రక్షణ మంత్రిత్వ శాఖ
పని భారం ఎక్కువగా ఉన్న 51 ఈసీహెచ్ఎస్ పోలీక్లినిక్ లలో సీనియర్లు వారిపై ఆధారపడిన వారికీ మెరుగైన చికిత్స అందించడానికి కాంట్రాక్టు పద్ధతిన అదనపు సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపిన రక్షణశాఖ మంత్రిశ్రీ రాజనాథ్ సింగ్
Posted On:
27 APR 2021 10:56AM by PIB Hyderabad
పని భారం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించిన మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ( ఈసీహెచ్ఎస్ ) పరిధిలో పనిచేస్తున్న 51 పోలీ క్లినిక్ లలో అదనపు సిబ్బంది నియామకానికి రక్షణశాఖ మంత్రి శ్రీ రాజనాధ్ సింగ్ ఆమోదం తెలిపారు. వీటిలో సీనియర్లు వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఆమోదించిన సంఖ్యకు మించి తాత్కాలిక పద్ధతిలో కాంట్రాక్టు సిబ్బందిని నియమించడానికి రక్షణశాఖ మంత్రి తన ఆమోదాన్ని తెలిపారు. కోవిడ్-19 ని తట్టుకొని వైద్య సౌకర్యాలను మెరుగుపరచడానికి రక్షణమంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, డ్రైవర్ మరియు చౌకిదార్లతో సహా కాంట్రాక్టు సిబ్బందిని స్టేషన్ హెడ్ క్వార్టర్స్ ద్వారా రాత్రి పని కోసం, సాధారణ పని గంటలకు మించి, మూడు నెలల కాలానికి తీసుకుంటారు.
లక్నో, న్యూ ఢిల్లీ కంటోన్మెంట్ (బిహెచ్‌డిసి), బెంగళూరు (అర్బన్), డెహ్రాడూన్, కొట్‌పుట్లి, అమృతసర్ , మీరట్, చండీఘర్ , జమ్మూ, న్యూ ఢిల్లీ (లోధి రోడ్), సికింద్రాబాద్, ఆగ్రా, అంబాలా, గ్రేటర్ నోయిడా, గురుదాస్ పూర్ పూణే, త్రివేండ్రం, జలంధర్, కాన్పూర్, గుర్గాన్, గుర్గాన్( హిందోన్), పఠాన్ కోట్, జోధాపూర్, లూథియానా, రోపార్, తరన్ తరన్ / పట్టి, కలకత్తా డోనాపూర్ ( పాట్నా), ఖాడ్కి (పూణే), పాలంపూర్, బరేలీ, కొల్హాపూర్, యోల్, దక్షిణ పూణే (లోహేగావ్), విశాఖపట్నం, జైపూర్, గుంటూరు, బరాక్‌పూర్, చెన్నై, గోరఖ్‌పూర్, పాటియాలా, నోయిడా, భోపాల్, కొచ్చి, వెల్లూరు మరియు రాంచీ ఈసీహెచ్ఎస్ పోలీక్లినిక్ లలో పనిభారం ఎక్కువగా ఉందని గుర్తించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వైద్యం కోసం రాత్రి వేళల్లో కూడా వైద్యం కోసం వచ్చే సీనియర్లు, వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. 2021 ఆగస్ట్ 15వ తేదీ వరకు అదనపు సిబ్బంది నియామక ఉత్తర్వులు అమలులో ఉంటాయి.
****
(Release ID: 1714318)
Visitor Counter : 229