ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

హోమ్ ఐసోలేషన్ కేసులకు సవరించిన మార్గదర్శకాలు!


జారీ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Posted On: 30 APR 2021 12:02PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధక నిర్వహణా వ్యవస్థకు నాయకత్వం వహిస్తున్న భారత ప్రభుత్వం, వివిధ రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కోవిడ్-19 నిరోధం, కట్టడి, చికిత్సా నిర్వహణకు సంబంధించి క్రమానుగతంగా పలు వ్యూహాత్మక చర్యలను అమలు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది జూలై 2వ తేదీన జారీ చేసిన మార్గదర్శక సూత్రాల స్థానంలో తాజా గా సవరించిన మార్గదర్శక సూత్రాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు వెలువరించింది.

  సవరించిన మార్గదర్శక సూత్రాలస ప్రకారం స్వల్పలక్షణాల రోగులు/వ్యాధి లక్షణాలు కనిపించని బాధితులకోసం ఇంటిలోనే ఏకాంతంగా ఉంటూ చికిత్స తీసుకోవాలని సిఫార్సు చేశారు.  

 

వ్యాధి లక్షణాలు లేని కోవిడ్-19 కేసులు-

  వ్యాధి లక్షణాల లేని కేసులంటే వ్యాధికి సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేనట్టుగా పరిశోధనశాలలో నిర్ధారితమైన కేసులు. గది వాతావరణంలో 94శాతం ఆక్సిజన్ స్థాయి ఉన్న కేసులు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు లేనప్పటికీ, జ్వరం, గొంతులో ఇబ్బందులు ఎదుర్కొంటూ 94శాతం పైగా ఆక్సిజన్ స్థాయిలు ఉన్న బాధితులు స్వల్ప లక్షణాల కేసుల పరిధిలోకి వస్తారు.

 

 

  1. ఇంటిలో ఏకాంతంగా పొందే చికిత్సకు అర్హులైన రోగులు

 

    1. కరోనా పాజిటివ్.గా తేలినా, సదరు వ్యక్తికి వ్యాధిలక్షణాలేవీ లేవని, లేదా స్వల్ప స్థాయిలో లక్షణాలు ఉన్నాయని చికిత్స అందించే వైద్యాధికారి ధ్రువీకరించాలి.
    2. అలాంటి కేసుల వారికి ఇంట్లో ఏకాంతంగా ఉండటానికి, కుటుంబంలోని ఇతర వ్యక్తులనుంచి విడిగా క్వారంటైన్ లో ఉండటానికి తగిన స్థలం అందుబాటులో ఉండాలి.
    3. సదరు బాధితులను 24గంటలూ చూసుకునే సంరక్షకులు అందుబాటులో ఉండాలి. బాధితులు ఏకాంతంలో ఉన్నంత కాలం, అవసరమైనపుడు వైద్యులతో, ఆసుపత్రివారితో  వారు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలి.
    4. అరవై ఏళ్లకు పైబడిన వారితోపాటుగా రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధమైన వ్యాధులు, ఊపిరి తిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, సెరెబ్రో వాస్కులర్ రుగ్మతలు, తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై వైద్యాధికారి తగినన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతనే వారిని హోమ్ ఐసోలేషన్ కు అనుమతించాలి.  
    5. హెచ్.ఐ.వి., అవయవ మార్పిడి, కేన్సర్ థెరపీ వంటి సమస్యలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్ కు అనుమతించరాదు. చికిత్స అందించే వైద్యాధికారులు వారి ఆరోగ్య పరిస్థితిని సూక్ష్మంగా పరిశీలించి, అంచనా వేసిన తర్వాతనే అనుమతించాలి.
    6. రోగులకు సంరక్షకులుగా వ్యవహరించేవారు, వారితో సన్నిహితులైన వారు ముందు జాగ్రత్తగా,.. చికిత్స చేసే వైద్యాధికారి సూచించినట్టుగా హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ప్రొఫైలాక్సిస్ మందులు  తీసుకోవాలి.
    7. ఇతర సభ్యులకు ఉద్దేశించిన మార్గదర్శక సూత్రాలు : https://www.mohfw.gov.in/pdf/Guidelinesforhomequarantine.pdf, అన్న వెబ్ అడ్రసులో అందుబాటులో ఉంటాయి. వాటిని తప్పనిసరిగా అనుసరించాలి.

