ఆయుష్

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ 64, కబసురా కుడినిర్ ఔషధం కోసం దేశవ్యాప్తంగా పంపిణీ ప్రచారా కార్యక్రమాన్ని ప్రారంభించింది


కోవిడ్-19 సెకండ్ వేవ్ ఎదుర్కోవడానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన కొత్త కార్యక్రమం ఇది

ఆసుపత్రిలో లేని కోవిడ్ రోగులకు వీటిని అందిస్తారు

Posted On: 07 MAY 2021 1:03PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్-19 సంక్రమణ  సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో భాగంగా  కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిరూపిత ఆయుర్వేద మూలికా ఔషధం ఆయుష్64,   సిద్ధ ఔషధం కబసురా కుడినీర్లను పంపిణీ చేయడానికి శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆసుపత్రుల్లో లేని కోవిడ్ రోగులకు వీటిని అందిస్తారు. ఈ రెండు మందులు సమర్థంగా పనిచేస్తాయని మల్టీ-సెంటర్ క్లినికల్ ట్రయల్స్ లో రుజువయింది. కేంద్ర యువజన, క్రీడల వ్యవహారాల మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్)  ఆయుష్ మంత్రి (అదనపు ఛార్జ్)   కిరెన్ రిజిజు ప్రారంభించిన ఈ  బహుళ మాధ్యమ ప్రచారం అవసరమైనవారికి మందులు పారదర్శకంగా,  సమర్థవంతంగా చేరుకునేలా చేస్తుంది. మందుల పంపిణీలో సేవా భారతి సంస్థ ఎంతో సహకరిస్తోంది. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వివిధ సంస్థల  నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, దశలవారీగా పంపిణీకి  సమగ్ర వ్యూహాన్ని రూపొందించారు.  ఇందుకోసం దేశవ్యాప్తంగా సేవా భారతి నెట్‌వర్క్ మద్దతు ఇస్తుంది. కోవిడ్-19 మహమ్మారి దేశాన్ని తాకినప్పటి నుండి వ్యాధిని నియంత్రించడం,  తగ్గించడం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది.  కోవిడ్ వ్యతిరేక పోరాటం కోసం ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో సన్నిహిత సహకారంతో పనిచేస్తోంది. ఆయుష్ -64,  కబసురా కుడినీర్ పంపిణీని దేశవ్యాప్తంగా ప్రారంభించడం ద్వారా  మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశం తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.  కోవిడ్  నియంత్రణ,  ఉపశమనం కోసం వ్యూహాలను రూపొందించి  అభివృద్ధి చేయడానికి వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఇంటర్ డిసిప్లినరీ ఆయుష్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ టాస్క్‌ఫోర్స్‌ను మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ఆయుష్ మందుల పాత్రను అర్థం చేసుకోవడానికి అనేక క్లినికల్  అబ్జర్వేషనల్ అధ్యయనాలను చేపట్టారు.   ఆయుష్ -64 పై వివిధ అధ్యయనాలు జరిగాయి. ఆయుర్వేద సూత్రీకరణతో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)  కబసుర కుడినీర్ను తయారు చేసింది. ఇదొక సంప్రదాయ సిద్ధ ఔషధం.

ఆయుష్-కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) సహకారంతో తేలికపాటి నుండి మోస్తరు లక్షణాలు ఉన్న రోగులపై ఆయుష్ 64  సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మల్టీ-సెంటర్ క్లినికల్ ట్రయల్ను పూర్తి చేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ (సిసిఆర్ఎస్)  కోవిడ్-19 రోగులపై కబసురా కుడినీర్ పనితీరును అంచనా వేయడానికి క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించారు. తేలికపాటి నుండి మోస్తరు కోవిడ్ -19 లక్షణాలు ఉన్న బాధితులకు కూడా ఇది ఉపయోగపడుతుంది.  

నేషనల్ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ కోవిడ్-19 చికిత్సలో ఆయుర్వేదం,  యోగాలను చేర్చడానికి మంత్రిత్వ శాఖ ఒక ఇంటర్ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఐసిఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వి ఎం కటోచ్ ఈ కమిటీకి అధ్యక్షుడు. ఆయుర్వేదం,  యోగా ఆధారంగా తయారైన ఆయుష్–64ను నేషనల్ క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌లో చేర్చారు. ఐసిఎంఆర్  కోవిడ్ మేనేజ్‌మెంట్‌పై ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్...హోం ఐసోలేషన్‌లోని కోవిడ్ -19 రోగులతో వ్యవహరించాల్సిన విధానంపై ఆయుర్వేద ప్రాక్టీషనర్లకు మార్గదర్శకాలను సూచించింది. ఆయుష్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కోవిడ్ -19  చికిత్స కొరకు సిద్ధా ప్రాక్టీషనర్స్  కబసురా కుడినిర్ ఇవ్వవచ్చని సిఫార్సు చేసింది.  రోగ లక్షణాలు లేని, తేలికపాటి నుండి మోస్తరు లక్షణాలు ఉన్న  కోవిడ్-19  రోగులకు ఆయుష్ -64,  కబసురా కుడినీర్ వాడగా  ఆశించిన ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందుల పంపిణీ కోసం దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. హోం ఐసోలేషన్లో ఉన్న వాళ్లు ఆయుష్ మందులతో  ప్రయోజనం పొందవచ్చు

 

***


(Release ID: 1716816) Visitor Counter : 392