ప్రధాన మంత్రి కార్యాలయం

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆక్సీజన్ ఉత్పత్తిదారుల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 23 APR 2021 5:56PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆక్సీజన్ ఉత్పత్తిదారుల తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఒక సమావేశాన్ని నిర్వహించారు.  ఈ కాలం సవాళ్ల కు ఎదురొడ్డవలసింది మాత్రమే కాక అతి తక్కువ సమయం లో పరిష్కారాల ను అందించవలసిన కాలం కూడా అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ సందర్భం లో అన్నారు.  ఆక్సీజన్ ఉత్పత్తిదారుల కు, ప్రభుత్వానికి మధ్య మంచి సమన్వయాన్ని కొనసాగించుకోవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  

గత కొన్ని వారాల లో ఆక్సీజన్ ఉత్పత్తిదారులు వారి ఉత్పత్తి ని పెంచినందుకు ప్రధాన మంత్రి వారిని అభినందించారు.  లిక్విడ్ ఆక్సీజన్ ఉత్పత్తి ని అధికం చేయడానికి అనేక చర్యలను తీసుకోవడాన్ని ఆయన గుర్తించారు.  పరిశ్రమల లో వినియోగించే ఆక్సీజన్ ను దేశం లో వైద్య సంబంధి అవసరాలను తీర్చడం కోసం మళ్లించినందుకు పరిశ్రమ రంగానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ధన్యవాదాలను కూడా వ్యక్తం చేశారు.

స్థితి ని మరింత మెరుగుపరచడం కోసం, రాబోయే రోజుల లో ఆక్సీజన్ కు ఏర్పడే డిమాండు ను తట్టుకోవడం కోసం పరిశ్రమ తాలూకు పూర్తి సామర్థ్యాన్ని వినియోగం లోకి తీసుకు రావలసిన అంశాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు.  ఆక్సీజన్ సిలిండర్ ల అందుబాటు ను వృద్ధి చెందించలసిన అవసరం ఉందని, అలాగే ఆక్సీజన్ రవాణా కు గల లాజిస్టిక్స్ సదుపాయాల ను ఉన్నతీకరించవలసిన అవసరం కూడా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ఇతర వాయువుల ను రవాణా చేయడానికి ఉద్దేశించినటువంటి ట్యాంకర్ లను ప్రాణవాయువు సరఫరా కు వాడవలసిందిగా పరిశ్రమ కు ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆక్సీజన్ కు సంబంధించినంతవరకు రాష్ట్రాల అవసరాల ను పట్టించుకొంటూ, ట్యాంకర్ లు సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి కేంద్రానికి చేరుకొనేటట్టుగా రైల్వేస్ ను, వాయు సేన ను ప్రభావవంతమైనటువంటి పద్ధతి లో ఉపయోగించుకోవడం పై ప్రభుత్వం దృష్టి ని సారిస్తోందని ప్రధాన మంత్రి చెప్పారు.

ప్రభుత్వం, రాష్ట్రాలు, పరిశ్రమ, రవాణాదారులు, అన్ని ఆసుపత్రులు కలిసికట్టుగా ముందడుగు వేస్తూ ఏక స్థాయి లో కృషి చేయవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి చెప్పారు.  సమన్వయం ఎంత బాగుంటే, ఈ సవాలు ను ఎదుర్కోవడం అంత గా సులభతరం అవుతుంది అని ఆయన అన్నారు.

ఆక్సీజన్ ఉత్పత్తిదారుల ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ అభినందిస్తూ, వారికి ప్రభుత్వ సమర్థన పూర్తి గా ఉంటుందన్నారు; ఈ సంకటం తో పోరాడడం లో దేశం త్వరలో సఫలం కాగలుగుతుందన్న ఆశ ను ఆయన వ్యక్తం చేశారు.
 
ఈ సమావేశం లో ఆర్ఐఎల్ సిఎమ్ డి శ్రీ ముకేశ్ అంబాని, ఎస్ఎఐఎల్ చైర్ పర్సన్ శ్రీమతి సోమ మండల్, జెఎస్ డబ్ల్యు కు చెందిన శ్రీ సజ్జన్ జిందల్, టాటా స్టీల్ కు చెందిన శ్రీ నరేంద్రన్, జెఎస్ పిఎల్ కు చెందిన శ్రీ నవీన్ జిందల్, ఎఎమ్ఎన్ఎస్ కు చెందిన శ్రీ దిలీప్ ఊమెన్, లిండే కు చెందిన శ్రీ ఎమ్. బనర్జీ, ఐనాక్స్ కు చెందిన శ్రీ సిద్ధార్థ్ జైన్, ఎయర్ వాటర్ జమ్ శెద్ పుర్ ఎమ్ డి శ్రీ నోరియో శిబుయ, నేశనల్ ఆక్సీజన్ లిమిటెడ్ కు చెందిన శ్రీ రాజేశ్ కుమార్ శరాఫ్, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ గేసెస్ మేన్యుఫాక్చరర్స్ అసోసియేశన్ అధ్యక్షుడు శ్రీ సాకేత్ టికూ లు పాల్గొన్నారు.



 

***



(Release ID: 1713619) Visitor Counter : 270