన్ సరళీకృత 3వ దశ వ్యూహంలో భాగంగా తెరిచిన భారత ప్రభుత్వం నుంచి కాని (ఒజిఒఐ) మార్గంలో సేకరిస్తున్న వాక్సిన్ల గురించి కూడా రాష్ట్రాలకు వివరించారు. ప్రైవేటు ఉత్పత్తిదారులకు రాష్ట్రాల నుంచి చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నందున, వాక్సిన్ ఉత్పత్తి దారులతో రోజువారీగా సమన్వయం చేస్తూ, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ సరఫరాలను పొందేందుకు రాష్ట్ర స్థాయిలో 2 లేదా 3 సీనియర్ అధికారులతో ఒక అంకితభావంగల బృందాన్ని ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ఇదే బృందం, ప్రైవేటు ఆసుపత్రులు కూడా వీటిని సేకరించేందుకు సహాయపడుతూ, రాష్ట్రం మొత్తంలో వాక్సినేషన్ కార్యక్రమ వేగాన్ని నిర్వహిస్తుంది.
వాక్సినేషన్ కార్యక్రమాన్ని మారుతున్న అవసరాలను ప్రతిఫలించేలా కోవిన్ ప్లాట్‌ఫాంలో మార్పులు చేస్తున్నారు. లక్ష్యిత బృందానికి వాక్సినేషన్‌ను పూర్తి చేయడానికి మెరుగైన ప్రణాళికను రూపొందించుకునేందుకు రాష్ట్రాలు రెండవ డోసు డ్యూ రిపోర్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ), కోవిడ్ వాక్సినేషన్ కేంద్రం (సివిసి) మేనేజర్లు డిమాండ్‌ను బట్టి (దానిని 100కు పరిమితం) చేస్తూ సెషన్ సామర్ధ్యాన్ని పెంచవచ్చు. ఓల్డ్ ఏజ్ హోముల వంటివాటిలో నిసించే సీనియర్ సిటిజన్ల వంటి లబ్ధిదారుల వద్ద తగిన ఫోటో ఐడి కార్డులు లేనప్పటికీ నమోదు చేసుకోవచ్చు. డిఐఓలు, సివిసి మేనేజర్లు కూడా వాక్సిన్ వినియోగ నివేదిక (వాక్సిన్ యుటిలైజేషన్ రిపోర్ట్- వియుఆర్)ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రెండవ డోసుకు స్లాట్‌లను రిజర్వు చేసుకునేందుకు త్వరలోనే కోవిన్ సరళీకరణను, ఫీచర్‌ను అందచేయనున్నట్టు ఇజి చైర్మన్ వెల్లడించారు. సాధ్యమైనంతవరకు కోవిన్‌ను అవసరాలకు అనుగణంగా తీర్చిదిద్దుతామని, ఎపిఐలను కూడా తెరుస్తామని అన్నారు. జారీ చేసే సర్టిఫికేట్‌లో అది ప్రతిఫలించేందుకు వ్యక్తులు రెండు డోసులకు ఒకే ఫోన్ నెంబర్‌ను ఉపయోగించాలని ప్రజలకు తెలియచేసేందుకు ఐఇసి ప్రచారం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. యదార్ధ, ప్రమాణికతలకు గల కీలక ప్రాముఖ్యతను డాక్టర్ శర్మ నొక్కి చెప్పారు. ఎవరికైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా టీకాలు అందించే కోవిన్ మంత్రాన్ని సమర్థించడానికి పరిమితి ప్రమాణాలను ఉపయోగించకుండా ఉండాలని ఆయన రాష్ట్రాలను కోరారు.
****
(Release ID: 1717902)
Visitor Counter : 257