ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత ప్రభుత్వం ఇప్పటిదాకా ఉచితంగా రాష్టాలకు,


కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చిన డోసులు 16.54 కోట్లు
ఇంకా రాష్ట్రాల దగ్గర 78 లక్షల డోసులకు పైగా నిల్వ

వచ్చే మూడు రోజుల్లో రాష్ట్త్రాలకు అందే డోసులు 56 లక్షలు

Posted On: 02 MAY 2021 11:38AM by PIB Hyderabad

కోవిడ్ సంక్షోభం మీద రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి  భారత ప్రభుత్వం ఉమ్మడి పోరు నడుపుతోంది. కోవిడ్ నియంత్రణ

దిశలో నిర్థారణ పరీక్షలు జరపటం, లక్షణాలున్నవారి ఆచూకీ పట్టటం, మెరుగైన చికిత్స అందించటం, కోవిడ్ నివారణ దిశలో

జాగ్రత్తలు పాటించటం, టీకా టీసుకోవటం అనే ఐదు విధానాల వ్యూహాన్ని అమలు చేస్తోంది. సరళీకృతం చేసిన టీకా అర్హులైనవారందరూ

 నమోదు చేసుకోవటానికి వీలుగా  ఏప్రిల్ 28 నుంచి కోవిన్ పోర్టల్ (cowin.gov.in) లో లేదా ఆరోగ్యసేతు యాప్ లోరిజిస్టర్

చేసుకోవటానికి అవకాశమిచ్చింది.

 

భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్టాలకు దాదాపు 16.54 కోట్ల (16,54,93,410) టీకా డోసులు ఉచితంగా పంపిణీ చేసింది.

ఈ ఉదయం 8 గంటలకు అందిన సమాచారాన్ని బట్టి ఇందులో ఇప్పటివరకి వేసిన టీకాలు, వృధా అయినవి కలిపి  15,76,32,631 

డోసులు ఉన్నాయి. రాష్టాల దగ్గర ఇప్పటికీ 78 లక్షలకు పైగా టీకా డోసు నిల్వలు (78,60,779)  ఉన్నాయి. ఇవే కాకుండా

 రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరో 56 లక్షలకు పైగా  (56,20,670) డోసులు వచ్చే 3 రోజుల్లో పంపుతారు.  

 

 

*****



(Release ID: 1715514) Visitor Counter : 223