పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
మార్పులు చేసిన పారిశ్రామిక నైట్రొజన్ ప్లాంట్ల ద్వారా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి
30 పరిశ్రమలను గుర్తించారు, త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించేలా సాగుతున్న కృషి
Posted On:
01 MAY 2021 2:42PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో దేశంలో వైద్య అవసరాల నిమిత్తం ఆక్సిజన్ అందుబాటును పెంచేందుకు పరిశ్రమల డాటా బేస్ కలిగిన కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సిపిసిబి)ను మిగులు నైట్రోజెన్ ప్లాంట్లు కలిగిన పరిశ్రమలను గుర్తించి, ప్రస్తుత నైట్రోజెన్ ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా మార్చే అవకాశాలను అన్వేషించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్ర నియంత్రణ బోర్డుల (ఎస్‌పిసిబి) సాయంతో సిపిసిబి ప్రస్తుతం నైట్రొజెన్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి కోసం కేటాయించే సంభావ్యత కలిగిన పరిశ్రమలను గుర్తించింది. సంభావ్య పారిశ్రామిక యూనిట్లు, నిపుణులతో సంప్రదింపులు జరిగాయి.
ఇప్పటివరకు దాదాపు 30 పరిశ్రమలను గుర్తించి, అందులోని నైట్రొజెన్ ప్లాంట్లను మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా మార్చేందుకు కృషి మొదలైంది. ఇందులో కొన్ని ప్లాంట్లను దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు బదిలీ చేస్తుండగా, అక్కడ నుంచి బదిలీ చేసేందుకు సాధ్యం కాని ప్లాంట్లు అక్కడికక్కడే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.
ఆక్సిజన్ 50 ఎన్ఎం3/ గంటలకు జియోలైట్ మాలిక్యులార్ సీవ్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉన్న ఒక నైట్రోజెన్ ప్లాంట్‌ను ఎం/ఎస‌్ యుపిఎల్ లిమిటెడ్ బదిలీ చేసి, దానిని వాపి (గుజరాత్)లోని ఎల్ జి రోటరీ ఆసుపత్రిలో నెలకొల్పారు. ఈ ప్లాంట్ 27.04.2021 నుంచి ఉత్పత్తి కలాపాన్ని ప్రారంభించి రోజుకు 0.5టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. మరొక మూడు ప్లాంట్లను బదిలీ చేసే ప్రక్రియను యుపిఎల్ లిమిటెడ్ చేపట్టింది. వాటిని ఆక్సిజన్ ప్లాంట్లగా బదిలీ చేసిన తర్వాత, ఈ ప్లాంట్లను సూరత్, అంకాలేశ్వర్‌లోని ఆసుపత్రులలో నెలకొల్పుతారు.
ఉనికిలో ఉన్న నైట్రోజెన్ ప్లాంట్లలో, కార్బన్ మాలిక్యులార్ సీవ్ (సిఎంఎస్) స్థానంలోజియోలైట్ మాలిక్యులార్ సీవ్ (జెడ్ ఎంఎస్)ను అమర్చడమే కాక, ఆక్సిజన్ అనలైజర్ స్థాపించి, కంట్రోల్ ప్యానెల్‌లో , ఫ్లో వాల్వ్స్‌లో మార్పులు చేసి తద్వారా వైద్య అవసరాల నిమిత్తం ఉపయోగించగల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్ెంఎస్ అందుబాటులో ఉన్నందువల్ల అలా మార్పులు చేసిన ప్లాంట్లను 4-5 రోజులలో ఏర్పాటు చేయడం తేలిక కాగా, కొత్త ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కనీసం 3-4 వారాలు పడుతుంది.
పరిశ్రమలలో అక్కడికక్కడ ఉత్పత్తి చేసిన ఆక్సిజన్‌ను ఆసుపత్రులకు రవాణా చేసేందుకు కంప్రెస్ ( సంపీడకం) చేసి, సిలెండర్లు/ ప్రత్యేక పాత్రలలో అధిక ఒత్తిడి కంప్రెసర్‌తో నింపుతారు. ఈ పరిశ్రమలు త్వరితగతిన పనిని పూర్తి చేసేందుకు సౌలభ్యతను కల్పిస్తున్నారు.
***
(Release ID: 1715422)
Visitor Counter : 253