మంత్రిమండలి

బెంగళూరు మెట్రో రైల్ 2ఎ దశ కు, 2బి దశ కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 20 APR 2021 3:44PM by PIB Hyderabad

బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్టు లో భాగం సెంట్రల్ సిల్క్ బోర్డ్ జంక్శన్ నుంచి కె.ఆర్. పురమ్ వరకు గల 2ఎ దశకు మరియు కె.ఆర్. పురమ్ నుంచి హెబ్బాళ జంక్శన్ మీదు గా విమానాశ్రయం వరకు ఉండే 2బి దశ కు మొత్తం 58.19 కిలోమీటర్లు పొడవైన ప్రాజెక్టు పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.  ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 14,788.101 కోట్ల రూపాయలు గా ఉంది.

ఈ ప్రాజెక్టు అమలు లోకి వస్తే, బెంగళూరు కు ఎంతో అవసరమైనటువంటి అదనపు సార్వజనిక రవాణా సంబంధిత మౌలిక సదుపాయం అందుబాటులోకి రాగలదు.

ఉద్దేశ్యాలు:

ఈ ప్రాజెక్టు బెంగళూరు లో పట్టణ ప్రాంత రవాణా వ్యవస్థ కు ఒక మృదురూపాన్ని ఇవ్వగలుగుతుంది.  ప్రస్తుతం సత్వర అభివృద్ధి, ప్రయివేటు వాహనాల సంఖ్య లో వృద్ధి వల్ల బెంగళూరు లో రవాణా వ్యవస్థ ప్రభావితం అయింది.  దీనితో పాటు బెంగళూరు లో భారీ నిర్మాణాలు కొనసాగుతూ ఉండడం తో  రవాణా సంబంధి మౌలిక సదుపాయాల మీద, పారిశ్రామిక కార్యకలాపాల మీద ఒత్తిడి పెరుగుతూ పోతోంది.  ఈ ప్రాజెక్టు ఒక సారి రూపుదాల్చిందీ అంటే దానితో ప్రజల కు ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన, హాయి తో కూడిన సార్వజనిక రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది.      

సాంప్రదాయిక పట్టణ ప్రాంత రవాణా తో పోల్చి చూసినప్పుడు ఈ మెట్రో ప్రాజెక్టు దీనికి ఇదే ఓ నూతన ఆవిష్కరణ వంటిది గా ఉంటుందని చెప్పవచ్చు.  పట్టణం లోని ఇతర రవాణా వ్యవస్థ లతో సమర్థమైన, ప్రభావకారి పద్ధతి న ఈ ప్రాజెక్టు ను మేళవించడం జరుగుతుంది.  అటువంటి కార్యం డిజైనింగ్ పరంగా, సాంకేతిక విజ్ఞానం పరంగా, సంస్థాగత నిర్వహణ పరంగా వినూత్న పద్ధతుల ను అనుసరించినప్పుడే తుది రూపు ను సంతరించుకోవడం సాధ్యపడుతుంది.



 

***



(Release ID: 1713080) Visitor Counter : 194