ప్రధాన మంత్రి కార్యాలయం

విరార్ ఆసుపత్రి లో మంటలు రేగి ప్రాణనష్టం జరగడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి; బాధితుల కు సహాయక రాశి ని ఇచ్చేందుకు ఆయన ఆమోదం తెలిపారు

నాడు పోస్టు చేయడమైనది: 23 APR 2021 9:46AM by PIB Hyderabad

విరార్ లోని కోవిడ్-19 ఆసుపత్రి లో మంట లు చెలరేగిన కారణం గా ప్రాణనష్టం జరగడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.  గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.  మహారాష్ట్ర లోని విరార్ లో ఆసుపత్రి లో మంట లు రేగిన ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వారి దగ్గరి సంబంధికులకు  ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రెండు లక్షల రూపాయల చొప్పున సహాయక రాశి ని మంజూరు చేసేందుకు ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.  తీవ్రం గా గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది.

 

***
 


(రిలీజ్ ఐడి: 1713555) సందర్శకుల సూచీ సంఖ్య : : 263