 

  1. రోగికి సూచనలు
    1. ఇంట్లో,..కుటుంబంలోని ఇతర సభ్యులకు దూరంగా ఒక ప్రత్యేక గదికి మాత్రమే పరిమితం కావాలి. ప్రత్యేకించి వయోవృద్ధులకు, రక్తపోటు, గుండెసంబంధమైన, శ్వాస సంబంధమైన దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవారికి దూరంగా ఉండాలి.
    2. గదిలోకి మంచి గాలి వీచేలా, వెలుతురు ప్రసరించేలా తగిన ఏర్పాట్లు ఉండాలి. తాజా గాలి వచ్చేలా కిటికీలను తెరిచి ఉంచాలి.
    3. రోగులు ఎల్లవేళలా మూడు పొరలు కలిగిన మాస్కు ధరించి ఉండాలి. ప్రతి 8 గంటలకూ లేదా,  మాస్కు చెమ్మతో ఉన్నట్టుగా కనిపించినా ఆ మాస్కును తొలగించాలి. సంరక్షణ విధుల్లోని వ్యక్తి ఎవరైనా రోగి గదిలోకి వెళ్లవలసి వస్తే, సంరక్షకుడు, రోగీ ఇద్దరూ ఎన్95 మాస్కును వినియోగించాల్సి ఉంటుంది.
    4. ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ తో శుభ్రపరిచిన తర్వాతనే మాస్కును తీసిపడవేయాలి..
    5. శరీరంలో తగినంత శక్తి నిల్వ ఉండేందుకు వీలుగా రోగి తగినంత విశ్రాంతి తీసుకోవడంతోపాటుగా, ఎక్కువ పరిమాణంలో నీరు, ఇతర ద్రవాలు తీసుకోవాలి..
    6. అన్ని సమయాల్లోనూ శ్వాసకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. తుమ్ము, దగ్గు, ఉమ్ము, ముక్కు చీదే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది.
    7. తరచుగా చేతులను సబ్బుతో కనీసం 40 సెకన్లపాటు కడుక్కోవాలి.  లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ తో అయినా చేతులను శుభ్రపరుచుకోవాలి.
    8. వ్యక్తిగతంగా వాడే వస్తువులు వేటినీ ఇంట్లోని ఇతరులెవరితోనూ పంచుకోకూడదు..
    9. గదిలోని వివిధ వస్తువుల ఉపరితలాలను ఒక శాతం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి. టేబుల్ ఉపరితలం, తలుపు గడియ, డోర్ హ్యాండిల్ వంటి వాటిని ఈ పద్ధతిలోనే శుభ్రపరుచుకోవాలి.
    10. రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు సొంతంగా, పల్స్ ఆక్సీ మీటర్ సహాయంతో తప్పనిసరిగా పరీక్షించుకుంటూ ఉండాలి.
    11. రోగి ప్రతి రోజూ తన ఆరోగ్య పరిస్థిని క్రమం తప్పకుండా పర్యవేక్షించుకుంటూ ఉండాలి. రోజువారీగా శరీర ఉష్ణోగ్రతను ఎల్లవేళలా పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ కింద పట్టికలో సూచించినట్టుగా పరిస్థితులు ఏ మాత్రమైనా దిగజారినట్టు గుర్తించినా తప్పనిసరిగా వెంటనే డాక్టరుకు తెలియజేయాలి..

 

 

పర్యవేక్షణ పట్టిక

లక్షణాలు కనిపించిన రోజు, సమయం

 (ప్రతి 4 గంటలకూ ఓ సారి)

 

 

శరీర ఉష్ణోగ్రత

 

గుండె వేగం (పల్స్ ఆక్సీమీటర్ ద్వారా)

 

SpO2 శాతం (పల్స్ ఆక్సీమీటర్ ద్వారా)

 

వ్యాధిపై అనుభవం: (మెరుగు/అదే తీరు/విషమం)

 

శ్వాస:

(మెరుగు / అదేతీరు/ విషమం)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  1. సంరక్షకులకు సూచనలు

 

    1. మాస్కు:

 

