ఆర్థిక మంత్రిత్వ శాఖ
17 రాష్ట్రాలకు రూ.9,871 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్ విడుదల
- గడిచిన రెండు నెలల కాలంలో రాష్ట్రాలకు మొత్తం రూ.19,742 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంట్ విడుదల
Posted On:
06 MAY 2021 4:26PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రోజు 17 రాష్ట్రాలకు రూ.9871 కోట్ల మేర 2వ నెలవారీ పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ (పీడీఆర్‌డీ) గ్రాంట్‌ను విడుదల చేసింది. 2వ విడత విడుదలతో కలుపుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలల్లో కేంద్రం మొత్తం రూ.19,742 కోట్ల మేర పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను రాష్ట్రాలకు విడుదల చేసినట్టయింది. గురువారం రాష్ట్రాల వారీగా విడుదల చేసిన గ్రాంట్ వివరాలు, 2021-22లో రాష్ట్రాలకు విడుదల చేసిన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ మొత్తంల వివరాలు ఈ కిందన జతచేయబడ్డాయి. కేంద్రం రాజ్యాంగంలో గల ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను అందిస్తు వస్తోంది.
రాష్ట్రాల రెవెన్యూ అకౌంట్లలోని లోటును తీర్చడానికి ఆర్థిక కమిషన్ సిఫారసుల ప్రకారం నెలవారీ వాయిదాలలో ఈ గ్రాంట్లు విడుదల చేయబడతాయి. 15వ ఆర్థిక కమిషన్ 17 రాష్ట్రాలకు పోస్ట్ డెవల్యూషన్ రిలీజ్ డెఫిసిట్ గ్రాంట్‌లను సిఫారసు చేసింది. పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు మంజూరు కోసం సిఫార్సు చేసిన రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, సిక్కిం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ మంజూరును స్వీకరించడానికి రాష్ట్రాల అర్హతలను మరియు గ్రాంట్ పరిమాణం మొత్తాన్ని కూడా కమిషన్ నిర్ణయించింది. ఆదాయ అంచనా మరియు రాష్ట్ర వ్యయాల మధ్య వ్యత్యాసం ఆధారంగా దీనిని నిర్ణయించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను అంచనా అధికారాన్ని కూడా కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. 15వ ఫైనాన్స్ కమిషన్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు మొత్తం రూ.1,18,452 కోట్ల మేర
పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను సిఫారసు చేసింది. ఈ గ్రాంట్ 12 నెలవారీ వాయిదాలలో ఆయా రాష్ట్రాలకు విడుదలవుతుంది.
రాష్ట్రాల వారీగా విడుదల చేయబడిన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్
క్రమ సంఖ్య
|
రాష్ట్రం పేరు
|
మే 2021 లో విడుదల చేసిన మొత్తం
(2 వ విడత)
(రూ. కోట్లలో)
|
2021-22లో విడుదల చేసిన మొత్తం
(ఏప్రిల్ + మే 2021)
(రూ. కోట్లలో)
|
|
ఆంధ్రప్రదేశ్
|
1438.08
|
2876.16
|
|
అస్సాం
|
531.33
|
1062.66
|
|
హర్యానా
|
11.00
|
22
|
|
హిమాచల్ ప్రదేశ్
|
854.08
|
1708.16
|
|
కర్ణాటక
|
135.92
|
271.84
|
|
కర్ణాటక
|
1657.58
|
3315.16
|
|
మణిపూర్
|
210.33
|
420.66
|
|
మేఘాలయ
|
106.58
|
213.16
|
|
మిజోరం
|
149.17
|
298.34
|
|
నాగాలాండ్
|
379.75
|
759.5
|
|
పంజాబ్
|
840.08
|
1680.16
|
|
రాజస్థాన్
|
823.17
|
1646.34
|
|
సిక్కిం
|
56.50
|
113
|
|
తమిళనాడు
|
183.67
|
367.34
|
|
త్రిపుర
|
378.83
|
757.66
|
|
ఉత్తరాఖండ్
|
647.67
|
1295.34
|
|
పశ్చిమ బెంగాల్
|
1467.25
|
2934.5
|
|
మొత్తం
|
9,871.00
|
19,742.00
|
****
(Release ID: 1716642)
Visitor Counter : 203