ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన ఉచిత టీకా డోసులు 18 కోట్లు


రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర కోటికి పైగా డోసుల నిల్వ

వచ్చే 3 రోజుల్లో రాష్ట్రాలకు అందనున్న 9 లక్షల డోసులు

Posted On: 10 MAY 2021 10:42AM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారీ ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స   అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటింపజేయటం, టీకాలివ్వటం అనే ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా  టీకాల మీద  ప్రత్యేక దృష్టిసారించింది.

 

భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు  దాదాపు 18 కోట్లకు పైగా (17,93,57,860)  కోవిడ్ డోసులు ఉచితంగా అందజేసింది. ఇందులో రాష్ట్రాల వాడకం, వృధా కలిపి 16,89,27,797 డోసులు ఉన్నట్టు ఈ ఉదయం 8 గంటల వరకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

 

రాష్ట్రాల దగ్గర ఇంకా కోటికి పైగా  (1,04,30,063) టీకా డోసులు పంపిణీకి అందుబాటులో ఉన్నాయి. కొన్ని చోట్ల లోటు  కనబడుతున్నప్పటికీ అది ఎక్కువ వాడకం లేదా వృధాను చూపుతోంది. సాయుధ దళాలకిచ్చిన టీకాల సంఖ్యను సమన్వయం చేసుకోకపోవటం కూడా కనిపించింది.

 

పైగా, మరో 9 లక్షల (9,24,910) టీకా డోసులు వచ్చే 3 రోజుల్లో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపబోతోంది

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0010VLH.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002S8EA.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003P8Z2.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004DNRD.jpg

 

****


(Release ID: 1717431) Visitor Counter : 197