ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 13.83 కోట్లకు పైగా టీకాలు


గత 24 గంటలలో 29 లక్షలకు పైగా టీకాలు

గడిచిన 24 గంటలలో కోలుకున్నవారు 2.19 లక్షలు

కోవిడ్ కేసులలో మరణాల శాతం 1.14% కు తగ్గుదల

ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కానివి 11 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలు

Posted On: 24 APR 2021 11:24AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటి దాకా ఇచ్చిన కోవిడ్ టీకాల సంఖ్య 13.83 కోట్లు దాటింది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం

ప్రకారం 19,80,105 శిబిరాల ద్వారా  13,83,79,832 టీకా డోసులు ఇచ్చారు.  ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన

92,68,027 మొదటి డోసులు,  59,51,076 రెండో డోసులు,  కోవిడ్ యోధులకిచ్చిన  1,18,51,655 మొదటి డోసులు,

 61,94,851 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన  4,91,45,265 మొదటి డోసులు,   71,65,338 రెండో డోసులు,

 60 ఏళ్ళు పైబడ్డ వారికిచ్చిన మొదటి డోసులు 4,66,71,540, రెండో డోసులు   21,32,080 ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

92,68,027

59,51,076

1,18,51,655

61,94,851

4,66,71,540

21,32,080

4,91,45,265

71,65,338

13,83,79,832

 

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాలలొ 58.92% టీకాలు ఎనిమిదిరాష్టాలలో ఇచ్చినవే.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016FGK.jpg

గత 24 గంటలలో 29 లక్షలకు పైగా కోవిడ్ టీకా డోసులిచ్చారు. దేశవ్యాప్తంగా టీకాలివ్వటం మొదలైన 98వ రోజైన ఏప్రిల్

23న  మొత్తం 29,01,412 టీకాలివ్వగా 18,63,024 మంది లబ్ధిదారులకు 26,927 శిబిరాల ద్వారా మొదటి డోసులివ్వగా

10,38,388 మందికి రెండో డోసు ఇచ్చారు.

 

తేదీ: ఏప్రిల్ 23, 2021 ( 98వ రోజు)   

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45- 60 ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

25,663

46,337

1,19,696

1,17,591

11,07,210

2,30,784

6,10,455

6,43,676

18,63,024

10,38,388

 

భారత దేశంలో ఇప్పటిదాకా కోవిడ్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య  1,38,67,997 కాగా, కోలుకున్నవారి శాతం  83.49%.

గత 24 గంటలలో 2,19,838 మంది కోలుకున్నారు. వాళ్లలో  82.94% మంది పది రాష్ట్రాలవారే

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002ZT5E.jpg

3,46,786  కొత్త కేసులు గత 24 గంటలలో నమోదయ్యాయి. పది రాష్ట్రాలు – మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ,

చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ ఈ కొత్త కేసులలో 74.15% వాటా పొందాయి. మహారాష్టలో అత్యధికంగా

 66,836 కేసులు రాగా ఆ తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్ లో 36,605, కేరళలో  28,447 వచ్చాయి.  

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003R94F.jpg

ఈ క్రింద చూపిన విధంగా 12 రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల కనబడుతోంది. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZBT2.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005S3GY.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006ENRZ.jpg

దేశవ్యాప్తంగా కరోనాతో చికిత్సపొందుతున్న వారి సంఖ్య ప్రస్తుతం 25,52,940. కు చేరుకుంది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో  

15.37% . గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 1,24,324 పెరిగింది.  

గత ఏడాది కాలంలో చికిత్సలో ఉన్న కేసులలో మార్పును ఈ క్రింది చిత్రపటం చూపుతుంది. 

ఏడు రాష్టాలు- మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్, గుజరాత్, కేరళలోనే భారతదేశంలో మొత్తం చికిత్సలో

ఉన్నకేసులలో 66.66% ఉన్నాయి.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007J5Z0.jpg

జాతీయ స్థాయిలో కేసులలో మరణాల శాతం తగ్గుతూనే ఉంది. ప్రస్తుతం అది 1.14% గా ఉంది..

గత 24 గంటలలో 2,624 మంది కోవిడ్ తో చనిపోయారు.  వీరిలో 82.28% మంది పది రాష్టాలకు చెందినవారే ఉండగా

మహారాష్ట్రలో అత్యధికంగా 773 మంది, ఢిల్లీలో 348 మంది చనిపోయారు.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008BT5W.jpg

గత 24 గంటలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 11 ఉన్నాయి. అవి: లద్దాఖ్,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0092KJC.jpg

డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, మేఘాలయ, మిజోరం, లక్షదీవులు, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్,

అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్ 

***


(Release ID: 1713760) Visitor Counter : 190