ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఐటీ హార్డ్‌వేర్ కోసం పీఎల్‌ఐ పథకం కింద దరఖాస్తులను దాఖలు చేసిన 19 కంపెనీలు


- అంతర్జాతీయంగా, దేశీయ సంస్థల నుండి అందిన‌ దరఖాస్తుల పరంగా చూస్తే ఇది భారీ విజయంః ప‌థ‌కం అప్లికేషన్ విండో ముగింపు కార్య‌క్ర‌మంలో శ్రీ రవి శంక‌ర్ ప్రసాద్ చెప్పారు

- రానున్న నాలుగేండ్ల కాలంలో రూ.1.60 లక్షల కోట్ల మేర ఉత్ప‌త్తి, రూ.60 వేల కోట్ల మేర ఎగుమతులు జ‌రుగుతాయ‌ని అంచ‌నా

- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్‌ల‌కు ప్ర‌ధాన ఊతంగా ఈ ప‌థ‌కం

Posted On: 04 MAY 2021 1:11PM by PIB Hyderabad

ఐటీ హార్డ్‌వేర్ నిమిత్తం అందుబాటులోకి తెచ్చిన ఉత్ప‌త్తి ఆధారిత‌ ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద మొత్తం 19 కంపెనీలు తమత‌మ‌ దరఖాస్తుల‌ను దాఖలు చేశాయి.  ఈ ఏడాది మార్చి 3వ తేదీ(03.03.2021న) దీన్ని నోటిఫై చేశారు. ఏప్రిల్‌ నెల 30వ తేదీ దరఖాస్తులను దాఖలు చేయడానికి ఈ పథకం తెరిచి ఉంది. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు 01.04.2021 నుండి వర్తిస్తాయి.
ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకున్న కంపెనీల జాబితాలో హార్డ్‌వేర్ తయారీ సంస్థలు ఫ్లెక్స్‌ట్రానిక్స్, రైజింగ్ స్టార్స్ హైటెక్ (ఫాక్స్‌కాన్), డెల్, ఐసీటీ (విస్ట్రాన్), మరియు లావా ఉన్నాయి. ఈ ప‌థ‌కం కింద ద‌ర‌ఖాస్తు చేసుకున్న 14 దేశీయ‌ కంపెనీల జాబితాలో డిక్సన్, ఇన్ఫోపవర్ (సహస్రా మరియు మిటాక్ యొక్క సంయుక్త సంస్థ‌), భగవతి (మైక్రోమాక్స్), సిర్మా, ఆర్బిక్, నియోలిన్క్, ఆప్టిమస్, నెట్‌వెబ్, వీవీడీఎన్, స్మైల్ ఎలక్ట్రానిక్స్, పనాచే డిజిలైఫ్, ఆర్‌డీపీ  వర్క్‌స్టేషన్లు, హెచ్‌ఎల్‌బీఎస్ మరియు కోకోనిక్స్ ఉన్నాయి. ఈ కంపెనీలు తమ తయారీ కార్యకలాపాలను మ‌రింత గణనీయంగా విస్తరించి హార్డ్‌వేర్ ఉత్పత్తిలో జాతీయ ఛాంపియన్ కంపెనీలుగా ఎదగాలని భావిస్తున్నాయి. ఐటీ హార్డ్‌వేర్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) 03.03.2021న తేదీన‌ నోటిఫై చేయబడింది. పీఎల్‌ఐ పథకం భారతదేశంలో అర్హత కలిగిన సంస్థలకు తయారు చేయబడిన లక్షిత  విభాగాల కింద నికర ఇంక్రిమెంటల్ అమ్మకాలపై (2019-20 ఆర్థిక సంవత్సరానికి పైగా) 4 శాతం నుండి 2% / 1% ప్రోత్సాహాకాన్ని నాలుగు సంవత్సరాల కాలానికి (2021-22 నుండి 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రం వ‌ర‌కు)
విస్తరిస్తారు. ఈ పథకం కింద ఏర్పాటు చేసిన గ‌వాక్షం ముగింపు కార్య‌క్ర‌మంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ, కమ్యూనికేషన్స్, న్యాయ శాఖ‌ల మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ అంత‌ర్జాతీయంగాను దేశీయంగాను హార్డ్‌వేర్ తయారీలో ఉన్న దేశీయ కంపెనీల నుంచి వచ్చిన దరఖాస్తుల పరంగా చూస్తే ఐటీ హార్డ్‌వేర్ అభివృద్ది కోసం కేంద్ర అందుబాటులోకి తెచ్చిన పీఎల్‌ఐ పథకం భారీ విజయం సాధించిందని అన్నారు. దీని ద్వారా భారత తారాస్థాయి పురోగతిపై పరిశ్ర‌మ త‌న విశ్వాసాన్ని మ‌రోసారి వ్య‌క్తం చేసింది. ఇది స్వయంప్రతిపత్తి గల భారత దేశం ఆత్మ నిర్భర్ భారత్ యొక్క ప్రధానమంత్రి చేసిన‌ స్పష్టమైన పిలుపును ప్రతిధ్వనిస్తుంది అని అన్నారు. "మేము ఆశాజనకంగా ఉన్నాము. ఐటీ సంస్థ‌ల విలువ గొలుసు అంతటా బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించటానికి మరియు ప్రపంచ విలువ గొలుసులతో అనుసంధానించడానికి గాను ఎదురుచూస్తున్నాము, తద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ అభివృద్ధికి అవ‌స‌ర‌మైన త‌గు పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తాము" అని మంత్రి అన్నారు. దేశ ప్రధాన మంత్రి శ్రీ మోడీ గారి నాయకత్వంలో అమ‌లులోకి తెచ్చిన "డిజిటల్ ఇండియా" మరియు "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమాలు దేశానికి ఎంత‌గానో మేలు చేశాయన్నారు.  