రైల్వే మంత్రిత్వ శాఖ

ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు మొత్తం 510 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ ను సరఫరా చేసిన - ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ లు


హర్యానా మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ ను పొందడానికి, ఫరీదాబాద్ నుండి రూర్కెలాకు బయలుదేరనున్న - ఐదు ఖాళీ కంటైనర్లు


ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా మొదటి మొదటి కన్సైన్మెంటును అందుకున్న - మధ్యప్రదేశ్

Posted On: 28 APR 2021 4:00PM by PIB Hyderabad

భారత రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలకు ద్రవ రూప వైద్య ఆక్సిజన్‌ ను అందించే ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.  ఇప్పటివరకు మొత్తం 510 మెట్రిక్ టన్నులకు పైగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌.ఎం.ఓ) ను మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు సరఫరా చేయడం జరిగింది. 

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ కోసం, హర్యానా ప్రభుత్వం కూడా, రైల్వేలను అభ్యర్థించింది.  రూర్కెలా లో ఆక్సిజన్ నింపడానికి గాను, ప్రస్తుతం, ఫరీదాబాద్‌ నుండి ట్యాంకర్ల ను పంపుతున్నారు.  ప్రస్తుతానికి, హర్యానా కోసం ప్రత్యేకంగా, ఐదేసి ట్యాంకర్ల తో, రెండు ఆక్సిజన్ ఎక్స్‌ ప్రెస్‌ లు, నడపాలని యోచిస్తున్నారు.

ఈ రోజు తెల్లవారుజామున 64 మెట్రిక్ టన్నులకు పైగా ద్రవ వైద్య ఆక్సిజన్‌ తో,  మధ్యప్రదేశ్ కు, మొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ చేరుకుంది.   జబల్పూర్ (1 ట్యాంకరు); భోపాల్ (2 ట్యాంకర్లు); సాగర్ (3 ట్యాంకర్లు) వంటి మధ్యప్రదేశ్‌ లోని వివిధ నగరాల్లోని పలు ప్రదేశాలలో ఈ ట్యాంకర్లను  అన్‌లోడ్ చేశారు.

లక్నో కోసం, ఎల్.ఎం.ఓ. నింపిన మూడు ట్యాంకర్లతో కూడిన నాల్గవ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైలు, ఈ రోజు లక్నో చేరుకోనుంది.   మరో ఖాళీ రేక్ (ఆరవది) లక్నో నుండి బొకారో కు వెళ్ళే దారిలో ఉంది.  ఇది ఉత్తర ప్రదేశ్ కు రవాణా చేయడం కోసం ఆక్సిజన్ నింపడానికి మరో ఆక్సిజన్ ట్యాంకర్ ను తీసుకువస్తుంది.  ఉత్తరప్రదేశ్ పౌరులకు నిరంతరాయంగా ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధంగా, ఉత్తరప్రదేశ్‌ కు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రవాణా కొనసాగుతోంది.

ఇంతవరకు, భారత రైల్వే, ఉత్తర ప్రదేశ్ కు 202 మెట్రిక్ టన్నులు;  మహారాష్ట్రకు 174 మెట్రిక్ టన్నులు; ఢిల్లీ కి 70 మెట్రిక్ టన్నులు;  మధ్య ప్రదేశ్ కు 64 మెట్రిక్ టన్నులు చొప్పున, ఎల్.ఎం.ఓ. ను పంపిణీ చేసింది. 

 

*****


(Release ID: 1714728) Visitor Counter : 214