శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారత్-యూకే ల మధ్య శిఖరాగ్ర సదస్సు


శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారానికి అంగీకారం

Posted On: 07 MAY 2021 10:19AM by PIB Hyderabad

శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింతగా కలసి పనిచేయడానికి భారతదేశం, యూకే దేశాలు అంగీకరించాయి. భారత ప్రధానమంత్రి శ్రీ నరెంద్రమోది, యూకే ప్రధానమంత్రి  బోరిస్ జాన్సన్ లు రెండు దేశాల మధ్య పది సంవత్సరాలపాటు 2030 వరకు వివిధ అంశాలపై సమగ్ర వ్యూహాత్మక ఆవగాహనతో కలసి పనిచేయాలని నిర్ణయించారు. దీనికోసం ఒక సమగ్ర ప్రణాళికను అమలు చేయాలని రెండు దేశాల ప్రధానమంత్రులు అంగీకరించారు. 

2021 మే నాల్గవ తేదీన వర్చ్యువల్ విధానంలో  రెండు దేశాల ప్రధానమంత్రులు సమావేశమయ్యారు. సైన్స్, విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణల రంగాల్లో కలసి పనిచేయాలన్న తమ ఆలోచనలను సమావేశంలో చర్చించారు. దీనిపై మంత్రులస్థాయి  సైన్స్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ మరింతగా చర్చలు జరుపుతుంది. 

రెండు దేశాల మధ్య వివిధ అంశాలపై కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలపై ప్రధానమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. 

టెలికమ్యూనికేషన్స్ / ఐసిటి పై అవగాహనకు వచ్చిన రెండు దేశాలు డిజిటల్ టెక్నాలజీ పై ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. సాంకేతిక రంగం, కోవిడ్-19 పై పరిశోధనల నిర్వహణపై చర్చలు జరపాలని రెండు దేశాలు అంగీకరించాయి. జంతువుల ద్వారా మనుషులకు సోకే వ్యాధులపై జరుగుతున్న పరిశోధనలలో భాగస్వామ్యం కావాలని, వాతావరణం, పర్యావరణ శాస్త్రాలలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించిన రెండు దేశాలు యూకే - ఇండియా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ను కొనసాగించాలని నిర్ణయించాయి. 

రెండు దేశాల మధ్య ప్రస్తుతం వాక్సిన్ భాగస్వామ్య ఒప్పందాన్ని కొనసాగించి దీనిని మరింత విస్తృతం చేయాలని రెండు దేశాల ప్రధానమంత్రులు నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రా జెనకా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాల మధ్య యూకే లో అభివృద్ధి చేయబడి, భారతదేశంలో ఉత్పత్తి అవుతూ ప్రపంచవ్యాపితంగా పంపిణీ జరుగుతున్న కోవిడ్-19 వాక్సిన్ విజయవంతం కావడాన్ని వారు గుర్తు చేశారు. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల నుంచి అంతర్జాతీయ సమాజం గుణపాఠం నేర్చుకొని ప్రపంచ  ప్రపంచ ఆరోగ్య భద్రత కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థను మరింతబలోపేతం చేయడానికి ముందుకు రావాలని రెండు దేశాల ప్రధానమంత్రులు పిలుపు ఇచ్చారు. 

రెండు దేశాల మధ్య కుదిరిన ఎస్టీఐ సహకార ఒప్పందం ముఖ్య అంశాలు:

 1. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు పరిశోధనా సంస్థలలో స్టెమ్ లో మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పించే అంశంలో కలసి పనిచేస్తూ స్టెమ్ లో నూతన ఒరవడిని సృష్టించడానికి మహిళలు,  లింగ అభివృద్ధి కోసం పరివర్తన సంస్థల (జెండర్ అడ్వాన్స్‌మెంట్)  ప్రాజెక్ట్ లను అమలు చేయడం

 2. ఇండియా ఇన్నోవేషన్ కాంపిటెన్సీ ఎన్‌హాన్స్‌మెంట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయ శిక్షణ, మార్గదర్శకత్వం మరియు ప్రపంచ ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యంపై దృష్టి పెట్టడం ద్వారా పాఠశాల విద్యార్థులలో ఆవిష్కరణలను పెంపొందించడానికి పరిశ్రమ, విద్యారంగం  ప్రభుత్వం మధ్య సహకారాన్ని పెంపొందించడం. 

