ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
8 వైద్యపరికరాల దిగుమతి, తయారీ లైసెన్స్ కొనసాగింపు
నిరవధికసరఫరా కోసం ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయం
Posted On:
18 APR 2021 7:05PM by PIB Hyderabad
భారత పరిశ్రమ అవసరాలను గుర్తించి అందుకు అనుగునమైన విధానాన్ని అవలంబించే క్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాక కీలకమైన నిర్ణయం తీసుకోవటం ద్వారా ఎనిమిది రకాల వైద్య పరికరాల అందుబాటు నిరాటంకంగా ఉండేలా చూసింది. అంతకుముందు ఈ దిగువ పేర్కొన్న వైద్య పరికరాలను ఔషధాలు, సౌందర్యసాధనాల చట్టం కింద నియంత్రించటానికి మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఇది 2021 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రావాల్సి ఉంది.
అమర్చటానికి వీలయ్యే అన్ని వైద్య పరికరాలు;
సిటి స్కాన్ పరికరాలు;
ఎం ఆర్ ఐ పరికరాలు;
డీఫైబ్రిలేటర్లు;
పిఇటి పరికరాలు
డయాలసిస్ మెషిన్
ఎక్స్ రే మెషిన్
ఎముక మూలుగ కణ విభాజకం
ఈ ఆదేశం ప్రకారం దిగుమతిదారులు/తయారీదారులు కేంద్ర ప్రభుత్వ లేదా రాష్ట్రప్రభుత్వ అనుమతితోనే 2021 ఏప్రిల్ 1 నుంచి దిగుమతి లేదా తయారీచేపట్టాల్సి ఉంటుంది.
అయితే, వీటి సరఫరా నిరాటంకంగా సాగేందుకు, కొత్త నియమవాళికిందికి మారటంలో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆదేశాన్ని సవరించింది. ఇప్పటికే ఈ పరికరాలను దిగుమతి చేసుకుంటున్న లేదా తయారు చేస్తున్నవారు లేదా వీటి తయారీ/ దిగుమతి లైసెన్స్ కోసం కేంద్రానికి లేదా రాష్ట్రానికి దరఖాస్తు చేసుకున్నవారు మరో ఆరు నెలలపాటు లేదా అంతకుముందే నిర్ణయం తీసుకుంటే అప్పటిదాకా ఈ కార్యకలాపం కొనసాగించటానికి అనుమతించింది.
***
(Release ID: 1712612)