రైల్వే మంత్రిత్వ శాఖ

రానున్న 24 గంటల్లో 140 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను సరఫరా చేయ‌నున్న భారతీయ రైల్వే


- రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్న 70 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను మోస్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు

- ప్రాణ‌ వాయువు రవాణాకు వీలుగా బహుళ మార్గాల‌ను ర్యాంప్‌లు & రేక్‌ల‌ను సిద్ధం చేసిన భార‌తీయ రైల్వే

Posted On: 25 APR 2021 6:19PM by PIB Hyderabad

కోవిడ్ నేప‌థ్యంలో దేశ ప్ర‌జ‌ల‌కు స‌హాయాన్ని అందించేందుకు గాను భార‌తీయ రైల్వే సంస్థ
యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది. ఇందులో భాగంగా భారతీయ రైల్వే సంస్థ వచ్చే 24 గంటల్లో 140 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను సరఫరా చేయనుంది. ప్రస్తుతం, 9 ట్యాంకర్లు ఇప్పటికే ర‌వాణాలో ఉన్నాయి, వీటిలో 5 ఈ రాత్రికి లక్నోకు చేరుకుంటాయి. బోకారో నుండి ఇప్పటికే ప్రారంభ‌మైన మ‌రో 4 ఎల్ఎమ్ఓ కంటైనర్లు.. రేపు ఉద‌యం లక్నోకు చేరుకుంటాయి.
ఇప్పటివరకు, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ముంబై నుండి వైజాగ్ మధ్య నాగ్‌పూర్ మీదుగా నాసిక్ మరియు లక్నో నుండి బోకారో అక్క‌డి నుండి తిరిగి వ‌స్తూ సేవ‌లందిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 150 టన్నుల ద్రవ ఆక్సిజన్ క‌లిగిన దాదాపు 10 కంటైనర్లను రైలు మార్గంలో ర‌వాణా చేశారు. ప్రస్తుతం 9 ట్యాంకర్లు ఇప్పటికే ప్రయాణంలో ఉన్నాయి. వీటిలో 5 ఈ రాత్రికి లక్నోకు చేరుకుంటాయి. బోకారో నుండి ఇప్పటికే ప్రారంభ‌మైన‌ మిగిలిన 4 ఎల్ఎమ్ఓ కంటైనర్లు ఈ ఉద‌య‌నానికి లక్నోకు చేరుకుంటాయి. 4 ట్యాంకర్ల‌తో కూడిన (సుమారు 70 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓ) ఒక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు.. ఈ రాత్రి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌గ‌డ్ నుండి ఢిల్లీకి బయలుదేరుతుంది. మ‌రోవైపు రోడ్ ట్యాంకర్లను పొందాలని భారత రైల్వే ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరింది. దుర్గాపూర్ నుండి ఢిల్లీ వ‌ర‌కు కంటైనర్ వ్యాగన్లపై ఆక్సిజన్ కంటైనర్లను తరలించడానికి భారత రైల్వే కూడా సిద్ధంగా ఉంది.
కింది మార్గాల్లో ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి భారత రైల్వే పూర్తిగా స‌న్న‌ద్ధ‌మైంది:
మహారాష్ట్రకు ఎక్కువ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పంపిణీ చేసేందుకు గాను భారతీయ‌ రైల్వే జామ్‌న‌గ‌ర్‌ నుండి ముంబ‌యికి, నాగ్‌పూర్‌ / పుణె న‌గ‌రాల‌కు విశాఖ‌ప‌ట్ట‌ణం / అంగుల్ నుండి ఆక్సిజన్ రవాణా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను అందించడానికి  భారత రైల్వే అంగూల్ నుండి సికింద్రాబాద్ వెళ్లే మార్గాన్ని కూడా రూపొందించి సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఖాళీగా వ‌స్తున్న రైళ్ల ద్వారా అంగుల్ నుండి విజయవాడకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను రవాణా చేయాలని భారత రైల్వే యోచిస్తోంది. మధ్యప్రదేశ్ కోసం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ రవాణాకు భారత రైల్వే జంషెడ్‌పూర్‌ నుండి జబల్పూర్ వెళ్లే మార్గాన్ని మ్యాప్ చేసింది. లిక్విడ్ ఆక్సిజన్ ర‌వాణా క్రయోజెనిక్ కార్గోగా ఉండటం వలన గరిష్ట వేగం, గరిష్ట త్వరణం, క్షీణత, ద్రవ ఆక్సిజన్ ట్యాంకర్ల లభ్యత, ర్యాంప్లను లోడ్ చేయడం వంటి లోడింగ్ పరిమితులు వంటి అనేక అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ర‌వాణా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి వ‌స్తోంది. మ్యాపింగ్ మార్గం వెంట లభించే గరిష్ట అనుమతుల్ని కూడా (ఎందుకంటే వివిధ ఆర్‌యుబీలు మరియు ఎఫ్ఓబీల నేప‌థ్యంలో) భార‌తీయ రైల్వే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ప‌నిచేస్తోంది. 

***


(Release ID: 1714081) Visitor Counter : 147