ఆర్థిక మంత్రిత్వ శాఖ
విజృంభిస్తున్న మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని కొన్ని కాలపరిమితులను పొడిగించిన ప్రభుత్వం
Posted On:
24 APR 2021 12:15PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 మహమ్మారి విజృంభించి ప్రజల జీవితాను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలోనూ, పన్నుదారులు, టాక్స్ కన్సల్టెంట్లు, ఇతర భాగస్వాముల సౌకర్యార్ధం వివిధ నోటిఫికేషన్లు, ప్రత్యక్ష పన్ను విఇవాద్ సే విశ్వాస్ చట్టం, 2020 కింద ఇంతకు ముందు 30 ఏప్రిల్, 2021 వరకు పొడిగించిన సమయాన్ని మరింత పొడిగించవచ్చు. కొన్ని కాలపరిమితులను పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
వివిధ భాగస్వాములు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందదుకు, వివిధ విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు టాక్సేషన్ అండ్ అదర్ లాస్ (రిలాక్సేషన్) అండ్ అమెండ్ మెంట్ ఆఫ్ సర్టెన్ ప్రొవిజన్స్ యాక్ట్, 2020 కింద 30 ఏప్రిల్, 2021వరకు పొడిగించిన వివిధ కాలపరిమితులనను 30 జూన్ 2021వరకు కొన్ని అంశాలలో పొడిగించింది. ఈ దిగువ అంశాలకు ఈ పొడిగింపు వర్తిస్తుందిః
(1.) ఆదాయ పన్ను చట్టం, 1961 (ఇక మీదట ది యాక్ట్‌గా వ్యవహరించే) లో కింద అంచనా, పునః అంచనా కోసం ఉత్తర్వులను జారీ చేసే కాలపరిమితిని 153 లేదా సెక్షన్ 153లో ఇచ్చిన కాలపరిమితిలో నిర్దేశించిన దాని కింద పొడిగిస్తారు.
(2.) ది యాక్ట్ లోని 144 సిలోని సబ్ సెక్షన్ (13) కింద డిపిఆర్ నిర్దేశాలను అనుసరించి ఉత్తర్వులను జారీ చేసేందుకు కాల పరిమితి;
(3.) అంచనా నుంచి తప్పించుకున్న ఆదాయాన్ని తిరిగి అంచనాకు చట్టంలోని 148 కింద తెరిచేందుకు నోటీసు జారీ చేసేందుకు కాలపరిమితి.
(4.) విత్త చట్టం 2016లోని సెక్షన్ 168లోని సబ్ సెక్షన్ (1) కింద ఈక్వలైజేషన్ లెవీని విశ్లేషణకు సమాచారం పంపే కాలపరిమితి.
డైరెక్ట్ టాక్స్ వివాద్ సే విశ్వాస్ చట్టం, 2020 కింద కట్టవలసిన మొత్తం కట్టేందుకు కాలపరిమితిని, అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేకుండా చెల్లించేందుకు కాలపరిమితిని 30 జూన్, 2021వరకు పొడిగించాలని నిర్ణయించారు.
పైన పేర్కొన్న తేదీల పొడిగింపుకు సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలోనే జారీ అవుతాయి.
***
(Release ID: 1713795)
Visitor Counter : 210