ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

టీకాల కార్యక్రమం పుంజుకుంటూ ఉండగా 15.89 కోట్లు దాటిన మొత్తం టీకా డోసులు


మూడో దశలో 18-44 ఏళ్ళ వారికి 4 లక్షలకు పైగా టీకాలు
గత 24 గంటల్లో కోలుకున్న 3.2 లక్షల కొవిడ్ బాధితులు

Posted On: 04 MAY 2021 10:33AM by PIB Hyderabad

కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేస్తూ సరళీకరించిన మూడో దశ మే 1న ప్రారంభం కాగా దేశ వ్యాప్తంగా ఈరోజు వరకు

ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 15.89 కోట్లు దాటింది. పన్నెండు రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 18-44 ఏళ్ళ మధ్యవారు

4,06,339 మందిమొదటి డోస్ టీకా తీసుకున్నారు.  అవి: చత్తీస్ గఢ్ (1025), ఢిల్లీ (40,028), గుజరాత్ (1,08,191),

హర్యానా (55,565),  జమ్మూ-కశ్మీర్ (5,587), కర్నాటక (2,353), మహారాష్ట్ర (73,714), ఒడిశా (6,802),

పంజాబ్ (635), రాజస్థాన్ (76,151), తమిళనాడు (2,744) ఉత్తరప్రదేశ్ (33,544).

 

ఇప్పటిదాకా మొత్తం 23,35,822 శిబిరాల ద్వారా 15,89,32,921 టీకా డొసుల పంపిణీ జరిగినట్టు ఉదయం 7 గంటలకు

అందిన సమాచారం తెలియజేస్తోంది. అందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న 94,48,289 మొదటి డోసులు, 62,97,900

రెండో డోసులు, కోవిడ్ యోధులు అందుకున్న 1,35,05,877 మొదటి డోసులు, 72,66,380 రెండో డోసులు, 18-44 ఏళ్ళ

మధ్యవారు అందుకున్న    4,06,339  మొదటి డోసులు, 45-60 ఏళ్ళ మధ్యవారు అందుకున్న  5,30,50,669 మొదటి డోసులు

41,42,786 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డ వారు అందుకున్న 5,28,16,238 మొదటి డోసులు,  1,19,98,443 రెండో డోసులు

ఉన్నాయి.  

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44 ఏళ్ళవారు

45-60 ఏళ్ళవారు

60 పైబడ్డవారు

 

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

94,48,289

62,97,900

1,35,05,877

72,66,380

4,06,339

5,30,50,669

41,42,786

5,28,16,238

1,19,98,443

15,89,32,921

ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో 66.94% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001JFOA.jpg

 టీకాల కార్యక్రమం మొదలైన 108వ రోజైన మే 3వ తేదీన 17,08,390 టీకా డోసులిచ్చారు.

12,739 శిబిరాల ద్వారా 8,38,343 మంది మొదటి డోస్ అందుకోగా 8,70,047 మంది రెండో డోస్ తీసుకున్నారు.

 

Date: 3rd May 2021 (108thDay)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44 ఏళ్ళవారు

45-60 ఏళ్ళవారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

14,514

26,349

62,078

79,381

2,17,616

3,89,229

3,06,761

1,54,906

4,57,556

8,38,343

8,70,047

 

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ బారినుంచి బైటపడినవారు 1,66,13,292 కు చేరుకున్నారు.  జాతీయ స్థాయి కోలుకున్నవారి

శాతం 81.91% గా నమోదు కాగా గత 24 గంటలలో 3,20,289 మంది కరోనా నుంచి బైటపడ్దారు. తాజాగా గత 24 గంటలలో

 కోలుకున్నవారిలో 73.14% మంది పది రాష్ట్రాలకు చెందినవారే.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026E94.jpg

 దేశంలో జరుగుతున్న రోజువారీ కోవిడ్ పరీక్షల సంఖ్యను ఈ దిగువ చిత్రపటం చూపుతోంది. పాజిటివిటీ ప్రస్తుతం  21.47% ఉంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003SP2I.jpg

గత 24 గంటలలో 3,57,229 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, ఉత్తరప్రదేశ్,

ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లలోనే 71.71% కొత్త కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో

అత్యధికంగా 48,621 కేసులు రాగా కర్నాటకలో 44,438. ఉత్తరప్రదేశ్ లో  29,052 నమోదయ్యాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004UB51.jpg

దేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు  34,47,133 కు చేరుకోగా అవి మొత్తం పాజిటివ్ కేసులలో 17.00%. చికిత్సలో

ఉన్న కేసులు గత 24 గంటలలో నికరంగా  33,491 పెరిగాయి. 

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005A54W.jpg

దేశవ్యాప్తంగా నమోదైన చికిత్సలో ఉన్న కేసులలో పన్నెండు రాష్టాలు – మహారాష్ట, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, రాజస్థాన్,

గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ గఢ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీహార్, హర్యానా లలో 81.41% ఉండటం గమనార్హం. ఈ

ప్రతి రాష్టంలోనూ లక్షకు పైగా కేసులున్నాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006CKV0.jpg

కోవిడ్ కేసులలో మరణాల శాతం క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం 1.10% వద్ద ఉంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007659P.jpg

గత 24 గంటలలో 3,449 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.  తాజా మరణాలలో పది రాష్ట్రాలలో 73.15% నమోదయ్యాయి.

మహారాష్ట్రలో గరిష్ఠంగా 567 మంది కోవిడ్ బాధితులు ఒక్క  రోజులోనే చనిపోగా ఢిల్లీలో 448 మంది, ఉత్తరప్రదేశ్ లో 285

మంది చనిపోయారు.  

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008CM20.jpg

గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కానివి డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, అరుణాచల్ ప్రదేశ్

మాత్రమే.

 

*****


(Release ID: 1715862) Visitor Counter : 242