ఉక్కు మంత్రిత్వ శాఖ

3131 మెట్రిక్ టన్నుల ద్రవ వైద్య ఆక్సిజన్ (ఎల్.ఎం.ఓ) సరఫరా చేసిన - ఉక్కు కర్మాగారాలు

మరింత ఎల్.ఎం.ఓ. ను అందుబాటులో ఉంచడానికి వీలుగా వారి భద్రతా స్టాక్‌ ను వినియోగించడానికి కూడా సిద్ధంగా ఉన్న - స్టీల్ ప్లాంట్లు


నత్రజని మరియు ఆర్గాన్ ట్యాంకర్లు, ఆక్సిజన్ రవాణా చేయడానికి వీలుగా మార్చబడుతున్నాయి

Posted On: 26 APR 2021 4:41PM by PIB Hyderabad

ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలోని ఉక్కు కర్మాగారాలు, 2021 ఏప్రిల్,  25వ తేదీన వివిధ రాష్ట్రాలకు 3,131.84 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌.ఎం.ఓ) ను సరఫరా చేశాయి.  కాగా, అంతకుముందు రోజు,  2,894 టన్నుల ఎల్.ఎం.ఓ. ను సరఫరా చేయగా, వారం రోజుల ముందు, సగటున, రోజుకు,  1500 / 1700 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. చొప్పున రవాణా చేశాయి.  ఏప్రిల్ 25వతేదీన 3,468.6 మెట్రిక్ టన్నుల ఎల్.ఎం.ఓ. ఉత్పత్తి జరిగింది.

 

నత్రజని, ఆర్గాన్ ఉత్పత్తి ని తగ్గించి, కేవలం ఎల్.ఎం.ఓ. ను మాత్రమే ఉత్పత్తి చేయడం వంటి వివిధ చర్యలు చేపట్టడం ద్వారా, ఉక్కు కర్మాగారాలు ఎల్.ఎం.ఓ. సరఫరాను పెంచగలిగాయి.

 

ఉక్కు కర్మాగారాలు సాధారణంగా 3.5 రోజులకు సరిపడా ఎల్‌.ఎమ్‌.ఓ. ను భద్రతా నిల్వగా, తమ ట్యాంకులలో ఉంచవలసిన అవసరం ఉంది. ఈ నిల్వలను, ఆక్సిజన్ ప్లాంట్ లో ఎప్పుడైనా సమస్య ఏర్పడినప్పుడు ఉపయోగిస్తారు.  ఉక్కు ఉత్పత్తిదారుల తో నిరంతరం సంప్రదింపులు జరపడం ద్వారా, ఇంతవరకు 3.5 రోజులకు సరిపడా ఉంచుతున్న భద్రతా నిల్వలను 0.5 రోజులకు తగ్గించడం జరిగింది, తద్వారా ఎల్.ఎం.ఓ. సరఫరా గణనీయంగా పెరిగింది.

 

ఎల్.ఎం.ఓ. సరఫరా, రవాణాలను వేగవంతంగా, సులభంగా చేయడానికి, నిర్దిష్ట సంఖ్యలో నత్రజని, ఆర్గాన్ ట్యాంకర్లను ఆక్సిజన్‌ రవాణా చేయడానికి వీలుగా మార్పు చేయాలని, డి.పి.ఐ.ఐ.టి. నిర్దేశించింది.  ఈ రోజు కు, 8,345 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 765 నత్రజని ట్యాంకర్లు మరియు 7,642 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 434 ఆర్గాన్ ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయి.  వీటిలో కొన్ని ట్యాంకర్లను ఆక్సిజన్ రవాణా చేయడానికి వీలుగా వినియోగించుకోవడానికి పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పి.ఈ.ఎస్.ఓ) అనుమతి మంజూరు చేసింది. ఎల్‌.ఎం.ఓ. ను రాష్ట్రాలకు రవాణా చేయడంలో నెలకొన్న పెద్ద అవరోధాన్ని, ఈ చర్య తొలగించనుంది.  ఎల్.ఎం.ఓ. రవాణా చేయడానికి, ప్రస్తుతం, 15,900 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన 1172 ట్యాంకర్లు అందుబాటులో ఉన్నాయి. 

 

భిలాయ్ ఉక్కు కర్మాగారంలో, 15 మెట్రిక్ టన్నుల మేర ఎల్.ఎం.ఓ. ఉత్పత్తిని పెంచడం కోసం, తమ ఇతర కార్యకలాపాలు కొంత మేర ఆపివేశారు.  అయితే, కొంత మేర, ఈ విధంగా, పనులు ఆపివేయడం వల్ల, వాటి ఉత్పత్తి, అమ్మకాలకు ఎటువంటి అవరోధం ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో ఉన్న ఇతర ఉక్కు కర్మాగారాలకు కూడా వారి సామర్థ్యాన్ని పెంచే అవకాశాన్ని అన్వేషించడానికి ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

 

*****



(Release ID: 1714272) Visitor Counter : 154