రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్‌-19 కేసులలో పెరుగుదల నేప‌థ్యంలో జర్మనీ నుండి ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను దిగుమతి చేసుకోనున్న ఏఎఫ్ఎంఎస్‌


- 2021 డిసెంబర్ 31 వరకు ఏఎఫ్‌ఎంఎస్‌లోని ఎస్‌ఎస్‌సీ వైద్యులకు ఎంఓడీ పొడిగింపు

Posted On: 23 APR 2021 5:00PM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా కోవిడ్-19 వైర‌స్ రెండవ ద‌శ వ్యాప్తి నేప‌థ్యంలో ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరత నెల‌కొన్నందున.. జర్మనీ నుండి ఆక్సిజన్ వాయువును ఉత్పత్తి చేసే ప్లాంట్లు, కంటైనర్లను దిగుమతి చేసుకోవాలని 'ఆర్ముడ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్' (ఏఎఫ్‌ఎంఎస్‌) నిర్ణయించింది. కోవిడ్-19 రోగుల అవ‌స‌రాల‌ను త‌గు విధంగా తీర్చేందుకు వీలుగా ఏఎఫ్‌ఎంఎస్‌ ఆసుప‌త్రులలో మోహరించేలా జర్మనీ నుండి.. ఇరవై మూడు మొబైల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల‌ను విమానం ద్వారా  
తీసుకురానున్నారు. ఈ ప్లాంట్‌లు ఒక్కొక్క‌టి నిమిషానికి 40 లీటర్ల ఆక్సిజన్, గంటకు 2,400 లీటర్లు ఉత్పత్తి చేసే సామర్థ్యమును క‌లిగి ఉండ‌నున్నాయి. ఈ
తీరున ఈ ప్లాంట్లు 20-25 మంది రోగుల అవ‌స‌రాల‌ను తీర్చ‌నున్నాయి. ఆయా
ప్లాంట్‌ల ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఇవి చిన్న‌గా సుల‌భంగా త‌ర‌లించేందుకు వీలుగా
ఉంటాయి. ఈ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు వారంలోపు భారతదేశానికి వస్తాయని భావిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ర‌క్ష‌ణ శాఖ మ‌రో కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుత వైద్య సేవల్లో ఉన్న ఏఎఫ్ఎంఎస్‌లోని షార్ట్ సర్వీస్ కమిషన్డ్ వైద్యులకు పొడిగింపును ఇవ్వ‌నుంది. ఈ నిర్ణ‌యం 238 మంది వైద్యుల‌తో ఏఎఫ్ఎంఎస్ బ‌లాన్ని మ‌రింత‌గా పెంచ‌నుంది.

***



(Release ID: 1713663) Visitor Counter : 254