3. ఉమ్మడి కార్యక్రమాల ద్వారా నాణ్యత, ప్రభావం చూపే  పరిశోధన మరియు ఆవిష్కరణలకు ప్రాధాన్యత  ఇరు దేశాల మధ్య ప్రస్తుతం పరిశోధన, సైన్స్ మరియు ఇన్నోవేషన్ మౌలిక సదుపాయాల రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలను, రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలను కొనసాగించడం.  ఆరోగ్యం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, వాతావరణం, స్వచ్ఛ ఇంధన  శక్తి, పట్టణ అభివృద్ధి మరియు ఇంజనీరింగ్ రంగాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాలు, వ్యర్థాల నుండి సంపద, ఉత్పత్తి, సైబర్ భౌతిక వ్యవస్థలు,అంతరిక్ష రంగాలతో ఇతర ప్రాధాన్యతా  రంగాలలో యుకె మరియు భారతదేశాలను ప్రపంచ అగ్రగామి దేశాలుగా తీర్చిదిద్దడం. 

4. ప్రాథమిక పరిశోధన నుండి అనువర్తిత మరియు ఇంటర్ డిసిప్లినరీ పరిశోధన వరకు మరింత ప్రభావం చూపే విధంగా పరిశోధనా కార్యక్రమాలను నిర్వహించి ప్రభుత్వ శాఖల పనితీసురు మెరుగు పరచడానికి, వాణిజ్య అంశాల నిర్వహణకు వ్యవస్థల వినియోగానికి రెండు దేశాలు భాగస్వాములు కావడం. 

5.విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణ వంటి రంగాల్లో ప్రస్తుతం అమలులో వున్న  ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత పటిష్టం చేస్తూ ప్రతిభ,  పరిశోధకులు  ఆవిష్కర్తలను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి ఉమ్మడి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థి మరియు పరిశోధకుల మార్పిడికి కొత్త అవకాశాలను అభివృద్ధి చేసి వారికి అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొని రావడం 

6. కృత్రిమ మేధస్సుకు సంబంధించిన జ్ఞానం మరియు నైపుణ్యాన్ని పంచుకోవడానికి కలిసి పనిచేస్తూ నైతిక విలువలు, శాస్త్రీయ విధానాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పరిశోధనలు, ఆవిష్కరణలను  ప్రోత్సహించడం. సాంకేతిక సదస్సుల నిర్వహణ ద్వారా ఆవిష్కర్తలు  శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు మరియు విధాన రూపకర్తలను ఒక వేదిక పైకి తీసుకొని వచ్చి డేటా  క్రాస్ కట్టింగ్ థీమ్ కింద భవిష్యత్ సాంకేతిక అవసరాల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ళపై కలిసి పనిచేయడం.

7. ఆవిష్కరణలకు దారితీసిన ఫాస్ట్ ట్రాక్ స్టార్ట్-అప్ ఫండ్, స్థిరమైన వృద్ధి మరియు ఉద్యోగాలు మరియు ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే సాంకేతిక సమస్యల పరిష్కారానికి సహకరించే కార్యక్రమాలను ప్రోత్సహించడం. సాంకేతికత ఆధారంగా పనిచేసే వినూత్న వ్యాపారాల వృద్ధిని సాధించడానికి  ఉమ్మడి పెట్టుబడితో భాగస్వామ్యాలను ప్రోత్సహించడం.   అంతర్జాతీయంగా అంకుర సంస్థలు, ఎంఎస్‌ఎంఇలను ప్రోత్సహించడం.  ఉదాహరణకు  స్థిరమైన అభివృద్ధిని సాధించి, 2030 నాటికి ప్రపంచ లక్ష్యాలను సాధించడానికి దోహదపడే వాతావరణం మరియు పర్యావరణ అంశాలు,  మెడ్ టెక్ పరికరాలు, పారిశ్రామిక బయోటెక్ మరియు వ్యవసాయ రంగాలు  

***

 



(Release ID: 1716940) Visitor Counter : 220