రైల్వే మంత్రిత్వ శాఖ

ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ కార్య‌క‌లాపాలు మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ , ఢిల్లీల త‌ర్వాత హ‌ర్యానా, తెలంగాణా రాష్ట్రాల‌కు విస్త‌ర‌ణ‌


రాగ‌ల‌ 24 గంట‌ల‌లో భార‌తీయ రైల్వే ర‌వాణాచేసిన మొత్తం ద్ర‌వ‌రూప వైద్య రంగ ఆక్సిజ‌న్ 640 మెట్రిక్ ట‌న్నులకు చేరుకోనుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ 76 మెట్రిక్ ట‌న్నుల‌కు పైగా ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను అందుకుంది. ఆర‌వ ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ ర‌వాణాలో ఉంది.

భార‌తీయ రైల్వేకి చెందిన ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ కార్య‌క‌ల‌పాలు రాష్ట్రాల‌కు ఎంతో ఊర‌ట‌నిస్తున్నాయి.

Posted On: 29 APR 2021 4:16PM by PIB Hyderabad

భార‌తీయ రైల్వేకి సంబంధించిన ఆక్సిజ‌న్ ఎ క్స్‌ప్రెస్ కార్య‌క‌లాపాలు మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఢిల్లీ ల త‌ర్వాత హ‌ర్యానా, తెలంగాణాల‌కు కూడా విస్త‌రించ‌డంతో రాష్ట్రాల‌కు ఎంతో ఊర‌ట‌నిస్తున్న‌ది.
ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా ను వేగ‌వంతంగా కొన‌సాగిస్తూ మ‌రో మూడు రైళ్లు ద్ర‌వ‌రూప ఆక్సిజ‌న్‌ను తీసుకువెళ్ల‌డం కానీ లేదా ఆక్సిజ‌న్ లోడింగ్ ప్లాంట్ల‌కు వెళ్ల‌డం కానీ చేస్తున్నాయి.  రాగ‌ల 24 గంట‌ల స‌మ‌యానికి భార‌తీయ రైల్వేలు  త‌ర‌లించిన మొత్తం   ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌ను  640 మెట్రిక్ ట‌న్నుల‌కు చేరుకోనుంది.
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ 76.29 మెట్రిక్ ట‌న్నుల ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్ (ఎల్‌.ఎం.ఓ)ను ఆక్సిజ‌న్‌ ఎక్స్‌ప్రెస్ నెంబ‌ర్ 5 ద్వారా  5ట్యాంక‌ర్ల‌లో అందుకుంది. 1 ట్యాంక‌ర్‌ను వార‌ణాశిలో వ‌దిలి మిగిలిన 4 ట్యాంక‌ర్ల‌ను ల‌క్నోలో వ‌దిలిపెట్టారు. 6 వ నంబ‌ర్ ఆక్సిజ‌న్ రైలు ఇప్ప‌టికే లక్నోకు వెళుతున్న‌ది. ఇది 2021 ఏప్రిల్ 30 ల‌క్నో చేరుకుంటుంది. ఇది 33.18 మెట్రిక్ ట‌న్నుల ద్ర‌వ‌రూప మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ను 4 ట్యాంక‌ర్ల‌లో స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. మ‌రో ఖాళీ ఖాళీ రేక్ ల‌క్నోనుంచి 29న బ‌య‌లుదేరి మ‌రో సెట్ ఆక్సిజ‌న్ ట్యాంకర్ల‌ను తీసుకురానున్న‌ది.
హ‌ర్యానా తొలి ఆక్సిజ‌న్ ఎక్స‌ప్రెస్ ద్వారా ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌ను అందుకోనుంది. రెండు ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్లు ఒరిస్సాలోని అంగుల్‌నుంచి బ‌య‌లుదేర‌నున్నాయి.  ఖాళీ రేక్‌లు ఫ‌రీదాబాద్ నుంచి రూర్కేలా చేరుకునే క్ర‌మంలో ఉన్నాయి. అవి ఈరాత్రికిచేరుకోవ‌చ్చు. హ‌ర్యానాకు నిరంత‌రాయంగా ఆక్సిజ‌న్ రైళ్ల ద్వారా ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాతో హ‌ర్యానాలోని కోవిడ్ -19 పేషెంట్ల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాకు వీలు కలుగుతోంది.

తెలంగాణా రాష్ట్ర‌ప్ర‌భుత్వం కూడా భార‌తీయ రైల్వేని ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ ను కోరింది . ఖాళీ రేక్ సికింద్రాబాద్ నుంచి అంగుల్ బ‌య‌లు దేరింది. ఇందులో 5 ట్యాంక‌ర్లు ఉన్నాయి.ఇవి రేపు అంగుల్ చేరుకుంటాయి.
 ఆక్సిజ‌న్వ‌స‌రం ఉన్న రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్ ర‌వాణా స‌దుపాయాన్ని క‌ల్పించేందుకు రైల్వే పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ఉంది.  రాష్ట్రాలు రైల్వేల‌కు టాంక‌ర్ల‌ను స‌ర‌ఫ‌రా చేస్తాయి. అక్క‌డ నుంచి రైల్వేలు సాధ్య‌మైనంత వేగంగా ఆక్సిజ‌న్‌ను ఆయా ప్రాంతాల‌నుండి గ‌మ్య‌స్థానాల‌కు త‌ర‌లించ‌డానికి కృషి చేస్తున్న‌ది. ఆక్సిజ‌న్ కేటాయింపు, వినియోగాన్ని రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు చేపడతాయి.

ద్ర‌వ‌రూప ఆక్సిజ‌న్ అనేది క్ర‌యోజ‌నిక్ కార్గో కావ‌డంతో గ‌రిష్ఠంగా ఎంత  వేగంతో దానిని త‌ర‌లించాలి వంటి ప‌రిమితులు ఉన్నాయి. అలాగే లోడింగ్ ఆంక్ష‌లు, లిక్విడ్ ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల అందుబాటు, లోడింగ్ ర్యాంప్‌లు వంటి వాటి విష‌యంలోనూ ప‌రిమితులు ఉన్నాయి. అలాగే గ‌రిష్ఠ స్థాయిలో క్లియ‌రెన్సులు ఇస్తూ వాటిని త‌ర‌లించేందుకు రూట్ మ్యాపింగ్ విష‌యంలో కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌ల‌సి ఉంటుంది. దీనికి కార‌ణం మార్గంలో వివిధ ఆర్‌.యు.బి లు ఎఫ్‌.ఒ.బిలు ఉన్నాయి.

***


(Release ID: 1715178) Visitor Counter : 230