రక్షణ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 నివారణలో పౌర యంత్రాంగానికి సహకరిస్తున్న కంటోన్మెంట్ బోర్డులు
Posted On:
30 APR 2021 4:27PM by PIB Hyderabad
కోవిడ్-19 సమస్య నుంచి బయటపడడానికి రాష్ట్ర ప్రభుత్వాలు/ పౌర యంత్రాంగాలు చేస్తున్న ప్రయత్నాలకు దేశం వివిధ ప్రాంతాల్లో కంటోన్మెంట్ బోర్డులు సహాయసహకారాలను అందిస్తున్నాయి. కంటోన్మెంట్ ప్రాంతాల్లో నివసిస్తున్న తమ నివాసితులు మాత్రమే కాకుండా అవసరమైన వారందరికీ బోర్డులు వైద్య సహాయాన్ని అందిస్తున్నాయి.
ప్రస్తుతం 39 కంటోన్మెంట్ బోర్డులు (సిబి) 1,240 పడకలతో 40 సాధారణ ఆసుపత్రులను నిర్వహిస్తున్నాయి. 304 పడకలతో పూణే, కిర్కీ మరియు డియోలాలిలోని సిబి ఆసుపత్రులను ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులుగా నిర్వహిస్తున్నారు. కిర్కీ, డియోలాలి, డెహూరోడ్, ఝాన్సీ మరియు అహ్మద్‌నగర్‌లలో ఉన్న కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రులను 418 పడకలతో కోవిడ్ సంరక్షణ కేంద్రాలుగా మార్చి సేవలు అందిస్తున్నారు. డెహూరోడ్ లో వద్ద ఒక ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానున్నది. త్వరలో దీని సేవలు అందుబాటులోకి రానున్నాయి. కిర్కీలోని కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో ఆరు పడకలతో ఐసీయూ సౌకర్యంతో ఏర్పాటు అవుతోంది. 37 కంటోన్మెంట్ బోర్డులలో ఆక్సిజన్ సౌకర్యం వుంది. ప్రస్తుతం వీటిలో 658 సిలిండర్ల స్టాక్ ఉంది.
మొత్తం 39 కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రుల్లో జ్వరం క్లినిక్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. కోవిడ్ -19 లక్షణాలతో వీటికి వస్తున్నరోగులకు చికిత్స అందిస్తున్నారు. జిల్లా పరిపాలనా యంత్రాంగం సహకారంతో రాపిడ్ యాంటిజెన్ మరియు ఆర్టీ-పిసిఆర్ పరీక్షలను నిర్వహించడమే కాకుండా టీకాలను ఇవ్వడానికి కంటోన్మెంట్ బోర్డులు సౌకర్యాలను కల్పించాయి.
కంటోన్మెంట్ ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలను ప్రత్యేక బృందాలు పారిశుధ్య పరిస్థితులను నిర్వహిస్తూ ఇ-చావానీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ సేవలను ఉపయోగించాలని ప్రోత్సహిస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డులు దేశవ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ క్రింద పౌర సంస్థలుగా పనిచేస్తున్నాయి.
కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో రక్షణశాఖ మంత్రి శ్రీ రాజనాధ్ సింగ్ ఏప్రిల్ 20,24 తేదీల్లో నిర్వహించిన సమీక్షలో కోవిడ్ సమస్యనుంచి బయటపడడానికి పౌర యంత్రాంగానికి సహాయ సహకారాలను అందించాలని సాయుధ దళాలు, వివిధ రక్షణ సంస్థలకు ఆదేశాలు జారీచేశారు. సంక్షోభ సమయాల్లో ప్రజలు సాయుధ దళాల వైపు చూస్తారని ఆయన అన్నారు. సాయుధ దళాలపై ప్రజలకు నమ్మకం ఉందని దళాలు తమను రక్షిస్తాయన్న నమ్మకం వారిలో ఉందని మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1715170)
Visitor Counter : 199