      • సంరక్షణ బాధ్యతలు నిర్వహించేవారు ఇంట్లో మూడు పొరలతో కూడిన మెడికల్ మాస్కు తప్పనిసరిగా ధరించాలి. అదే గదిలో రోగి కూడా ఉన్నట్టయితే ఎన్.95 మాస్కు వినియోగించే విషయం పరిశీలించాలి.
      • మాస్కు ధారణ సమయంలో మాస్కు ముందుభాగాన్ని ముట్టుకోవడం గానీ, కదల్చిడం గానీ చేయరాదు.
      • మాస్కు చెమ్మబారినా, తడిగా మారి అపరిశుభ్రమైనా వెంటనే దాన్ని మార్చివేయాలి.
      • వినియోగించిన అనంతరం మాస్కును పడేయాలి. మాస్కును పడేసిన తర్వాత చేతులను పూర్తిగా  శుభ్రపరుచుకోవాలి.
      • అతడు/ఆమె ఎవరైనా సరే తన ముఖాన్ని ముట్టుకోరాదు.
    • చేతుల శుభ్రత

 

      • రోగికి, రోగి పరిసరాలకు సన్నిహితంగా వెళ్లిన అనంతరం ప్రతిసారీ చేతుల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలి.
      • ఆహారం తయారీకి ముందు, తర్వాత ఆహారం తినడానికి ముందు, మరుగుదొడ్డిని వినియోగించిన తర్వాతే కాకుండా చేతులు మురికిగా ఉన్నాయని అనిపించిన ప్రతిసారీ వెంటనే వాటిని తప్పసరిగా శుభ్రపరురుచుకోవాలి.
      • సబ్బును, నీటిని వాడుతూ చేతులను  40నిమిషాలపాటు శుభ్రపరుచుకోవాలి. చేతులు మరీ అంత మురికిగా కనిపించకపోతే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ తో శుభ్రపరుచుకోవాలి.
      • శుభ్రపరుచుకోవడానికి సబ్బును, నీళ్లను వాడిన తర్వాత పొడి చేతుల్లో చెమ్మను తొలగించుకునేందుకు వాడి పారేయదగిన పేపర్ టవళ్లను వినియోగించడం అవసరం. పేపర్ టవళ్లు అందుబాటులో లేనిపక్షంలో అందుకోసమే ప్రత్యేకించిన బట్ట తువ్వాళ్లను వాడాలి. అవి తడిబారితే వెంటనే వాటిని తొలగించాలి.
      • చేతి తొడుగులను (గ్లోవ్స్.ను) వేసుకోవడానికి, తొలగించడానికి ముందుగా కూడా చేతుల పరిశుభ్రతను పాటించాలి.

 

    1. రోగితో, రోగి పరిసరాలతో సాన్నిహిత్యం

 

      • రోగి శారీరక ద్రవాలతో ప్రత్యేకించి నోరు, ముక్కుకు సంబంధించిన ద్రవాలను, శ్వాస వల్ల స్రవించే ద్రవాలను నేరుగా తాకరాదు. రోగికి సేవలందించేటపుడు చేతి తొడుగులను వినియోగించాలి.
      • కాలుష్య కారకమైన వస్తువులు రోగి సమీప పరిసరాల్లో లేకుండా చూడాలి. (ఉదారణకు సిగరెట్లను, తినేందుకు వాడే పాత్రలను, పానీయాలను, తువ్వాళ్లను పడక బట్టలను పంచుకోవడం నివారించాలి.)
      • రోగి గదిలోకే  ఆహారాన్ని అందించాలి. రోగి వాడిన వంటపాత్రలను, ఇతర పాత్రలను సబ్బు, డిటర్జెంట్. నీటితో శుభ్రపరచాలి. శుభ్రపరిచే సమయంలో చేతులకు తొడుగులను వాడాలి. అనంతరం వంటపాత్రలను ఇతర పాత్రలను తిరిగి వినియోగించవచ్చు.
      • రోగి వినియోగించిన వస్తువులను వాడిన తర్వాత, చేతి తొడుగులను తొలగించి చేతులు శుభ్రం చేసుకోవాలి. గదిని శుభ్రపరిచేటపుడు, రోగి వాడే బట్టలను తాకినపుడు మూడు పొరలతో కూడిన మాస్కును తప్పనిసరిగా వినియోగించాలి.
      • చేతి తొడుగులు వాడటానికి ముందు, వాడిన తర్వాత కూడా చేతుల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలి.

