ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచం నలుమూలలనుంచి అందే కోవిడ్ సామగ్రిని సమర్థంగా రాష్ట్రాలకు కేటాయిస్తున్న కేంద్రం


దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా వేసిన టీకా డోసులు 16.25 కోట్లు

మూడో దశకింద 18-44 వయోవర్గంలో 9 లక్షలమందికి పైగా టీకాలు

గత 24 గంటల్లో కోలుకున్నవారు 3.29 లక్షలమంది
ఏప్రిలో సగటున కోలుకుంటున్నవారు 53 వేల నుంచి 3 లక్షలకు పెరుగుదల

Posted On: 06 MAY 2021 11:16AM by PIB Hyderabad

గత కొద్ది వారాలుగా దేశంలో కోవిడ్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజువారీ కొత్త కేసుల సంఖ్య, మరణాల సంఖ్య

ఇలా ఒక్క సారిగ పెరగటంతో అనేక రాష్ట్రాలలో మౌలిక సదుపాయాలమీద వత్తిడి పెరిగి లోటు ఏర్పడింది. వసుధైవ కుటుంబకమ్

నినాదాన్ని అనుసరిస్తూ ప్రపంచదేశాలు ఈ కోవిడ్ మహమ్మారిమీద పొరాడుతున్న భారత ప్రభుత్వానికి సహాయ హస్తం అందిస్తూ

వస్తున్నాయి. ఆ విధంగా ఏప్రిల్ 27 నుంచి వివిధ దేశాల నుంచి, సంస్థలనుంచి  విరాళాలు  ధన, వస్తు రూపంలో అందుతూనే

ఉన్నాయి. అందులో కోవిడ్ మందులు, వైద్య పరికరాలు ఉన్నాయి.  ఆ విధంగా ఇప్పటి దాకా అందుకున్న సహాయంలో అధికభాగం

ఎప్పటికప్పుడు పంపిణీ జరిగిపోతూనే ఉంది. ఇది నిరవధికంగా కొనసాగే ప్రక్రియ. ఈ క్లిష్ట సమయంలో ఈ విధంగా అందిన

సహాయాన్ని వివిధ మార్గాల ద్వారా అన్ని అవసరమున్న రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ పంపటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

 

మరోవైపు దేశవ్యాప్తంగా  మూడో దశ టీకాల కార్యక్రమం కూడా మొదలుకాగా ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 16.25 కోట్లు

దాటింది. మూడో దశలో భాగంగా 18-44 వయో వర్గం వారికి టీకాలు మొదలుకాగా 12 రాష్ట్రాలకు చెందిన  9,04,263 మంది

లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకున్నారు. ఈ రాష్ట్రాల్లో చత్తీస్ గఢ్ (1,026), ఢిల్లీ (1,29,096), గుజరాత్(1,96,860),

జమ్మూ-కశ్మీర్ (16,387), హర్యానా (1,23,484), కర్నాటక (5,328), మహారాష్ట్ర (1,53,966), ఒడిశా  (21,031),

పంజాబ్  (1,535), రాజస్థాన్ (1,80,242), తమిళనాడు  (6,415),  ఉత్తరప్తదేశ్  (68,893) ఉన్నాయి..

 

మొత్తం ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 29,34,844 శిబిరాల ద్వారా 16,25,13,339 టీకా

డోసుల పంపిణీ జరగగా  అందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న  94,80,739 మొదటి డోసులు, 63,54,113 రెండో డోసులు,

కొవిడ్ యోధులు అందుకున్న 1,36,57,922 మొదటి డోసులు,  74,25,592 రెండో డోసులు, 18-44 వయసున్నవారు తీసుకున్న

మొదటి డోసులు 9,04,263 ఉన్నాయి. అదే విధంగా   60 ఏళ్ళు పైబడ్డ వారు తీసుకున్న  5,31,16,901 మొదటి డోసులు,

