ఉక్కు మంత్రిత్వ శాఖ

దేశంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరాను భర్తీ చేయడానికి స్టీల్ సెక్టార్ కంపెనీలు తమ వంతు కృషి చేస్తున్నాయి;

స్టీల్ సెక్టార్ నిన్న 3474 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసింది;

ఎల్ఎంవో ఉత్పత్తిని పెంచడానికి మరియు పంపిణీ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు

Posted On: 25 APR 2021 3:35PM by PIB Hyderabad

 

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రదాన్ మార్గదర్శకత్వంలో ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు, మరియు ఉక్కు రంగంలోని ఇతర ప్రైవేటు సంస్థలు ప్రస్తుతం దేశం కోసం శ్రమిస్తున్నాయి. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వంతో కలిసి తమ వంతు కృషిని కొనసాగిస్తున్నాయి.

స్టీల్ ప్లాంట్ల మొత్తం రోజువారీ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం 2834 మెట్రిక్ టన్నులు. స్టీల్ సెక్టార్లో 33 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి (సిపిఎస్ఇలతో మరియు ప్రైవేట్ లిమిటెడ్ లో) వీటిలో 29 క్రమం తప్పకుండా ట్యాప్ చేయబడతున్నాయి. స్టీల్ సెక్టార్లో రోజువారీ ఎల్ఎమ్ఓ ఉత్పత్తి సామర్థ్యం 2834 మెట్రిక్ టన్నులు కాగా అవి 24 ఏప్రిల్ 2021న 3474 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయి.ఇది ఎల్ఎంవో ఉత్పత్తి సామర్థ్యం కంటే ఎక్కువ.  ఎందుకంటే చాలా యూనిట్లు నత్రజని మరియు ఆర్గాన్ ఉత్పత్తిని తగ్గించాయి మరియు ఎల్ఎంవోను మాత్రమే ఉత్పత్తి చేశాయి. ఈ ప్రయత్నాలన్నిటితో, ఏప్రిల్ 24 న 2894 టన్నులను వివిధ రాష్ట్రాలకు పంపించారు. పబ్లిక్ & ప్రైవేట్ సెక్టార్స్ లో స్టీల్ ప్లాంట్స్  ఒక వారం ముందు రోజుకు 1500/1700 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశాయి.

స్టీల్ ప్లాంట్‌కు ఆక్సిజన్ వాయువు అవసరం. ప్రధానంగా ఉక్కు తయారీకి మరియు బ్లాస్ట్ ఫర్నేస్‌లలో ఆక్సిజన్ సుసంపన్నం కోసం, లాన్సింగ్ మరియు గ్యాస్ కటింగ్ వంటి అవసరాలకు దీన్ని ఉపయోగిస్తారు. అందువల్ల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లలోని క్యాప్టివ్ ఆక్సిజన్ ప్లాంట్లు ప్రధానంగా ఆక్సిజన్, నత్రజని మరియు ఆర్గాన్ వాయువు ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి రూపొందించబడ్డాయి. తరువాత కావలసిన ఒత్తిడిలో ప్రక్రియ అవసరాలను తీర్చడానికి ప్రెజర్ రిడక్షన్ & మేనేజ్మెంట్ సిస్టమ్ (పిఆర్ఎంఎస్) ద్వారా మళ్ళించబడతాయి. ఇటువంటి ప్లాంట్లు గరిష్ట సామర్థ్యంతో 5-6% గరిష్ట లిక్విడ్ ఆక్సిజన్ (ఎల్ఎఎక్స్) ను ఉత్పత్తి చేయగలవు. ఇది పారిశ్రామిక ఆక్సిజన్‌తో పోలిస్తే అత్యంత స్వచ్ఛమైన ఉత్పత్తి. ప్లాంట్లు ఆక్సిజన్‌ను ఉపయోగించడం ద్వారా మాత్రమే ఎల్వోఎక్స్ ఉత్పత్తిని ఆప్టిమైజ్ చేయగలవు మరియు ప్రాసెస్ పారామితులను ఆప్టిమైజ్ చేయగలవు.

ఈ సమయంలో లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి మరియు ప్రైవేటు మరియు  పబ్లిక్‌ రంగంలోని అన్ని ఆక్సిజన్ ప్లాంట్లు రోజంతా పనిచేస్తున్నాయి. అలాగే ఆ ఆక్సిజన్‌ ను పంపిణీ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్లు ఆక్సిజన్ సిలిండర్లను నింపి రాష్ట్రాలు / ఆసుపత్రులకు కూడా సరఫరా చేస్తున్నాయి.

ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని స్టీల్ ప్లాంట్లు వివిధ రాష్ట్రాలకు ద్రవ ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సెయిల్ ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సగటు డెలివరీ రోజుకు 800 టన్నులకు పైగా పెంచబడింది. ఏప్రిల్ 23 న సుమారు 1150 టి ఎల్‌ఎంఓ పంపిణీ చేయబడింది. నిన్న పంపిణీ చేసిన పరిమాణం 960 టన్నులు. సెయిల్ నిరంతరం ఎల్‌ఎంఓ సరఫరాను పెంచుతోంది. 2020 ఆగస్టు నుండి నిన్నటి వరకు బిలాయ్, బోకారో, రూర్కెలా, దుర్గాపూర్ మరియు బర్న్‌పూర్‌లోని సెయిల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ల నుండి సరఫరా చేసిన మొత్తం లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ 39,647 టన్నులు.

ఆర్ఐఎన్ఎల్ విషయానికొస్తే గత ఆర్ధిక సంవత్సరం 2020-21లో ఇది 8842 టన్నుల ఎల్ఎంవోను సరఫరా చేసింది. ఈ ఆర్ధికసంవత్సం ఏప్రిల్ 13 నుండి ఈ రోజు ఉదయం వరకు 1300 టన్నులకు పైగా మెడికల్ ఆక్సిజన్ అందించింది. గత మూడు రోజుల్లో 100 టన్నుల నుండి 140 టన్నులకు పెరిగింది. కోవిడ్ రోగుల వైద్య అవసరాలను తీర్చడానికి ఫస్ట్ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 22 న ఆర్ఐఎన్ఎల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుండి 100 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు తీసుకువెళ్ళింది.


 

*****



(Release ID: 1714070) Visitor Counter : 192