 

 

 

    1. బయో మెడికల్ వ్యర్థాల తొలగింపు

 ఇంటిలోని ఇతరులకు వ్యాధి సంక్రమించే ఆస్కారం లేకుండా  రోగికి సంబంధించిన బయో మెడికల్ వ్యర్థపదార్థాలను సమర్థంగా తొలగించవలసి ఉంటుంది. (మాస్కులు, ఒకసారి వాడి పారేయాల్సిన వస్తువులు, ఆహారం పాకెట్లు వంటి వాటిని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సి.పి.సి.బి.) నిబంధనలకు అనుగుణంగా తొలగించి వేయాలి. సి.పి.సి.బి. నింబధనలు తెలుసుకోవాలంటే : http://cpcbenvis.nic.in/pdf/1595918059_mediaphoto2009.pdf) అన్న వెబ్ చిరునామాను సంప్రదించవచ్చు.

 

  1. స్వల్ప లక్షణాలు/లక్షణాలు కనిపించని రోగులకు హోమ్ ఐసోలేషన్ లో చికిత్స అందించే పద్ధతి

 

    1. తనకు చికిత్స అందించే డాక్టరుతో రోగులు సంప్రదింపులు కొనసాగిస్తూ వ్యాధిలో ఎలాంటి విషమ పరిస్థితి ఎదురైనా వెంటనే డాక్టరుకు తెలియజేయాలి. 
    2. తనకు ఉన్న ఇతరత్రా ఆరోగ్య సమస్యలపై డాక్టరును సంప్రదించిన మీదట సదరు రుగ్మతలకు కూడా మందుల వాడకాన్ని కొనసాగించాలి.
    3. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నపుడు వాటికి అనుగుణంగా అవసరమైన మందులు తీసుకోవాలి.
    4. రోగులు గోరువెచ్చని నీటిని నోటితో పుక్కిలించడం. నీటి ఆవిరి పట్టడం రోజుకు రెండుసార్లు చేయాలి.
    5. రోజుకు నాలుగు సార్లు 650 ఎం.జి. పారాసిటమాల్ తీసుకున్నప్పటికీ జ్వరం అదుపులోకి రానిపక్షంలో వెంటనే సంపంధిత డాక్టరును సంప్రదించాలి.  అలాంటి సమయంలో నాన్ స్టెరాయిడల్ ఇన్.ఫ్లమేటరీ మందులను (ఉదాహరణకు నాఫ్రాక్సిన్ 250 ఎం.జి. రోజుకు రెండుసార్లు వాడేలా) డాక్టరు సిఫార్సు చేసేందుకు అవకాశం ఉంటుంది.
    6. ఐవర్ మెక్టిన్ 200 ఎం.జి. టాబ్లెట్ ను ఖాలీ కడుపుతో రోజూ ఒకసారి చొప్పున 3నుంచి 5 రోజులపాటు వాడే విషయం పరిశీలించవచ్చు.
    7. లోపలికి పీల్చుకునే బ్యుడే సొనైడ్ మందును (ఇన్ హేలర్స్ ద్వారా ఒక్కోసారి 800 ఎం.సి.జి. చొప్పున రోజుకు రెండుసార్లు) ఐదు నుంచి 7 రోజులు ఉపయోగిచవచ్చు. లక్షణాలు కనిపించిన ఐదు రోజుల తర్వాత కూడా జ్వరం, దగ్గు లాంటివి ఉన్నపుడు మాత్రమే ఈ మందును వాడాల్సి ఉంటుంది.  
    1. రెమ్ డెసివిర్ మందుతో పాటుగా, ఇన్వెస్టిగేషనల్ థెరపీకి సంబంధించిన ఇతర మందులన్నింటినీ డాక్టర్ల సూచనలతో ఆసుపత్రిలో ఉన్నపుడు మాత్రమే తీసుకోవాలి. ఇంటిలో ఉండగా రెమ్ డెసివిర్ ను సేకరించడానికి గానీ, మందుగా తీసుకోవడానికి మాత్రం ఏ మాత్రం ప్రయత్నించరాదు.
    2. స్వల్ప లక్షణాలున్న రోగులకు ఓరల్ స్టెరాయిడ్స్ మందులు ఇవ్వరాదు. 7 రోజుల తర్వాత కూడా జ్వరం, తీవ్రమైన స్థాయిలో దగ్గు ఉంటే, చికిత్స అందించే డాక్టరును సంప్రదించి తక్కువ మోతాదు ఓరల్ స్టెరాయిడ్స్ ఉపయోగించాలి.
    3. ఆక్సిజన్ స్థాయి పడిపోతూ ఉన్నా, ఊపిరి అందని పరిస్థితి నెలకొన్నా వెంటనే డాక్టరును, పర్యవేక్షక వైద్య బృందాన్ని సంప్రదించి రోగిని ఆసుపత్రిలో చేర్చాలి..

