రైల్వే మంత్రిత్వ శాఖ

ఒకే రోజున రికార్డు స్థాయిలో 831 ఎంటీల ద్రవ రూప ఆక్సిజన్ ను రవాణా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు


మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,హర్యానా, తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లకు 4700 ఎంటీల ఆక్సిజన్ చేర్చిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు

వివిధ రాష్ట్రాలకు 295 ట్యాంకర్లతో ఆక్సిజన్ రవాణా

ప్రయాణాన్ని పూర్తి చేసిన 75 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు

120 ఎంటీ ల ఆక్సిజన్ తో కర్ణాటక లోనే బెంగళూరు కు బయలుదేరిన తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

ఇంతవరకు మహారాష్ట్ర కు 293 ఎంటీ, ఉత్తరప్రదేశ్ కు 1334 ఎంటీ, మధ్యప్రదేశ్ కు 306 ఎంటీ, హర్యానాకు 598 ఎంటీ, తెలంగాణాకు 123 ఎంటీ, రాజస్థాన్ కు 40 ఎంటీ, ఢిల్లీకి 2011 ఎంటీ ల ఆక్సిజన్ చేరవేత

Posted On: 10 MAY 2021 5:08PM by PIB Hyderabad

అడ్డంకులు సమస్యలను అధిగమిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు ద్రవ రూపంలో ఉన్న ఆక్సిజన్ ను భారత రైల్వేలు  ఇంతవరకు భారత రైల్వేలు 4700 ఎంటీ ల ద్రవ రూప ఆక్సిజన్ ను రాష్ట్రాలకు చేరవేశాయి. 

నిన్న ఒక్కరోజులోనే భారత రైల్వేలు రికార్డ్ స్థాయిలో ద్రవ రూపంలో ఉన్న 831 ఎంటీల ఆక్సిజన్ ను రవాణా చేశాయి. 

ఇంతవరకు 75 ఆక్సిజన్ఎక్స్‌ప్రెస్ లు తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయి. 

రాష్ట్రాల నుంచి అందిన అభ్యర్ధనల మేరకు సాధ్యమైనంత తక్కువ సమయంలో ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ ను సరఫరా చేయాలన్న లక్ష్యంతో భారత రైల్వేలు పనిచేస్తున్నాయి. 

తాజా సమాచారం ప్రకారం భారత రైల్వేలు  మహారాష్ట్ర కు 293 ఎంటీ, ఉత్తరప్రదేశ్ కు 1334 ఎంటీ, మధ్యప్రదేశ్ కు 306 ఎంటీ, హర్యానాకు  598 ఎంటీ, తెలంగాణాకు 123 ఎంటీ, రాజస్థాన్ కు 40 ఎంటీ, ఢిల్లీకి 2011 ఎంటీ ల ఆక్సిజన్ ను రవాణా చేశాయి. 

కర్ణాటక రాష్ట్రానికి ఝార్ఖండ్ లోని టాటానగర్ నుంచి తొలి ఆక్సిజన్ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది. ఈ ఆక్సిజన్ఎక్స్‌ప్రెస్ 120 ఎంటీల ఆక్సిజన్ తో బెంగుళూరు కు బయలుదేరింది. 

ఆక్సిజన్ ను రవాణా చేయడం సంక్లిష్టంగా  దీనికి సంబందించిన సమాచారం మారుతూ వస్తుంది. ఈ రోజు మరికొన్ని రైళ్లు ఆక్సిజన్ తో తమ ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 

***


(Release ID: 1717517) Visitor Counter : 184