ఆర్థిక మంత్రిత్వ శాఖ
మూడు వేల ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ల కన్‌సైన్‌మెంట్ కస్టమ్స్ అధికారుల వద్ద ఆగలేదు: ఆర్థిక మంత్రిత్వ శాఖ
Posted On:
03 MAY 2021 8:25PM by PIB Hyderabad
మూడు వేల ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లకు సంబంధించిన కన్‌సైన్‌మెంట్ కస్టమ్స్ అధికారుల పెండింగ్‌లో ఉందని దిల్లీ హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం అటువంటి కన్‌సైన్‌మెంట్ ఏదీ కస్టమ్స్ అధికారుల వద్ద పెండింగ్‌లో లేదన్న విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది దిల్లీ ఉన్నత న్యాయస్థానానికి స్పష్టం చేశారు.
అయితే, మూడు వేల ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు కస్టమ్స్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. మేం మరోసారి క్షేత్రస్థాయిలో తనిఖీ చేశాం, కస్టమ్స్ వద్ద అలాంటి సరుకు లేదు. అయితే, కన్‌సైన్‌మెంట్‌కు సంబంధించిన ఒక ఛాయాచిత్రం ట్విట్టర్‌లో ఉంచారు. ఆ ఫొటోను ఎక్కడ తీశారో ఎవరికైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయవచ్చు. మేం సత్వరం చర్యలు తీసుకుంటాం.
***
(Release ID: 1715787)
Visitor Counter : 209