ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆక్సిజెన్ కొరత తట్టుకోవటానికి కేంద్రం


20 క్రయోజనిక్ ట్యాంకర్ల దిగుమతి, రాష్ట్రాలకు పంపిణీ

దేశవ్యాప్తంగా 14.5 కోట్లు దాటిన మొత్తం టీకాల పంపిణీ
గత 24 గంటల్లో 2.51 లక్షలకు పైగా కొలుకున్న కోవిడ్ బాధితులు

8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ మరణాలు సున్నా
కోవిడ్ బాధితులలో మరణాల శాతం 1.12% కు తగ్గుదల

Posted On: 27 APR 2021 11:05AM by PIB Hyderabad

దేశంలో ఆక్సిజెన్ ట్యాంకర్ల కొరత సమస్యను పరిష్కరించటానికి కేంద్రప్రభుత్వం 10 మెట్రిక్ టన్నులు, 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం

ఉన్న క్రయోజనిక్ ట్యాంకర్లను దిగుమతి చేసుకొని రాష్టాలకు కేటాయిస్తోంది. ద్రవరూప,   వైద్యపరమైన ఆక్సిజెన్ తయారీ కేంద్రాలను,

అవసరమున్న ప్రదేశాలను చూపటం ద్వారా వాటి మధ్య అనుసంధానానికి వివిధ రాష్ట్రాల అవసరాలను తీర్చటం సాధ్యమవుతుందని

భావిస్తున్నారు. ఇప్పటివరకు క్రయోజనిక్ ట్యాంకర్ల కొరత కారణంగా ఆక్సిజెన్ రవాణాకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయని

భావిస్తుండగా ఇప్పుడు ఆ సమస్య తీరుతుంది. ఇప్పుడు మొత్తం 20 క్రయోజనిక్ ట్యాంకర్లను దిగుమరి చేసుకుంటున్నారు. 

సాధికారతాబృందం -2 సారధ్యంలో రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, పరిశ్రమల, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం

ఉమ్మడిగా ఈ దిగువ పేర్కొన్న రాష్టాల అవసరాలకు తగినట్టు ఆక్సిజెన్ రవాణాను పర్యవేక్షిస్తాయి.

 

దేశవ్యాప్తంగా ఇస్తున్న కోవిడ్ టీకా డోసుల సంఖ్య  doses నేటికి  14.5 కోట్లు దాటింది. ఈ రోజు ఉదయం 7 గంటలకు అందిన

సమాచారం ప్రకారం  20,74,721 శిబిరాల ద్వారా 14,52,71,186 టీకా డోసుల పంపిణీ జరిగింది.  ఇందులో ఆరోగ్య సిబ్బందికి

ఇచ్చిన 93,24,770 మొదటి డోసులు, 60,60,718 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన 1,21,10,258 మొదటి డోసులు,

 64,25,992 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన  5,05,77,743 మొదటి డోసులు,  87,31,091 రెండో డోసులు,

45-60 ఏళ్ల మధ్యవారికిచ్చిన  4,93,48,238 మొదటి డోసులు,  రెండో డోసులు 26,92,376 ఉన్నాయి.  

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

60 పైబడ్డ వారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

93,24,770

60,60,718

1,21,10,258

64,25,992

4,9ఇప్ప3,48,238

26,92,376

5,05,77,743

87,31,091

14,52,71,186

 

ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలలో 10 రాష్టాలవాటా 67.3% ఉంది.

గత 24 గంటలలో 31 లక్షలకు పైగా టీకా డోసులిచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన్ 101వ రోజైన ఏప్రిల్ 26న

31,74,688 డోసుల పంపిణీ జరిగింది. అందులో  19,73,778 మంది లబ్ధిదారులకు 22,797 శిబిరాల ద్వారా మొదటి డోస్ ఇవ్వగా

12,00,910 మందికి రెండో డోస్ ఇచ్చారు.

 

తేదీ: ఏప్రిల్ 26, 2021 ( 101 రోజు) 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 మధ్య వయసు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

25,347

50,829

1,13,062

1,00,751

11,69,656

2,74,518

6,65,713

7,74,812

19,73,778

12,00,910

 

దేశవ్యాప్తంగా కరోనా నుంచి బైటపడ్డవారి సంఖ్య 1,45,56,209 కాగా జాతీయ స్థాయి కోలుకున్నవారి శాతం 82.54%.

గత 24 గంటలలో 2,51,827 మంది కోలుకోగా వీరిలో పది రాష్ట్రాలలోనే 79.70% మంది ఉన్నారు.

 

గడిచిన 24 గంటలలో కొత్తగా 3,23,144 మందికి కరోనా సోకింది. పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ,

చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్. తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ లలో 71.68% కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో

అత్యధికంగా 48,700 కేసులు రాగా, ఆ తరువాత స్థానాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ లో 33,551, కర్నాటకలో  29,744 వచ్చాయి.

 

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 28 కోట్లకు పైగా కోవిడ్ నిర్థారణ పరీక్షలుజరిగాయి. అందులో పాజిటివ్ శాతం 6.28%.

 

దేశవ్యాప్తంగా కోవిడ్ చికిత్స అందుకుంటున్నవారి సంఖ్య 28,82,204 కు చేరింది. ఇది ఇప్పటిదాకా వచ్చిన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో

16.34%. గత 24 గంటల్లో చికిత్సపొందుతున్నవారి సంఖ్య  68,546 పెరిగింది.  ఎనిమిది రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్,

ఉత్తరప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, కేరళ మాత్రమే ఇందులో 69.1% వాటా పొందటం గమనార్హం.

 

 

దేశవ్యాప్తంగా ఉన్న కేసులలో చికిత్సలో ఉన్నవి 16.43% కాగా కోలుకున్నవి  82.54%.

 

రోజువారీ పాజిటివ్ శాతం ప్రస్తుతం 20.02% ఉంది.

 

 

దేశవ్యాప్తంగా మొత్తం కేసుల్లో మరణాల శాతం తగ్గుతూ ప్రస్తుతం 1.12% కి చేరింది. గత 24 గంటలలో 2,771 కోవిడ్

మరణాలు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాలవాటా 77.3% ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 524 మంది చనిపోగా.

 ఢిల్లీలో 380 మంది చనిపోయారు.

 

 

ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో గడిచిన 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి:

డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, లద్దాఖ్, త్రిపుర, లక్షదీవులు, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, 

అండమాన్- నికోబార్ దీవులు

 

 

****

 


(Release ID: 1714322) Visitor Counter : 253