పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
డ్రోన్లను ప్రయోగాత్మకంగా బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (BVLOS) ఎగురవేసేందుకునిర్వహించడానికి మినహాయింపు
Posted On:
05 MAY 2021 11:41AM by PIB Hyderabad
మానవరహిత విమాన వ్యవస్థ (అన్‌మాన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టం - యుఎఎస్) నిబంధనలు,2021 కింద 20 సంస్థలకు డ్రోన్లను ప్రయోగాత్మకంగా దృశ్యమానానికి ఆవల (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ -బివిఎల్ఒఎస్) ఎగురవేసేందుకు పౌర విమానయాన శాఖ షరతులతో కూడిన మినహాయింపును ఇచ్చింది. దృశ్యమానానికి ఆవల డ్రోన్ల కార్యకలాపాలకు సంబంధించిన తదుపరి యుఎవి నిబంధనల అనుబంధ చట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ప్రాథమిక అనుమతులు తోడ్పడనున్నాయి.
భవిష్యత్తులో డ్రోన్ల ద్వారా సరఫరాలు, డ్రోన్లను ఉపయోగించి ఇతర ప్రధాన అనువర్తనాలకు చట్రాన్ని రూపొందించడంలో బివిఎల్ఒఎస్ ప్రయోగాలు సాయపడతాయి.
దృశ్యమానానికి ఆవల డ్రోన్లను ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణను (ఇఒఐ - ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) ఆహ్వానించేందుకు బివిఎల్ఒఎస్ ప్రయోగాత్మక అంచనా, పర్యవేక్షణ కమిటీ (బివిఎల్ఒఎస్ ఎక్స్‌పెరిమెంట్ అసెస్‌మెంట్ అండ్ మానిటరింగ్ కమిటీ -బిఇఎఎం)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పైన పేర్కొన్న యోచనపై డైరొక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఆసక్తి వ్యక్తీకరణ నోటీసును (27046/70/2019 -ఎఇడి-డిజిసిఎ- తేదీ 13 మే,2019) జారీ చేసింది. ప్రయోగాత్మకంగా డ్రోన్లను ప్రయోగించేందుకు తమకు అందిన 34 ఇఒఐలను బిఇఎఎం కమిటీ అంచనా వేసి, మొత్తం 20 కన్సోర్షియా (ఎంపిక చేసిన కన్సోర్షియా)ను ఎంపిక చేసింది.
ఈ మినహాయింపులు బిఇఎఎం కమిటీ జారీ చేసిన నిబంధనలు/ మినహాయింపులు (లేదా భవిష్యత్తులో జారీ చేయనున్నవి) ఇఒఐ నోటీసులో పేర్కొన్న ఉత్తరువులకు పూర్తిగా కట్టుబడి ఉండాలి. ఈ షరతులతో కూడిన మినహాయింపులు ఒక ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటాయి లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు, ఏది ముందు అయితే అందుకు అనుగుణంగా ఉనికిలో ఉంటాయి.
ప్రయోగాత్మక బివిఒఎల్ఎస్ డ్రోన్ కార్యకలాపాలకు ఎంపిక చేసిన కన్సోర్షియా జాబితా
1. ఎయిరోస్పేస్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తమిళనాడు (ఎఐడిఎటి)
2.ఎఎన్ఆర్ఎ కన్సోర్షియం ఎ
3. ఎఎన్ఆర్ఎ కన్సోర్షియం బి
4. ఆస్టీరియా ఎయిరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్
5. ఆటోమైక్రో యుఎఎస్ ఎయిరోటెక్ ప్రైవేట్ లిమిటెడ్
6. సెంటిలియన్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్
7.క్లియర్ స్కై ఫ్లైట్ కన్షోర్షియం
8. దక్ష అన్‌మాన్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
9. డన్జో ఎయిర్ కన్సోర్షియం
10. మారుత్ డ్రోన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్
11. సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్
12. సౌబికా కన్సోర్షియం
13. స్కైలార్క్ డ్రోన్స్ & స్విగ్గి
14. షాప్ ఎక్స్ ఆమ్నీ ప్రెజెంట్ కన్సోర్షియం
15. స్పైస్‌జెట్ లిమిటెడ్
16. టెర్రాడ్రోన్ కన్సోర్షియం బి
17. ది కన్సోర్షియం
18.థ్రాటల్ ఎయిరోస్పేస్ సిస్టంస్ ప్రైవేట్ లిమిటెడ్
19. వాల్యూథాట్ ఐటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
20. వర్జీనియా టెక్ ఇండియా
పబ్లిక్ నోటీసుకు లింక్
***
(Release ID: 1716222)
Visitor Counter : 240