మంత్రిమండలి

2021 మే మరియు జూన్, మరో రెండు నెలల కాలానికి ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (దశ III) కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులకు అదనపు ఆహార ధాన్యాలను సరఫరా ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం

Posted On: 05 MAY 2021 12:12PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ కింది నిర్ణయానికి ఆమోదం తెలిపింది. 

ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలోకి వచ్చే (ఏఏవై ,పిహెచ్హెచ్) 2021 మే, జూన్ నెలల్లో అదనంగా   ప్రధాన్ మంత్రి గరీబ్  కళ్యాణ్ అన్న యోజన దశ III- కింద మనిషికి నెలకి అయిదు కిలోల చొప్పున ఆహారధాన్యాలను సరఫరా చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివల్ల 79.88 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుంది. డిబిటి పరిధిలో వున్నవారికి కూడా ఈ ప్రయోజనాన్ని వర్తింప చేస్తారు. 

ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద జరుగుతున్న కేటాయింపుల నిష్పత్తి ఆధారంగా ఆహారప్రజా పంపిణీ శాఖ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు  అదనపు కేటాయింపులనునిర్ణయిస్తుంది. వర్షాలు, తుపానులు లాంటి వాతావరణ పరిస్థితులు, వివిధ ప్రాంతాల్లో అమలులో వున్న సంపూర్ణ పాక్షిక లాక్ డౌన్ పరిస్థితులు , కోవిడ్ వల్ల నెలకొన్న పరిస్థితులు, రవాణా లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని అదనపు కేటాయింపుల ( బియ్యం/ గోధుమ) తరలింపు సమయాలను ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ నిర్ణయిస్తుంది. 

ఈ కార్యక్రమంలో దాదాపు 80 ఎంటి ల ఆహారధాన్యాలు పంపిణీ అవుతాయి. 

టిపిడిఎస్ కింద  సుమారు 79.88 కోట్ల మంది వ్యక్తులకు నెలకు కిలోల చొప్పున రెండు నెలల పాటు అదనపు ఆహార-ధాన్యాన్ని ఉచితంగా కేటాయించడం వల్ల  25332.92 కోట్ల రూపాయలను ఆహార రాయితీగా చెల్లించవలసి ఉంటుంది.  36789.2 ఎంటీల బియ్యం,  25731.4 ఎంటీల గోధుమలను పంపిణీ చేస్తారు. 

 కరోనా వైరస్ వల్ల కలిగిన నష్టాలతో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న పేదలకు అదనపు సరపహారాలు ఉపశమనాన్ని కలిగిస్తాయి. దీనివల్ల పేదలకు  ఆహార ధాన్యాల కొరతను ఎదురు కాదు. 

***



(Release ID: 1716225) Visitor Counter : 252