ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇప్పటిదాకా భారత ప్రభుత్వం ఉచితంగా రాష్ట్రాలకిచ్చిన టీకాడోసులు 16.37 కోట్లు


రాష్ట్రాల దగ్గర ప్రస్తుతమున్న నిల్వ 79 లక్షల డోసులు

వచ్చే 3 రోజుల్లో రాష్టాలకు అందే డోసులు 17 లక్షలు

Posted On: 01 MAY 2021 11:40AM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో ఎంతో ముందున్న భారత ప్రభుత్వం టీకాలను అందులో కీలకంగా భావిస్తోంది. పరీక్షలు జరపటం, సోకినవారి ఆచూకీ పట్టుకోవటం, చికిత్స అందించటం, వ్యాప్తి నిరోధక  ప్రవర్తన వంటి ఐదు వ్యూహాలలో టీకాలు కీలకం.   మరింత సరళంగా మార్చిన మూడో విడత టీకాల కార్యక్రమం మే 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించి కొత్త వయోవర్గానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏప్రిల్ 28న  ప్రారంభించటం తెలిసిందే. లబ్ధిదారులు కోవిన్ పోర్టల్ మీద  (cowin.gov.in) లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవటానికి వీలు కల్పించింది.

భారత ప్రభుత్వం ఇప్పటిదాకా దాదాపు 16.37 కోట్లు టీకా డోసులు (16,37,62,300)  రాష్ట్రాలకు  ఉచితంగా అందజేసింది.  అందులో ఇప్పటివరకు  15,58,48,782 డోసులు వాడినట్టు ఈ ఉదయం 8 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది.  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర ఇంకా 79 లక్షలకు పైగా  (79,13,518) డోసుల నిల్వ ఉంది. 

మరో 17 లక్షలకు పైగా   (17,31,110) టీకా డొసులను వచ్చే 3 రోజులలో రాష్టాలకు, కేంద్రాలకు పంపటం పూర్తవుతుంది. 

 

     

మూడవదశ సరళీకృత టీకాల పంపిణీ కార్యక్రమంలో నిర్దేశించిన విధంగా   కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమమంత్రిత్వశాఖ ద్వారా ముందుగా చెప్పినట్టు అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు  భారత ప్రభుత్వం ద్వారా నిర్దేశించిన విధంగా 45 ఏళ్ళు పైబడినవారందరికీ  టీకా డోసులు పూర్తి ఉచితంగా అందుకుంటాయి.  

ఆ విధంగా భారత ప్రభుత్వం ఉచితంగా అందజేసే టీకా డోసుల వివరాలను ఈ క్రింది పట్టిక తెలియజేస్తుంది.

భారత ప్రభుత్వం మే మొదటి పక్షంలో రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే కొవాక్సిన్, కోవిషీల్డ్  ఉచిత టీకా డోసుల వివరాలు:

 

 

****


(Release ID: 1715394) Visitor Counter : 234