1,29,15,354 రెండో డోసులు, 45-60 ఏళ్ళ మధ్య వారి మొదటి డోసులు 5,38,15,026, రెండో డోసులు 48,43,429 ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

94,80,739

2వ డోస్

63,54,113

కోవిడ్ యోధులు

1వ డోస్

1,36,57,922

2వ డోస్

74,25,592

18-44  వయోవర్గం వారు

1వ డోస్

9,04,263

45 -60 వయో వర్గం వారు

1వ డోస్

5,38,15,026

2వ డోస్

48,43,429

60 ళ్ళు పైబడ్డవారు

1వ డోస్

5,31,16,901

2వ డోస్

1,29,15,354

 

మొత్తం

16,25,13,339

 

 

ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసులలో పది రాష్ట్రాలదే  66.87% వాటా ఉంది.

గత 24 గంటలలో  19 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.  టీకాల పంపిణీ మొదలైన 110 వ రోజైన ఏప్రిల్ 5న మొత్తం

19,55,733 టీకాలు వేశారు. అందులో 15,903 శిబిరాల ద్వారా  8,99,163 మంది మొదటి డోస్, 10,56,570 మంది రెండో

డోస్ తీసుకున్నారు. .

తేదీ: మే 5, 2021 (110వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

1వ డోస్

17,530

2వ డోస్

30,844

కోవిడ్ యోధులు

1వ డోస్

88,803

2వ డోస్

89,932

18-44 వయోవర్గం

1వ డోస్

2,32,028

45-60 వయోవర్గం

1వ డోస్

4,02,585

2వ డోస్

4,21,409

60 పైబడ్డవారు

1వ డోస్

1,58,217

2వ డోస్

5,14,385

మొత్తం

1వ డోస్

8,99,163

2వ డోస్

10,56,570

 

భారతదేశంలో మొత్తం కోవిడ్ బారినుంచి బైటపడినవారి సంఖ్య 1,72,80,844 కు చేరింది. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం

81.99% కి చేరింది. గత 24 గంటలలో 3,29,113  మంది కోలుకున్నారు. ఇందులో  పది రాష్ట్రాల వాటా 74.71% 

వారం వారం రోజువారీ కోలుకున్నవారి సమాచారాన్ని దిగువ చిత్రపటం చూపుతోంది. ఏప్రిల్ ఆరంభంలో కేవలం 53,816

మాత్రమే వారపు సగటు కోలుకున్నవారు ఉండగా అది చివరి వారానికి అది 3 లక్షలు దాటి 3,13,424కు చేరింది. 

 

గత 24 గంటలలో 4,12,262 కొత్త కేసులు వచ్చాయి. పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, హర్యానా,

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ లలోనే  72.19% కొత్త కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా .

57,640 కేసులు రాగా కర్నాటకలో 50,112, కేరళలో  41,953 కేసులు వచ్చాయి.

 

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సపొందుతున్నవారి సంఖ్య 35,66,398 కి చేరుకోగా అది దేశంలో ఇప్పటిదాకా నమొదైన

పాజిటివ్ కేసులలో 16.92% .  గత 24 గంటలలో నికరంగా పెరిగిన చికిత్సలో ఉన్న కేసులు  79,169. ఇందులో 12 రాష్ట్రాల

వాటా 81.05% ఉంది.

జాతీయ స్థాయిలో కోవిడ్  బాధితులలో మరణాల శాతం క్రమంగా తగ్గుతూ 1.09% దగ్గర ఉంది. గత 24 గంటలలో .

3,980 మంది కోవిడ్ తో మరణించారు. ఇందులో పది రాష్ట్రాల వాటా 75.55% కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 920 మరణాలు,

ఆ తరువాత స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 353 మరణాలు నమోదయ్యాయి.  

 

గత 24 గంటలలో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి:

డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్ 

***


(Release ID: 1716617) Visitor Counter : 229