వైద్యపరమైన అప్రమత్తత ఎప్పుడు అవసరం..

 

 రోగి/ సంరక్షకుడు తమతమ ఆరోగ్య పరిస్థితిని  ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉండాలి. తీవ్రమైన వ్యాధి లక్షణాలు, కనిపించడం, పరిస్థితి  విషమంగా మారడం వంటి సందర్భంగాల్లో సత్వరం వైద్యపరమైన అప్రమత్తతను కోరాలి. ఇందుకోసం ఈ కింది లక్షణాలను ప్రాతిపదికగా పరిగణించాలి -

 

    1. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,
    2. ఆక్సిజన్ స్థాయి పడిపోవడం (గది వాతావరణంలో SpO2 < 94% ఉండాలి)
    3. ఛాతీలో నొప్పి/ఒత్తిడి కొనసాగుతూ ఉండటం,
    4. మానసికంగా అయోమయ పరిస్థితి.

 

  1. హోమ్ ఐసోలేషన్ ఎప్పుడు ముగించాలి.

   వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలైన నాటినుంచి కనీసం పది రోజుల వ్యవధి తర్వాత

అది కూడా వరుసగా 3 రోజులపాటు జ్వరం రాకుండా ఉంటే హోమ్ ఐసోలేషన్ ముగించవచ్చు.

 

ఒకసారి హోమ్ ఐసోలేషన్ వ్యవధి ముగిసిన తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.

 

  1. రాష్ట్ర స్థాయి/జిల్లా స్థాయి ఆరోగ్య అధికారుల పాత్ర

 

    1. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కేసులన్నింటి పరిస్థితిని రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి పరిపాలనా యంత్రాగం పర్యవేక్షించాలి.
    2. హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారి ఆరోగ్య పరిస్థితిని క్షేత్రస్థాయి సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడూ స్వయంగా సందర్శిస్తూ ద్వారా పర్యవేక్షణ జరపాలి. రోగి పరిస్థితిని రోజు వారీగా ప్రత్యేక కాల్ సెంటర్ కూడా తెలుసుకోవలసి ఉంటుంది.
    3. ప్రతి కేసు పరిస్థితినీ క్షేత్రస్థాయి సిబ్బంది, కాల్ సెంటర్  ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుంది. రోగి శారీరక ఉష్ణోగ్రత, నాడీ స్థాయి, ఆక్సిజన్ స్థాయిని పర్యవేక్షించవలసి ఉంటుంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బంది రోగికి మార్గదర్శకత్వం వహిస్తుంది. రోగికి, రోగి సంరక్షణ బాధ్యతలు నిర్వహించే వారికి కూడా తగిన సూచనలు ఇస్తుంది.  హోమ్ ఐసోలేషన్ లో ఉండేవారి పరిస్థితిపై పర్యవేక్షణకోసం ఈ రోజువారీ పర్యవేక్షణ పద్ధతిని కచ్చితంగా పాటించవలసి ఉంటుంది.
    4. హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న రోగుల వివరాలను కోవిడ్-19 వెబ్ పోర్టల్.లో, ఫెసిలిటీ యాప్.లో డి.ఎస్.ఒ. యూజర్ గా ఎప్పటికప్పుడు నవీకరించవలసి ఉంటుంది. ఈ రికార్డుల నవీకరణ ప్రక్రియను రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించవలసి ఉంటుంది.
    5. హోమ్ ఐసోలేషన్ నుంచి చికిత్సకోసం రోగిని ఆసుపత్రికి తరలించవలసిన అవసరం ఏర్పడినపుడు అందుకు సంబంధించిన వ్యవస్థను కల్పించి, దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అవసరమైన అంబులెన్స్ సేవలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ఏర్పాటుపై ప్రజల్లో భారీ స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
    6. రోగికి సంబంధించిన కుటుంబంలోని సభ్యుల, ఇతర సన్నిహితుల ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. క్షేత్రస్థాయి సిబ్బంది విధించిన నిబంధనల ప్రకారం వారికి పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. 

 

****


(Release ID: 1715150) Visitor Counter : 1334