ఈ దూరదృష్టి కార్యక్రమాల కార‌ణంగా గడిచిన‌ ఐదేళ్ళలో ఎలక్ట్రానిక్స్ తయారీలో భారతదేశం అపూర్వమైన వృద్ధిని సాధించింది. పరిమాణం, త‌గు స్థాయిపై దృష్టి పెట్టడం, ఎగుమతులను ప్రోత్సహించడం, పరిశ్రమలకు ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడటానికి వీలు కల్పించే వాతావరణాన్ని సృష్టించడం త‌ద్వారా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్‌డీఎమ్) కోసం గ్లోబల్ హబ్‌గా భారతదేశాన్ని ఉంచాలని ఎలక్ట్రానిక్స్-2019 జాతీయ విధానం దృష్టి పెట్టింది.
మొబైల్ ఫోన్ (హ్యాండ్‌సెట్‌లు మరియు విడిభాగాలు) తయారీలో పెట్టుబడులు తీసుకురావడంలో ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక పథకం విజయవంతం అయిన తరువాత, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల కోసం ఉద్దేశించిన.. ప్రోత్సాహ‌క అనుసంధాన‌త క‌లిగిన  ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని ఆమోదించింది. ఈ ప్రతిపాదిత పథకం కింద  ఐటీ హార్డ్‌వేర్ విభాగాలలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్లు (పీసీలు) మరియు సర్వర్‌లు ఉన్నాయి. ఈ పథకం దేశీయ తయారీని పెంచడానికి మరియు ఈ ఐటీ హార్డ్‌వేర్ ఉత్పత్తుల విలువ గొలుసులో పెద్ద పెట్టుబడులను ఆకర్షించడానికి ఉత్పత్తి అనుసంధానత‌ ప్రోత్సాహకాలను ప్రతిపాదిస్తుంది. రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఈ పథకం మొత్తం ఉత్పత్తి రూ.1,60,000 కోట్లకు దారితీస్తుందని భావిస్తున్నారు. మొత్తం ఉత్పత్తిలో, ఐటీ హార్డ్‌వేర్ కంపెనీలు రూ.1,35,000 కోట్ల ఉత్పత్తిని ప్రతిపాదించాయి. దీనికి తోడు దేశీయ కంపెనీలు రూ.25,000 కోట్ల ఉత్పత్తిని ప్రతిపాదించాయి.. ఈ పథకం ఎగుమతులను గణనీయంగా ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు. రాబోయే నాలుగు సంవత్సరాల‌లో మొత్తం రూ.1,60,000 కోట్ల రూపాయల ఉత్పత్తిలో 37 శాతం కంటే ఎక్కువ వాటా అంటే రూ.60,000 కోట్ల వ‌ర‌కు ఎగుమ‌తుల ఆర్డ‌ర్ ద్వారా ల‌భించ‌నుంది. ఈ పథకం ఎలక్ట్రానిక్స్ తయారీలో రూ.2,350 కోట్ల వ‌ర‌కు  అదనపు పెట్టుబడులను తీసుకురానుంది. ఈ పథకం ద్వారా రాబోయే నాలుగు  సంవత్సరాలలో సుమారుగా 37,500 మందికి  ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను క‌ల్పించ‌నుంది. అంతేకాకుండా పరోక్ష ఉపాధి ప్రత్యక్ష ఉపాధికి దాదాపు మూడు రెట్లు అదనపు పరోక్ష ఉపాధిని కల్పిస్తుంది. డొమెస్టిక్ వాల్యూ అడిష‌న్ (వీఏడీ) ప్రస్తుతం ఉన్న  5-12% నుండి 16-35% వరకు పెరుగుతుందని అంచనా. 2025 నాటికి భారత‌త్‌లో ఎలక్ట్రానిక్స్ డిమాండ్ చాలా రెట్లు పెరుగుతుందని అంచనా. ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి పీఎల్‌ఐ పథకం, ఇతర కార్యక్రమాలు భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ తయారీకి పోటీ గమ్యస్థానంగా మార్చడానికి మరియు ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తాయని కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద ఎలక్ట్రానిక్స్ తయారీలో దేశీయ ఛాంపియన్ కంపెనీల సృష్టి.. ప్రపంచ స్థాయిని లక్ష్యంగా చేసుకోవ‌డంతో పాటుగా ఓక‌ల్ ఫ‌ర్ లోక‌ల్‌కు ఊతం ఇవ్వ‌నుంది.
                               

***(Release ID: 1716042) Visitor Counter : 233