ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మీద తాజా సమాచారం


ఆక్సిజెన్ అందుబాటు మీద కలవరం నివారణకు సాధికార బృందం సూచనలు

భారత్ రోజువారీ ఆక్సిజెన్ తయారీ సామర్థ్యం 7287 మెట్రిక్ టన్నులు

ఆక్సిజెన్ నిల్వ సుమారు 50,000 మెట్రిక్ టన్నులు

ప్రస్తుతం రోజువారీ వినియోగం 3842 మెట్రిక్ టన్నులు

ఆక్సిజెన్ నిల్వలపై రాష్ట్రాలకు సమాచారం

అధిక అవసర రాష్ట్రాలతో కీలకమంత్రిత్వశాఖల రోజువారీ ఉమ్మడి సమీక్ష

Posted On: 15 APR 2021 9:54AM by PIB Hyderabad

కోవిడ్ బాధితుల చికిత్సలో వైద్యపరమైన ఆక్సిజెన్ పాత్ర అత్యంత కీలకం కావటంతో తగిన నిల్వలు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.  పరిశ్రమలు, అంతర్గత వర్తక ప్రోత్సాహక విభాగం కార్యదర్శి డాక్టర్ గురుప్రసాద్ మహాపాత్ర అధ్యక్షతన అంతర్ మంత్రిత్వశాఖల సాధికార అధికారుల బృందం 2020 మార్చిలో ఏర్పాటైంది. ఇందులో  ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ, జౌళి మమ్త్రిత్వశాఖ, ఆయుష్ మంత్రిత్వశాఖ,  సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ కు చెందిన సీనియర్ అధికారులు సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. బాధిత రాష్టాలకు ఆక్సిజెన్ తోబాటు వైద్య పరికరాలు, పనిముట్లు తగిన పరిమాణంలో అందుబాటులో ఉండేట్టు చూడటం ఈ బృందం పని.  

గత ఏడాది కాలమ్లో ఈ సాధికార బృందం ఎప్పటికప్పుడు ఆక్సిజెన్ సహా అత్యవసర వైద్య పరికరాలు, సామగ్రి అందుబాటులో ఉండేట్టు చూస్తూ పరిస్థితిని సమీక్షిస్తూ వస్తోంది. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోగలిగేలా సిద్ధంగా ఉంది. ప్రస్తుత సందర్భంలో కోవిడ్ మళ్లీ విజృంభించిన నేపథ్యంలో సరఫరాలు పునరుద్ధరించి అవసరానికి తగినట్టు అందేలా చూస్తోంది.తరచూ బాధిత రాష్టాలతో సంప్రదింపులు జరుపుతూ వస్తోంది. అదే సమయంలో ఆక్సిజెన్ తయారీ, సరఫరాదారులతోనూ సమన్వయం చేస్తూ, అవసరమైన రాష్టాలకు సకాలంలో అందేలా చూస్తోంది.

ప్రస్తుతం దేశంలో తగినంత ఆక్సిజెన్ ఉత్పత్తి సామర్థ్యం ఉండటం గమనార్హం.  ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం రోజుకు దాదాపు 7127 మెట్రిక్ టన్నులు కాగా మిగులు ఆక్సిజెన్ ను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.ఆక్సిజెన్ వినియోగం పెరుగుదలకు అనుగుణంగా సాధికార బృందం ఆదేశాలతో గత రెండు రోజులుగా నూటికి నూరుపాళ్ళ సామర్థ్యానికి అనుగుణంగా ఉత్పత్తి జరుగుతోంది. ఈ నెల 12న దేశంలో ఆక్సిజెన్ వినియోగం 3842 మెట్రిక్ టన్నులు కాగా అది ఉత్పత్తిలో 54 శాతం మాత్రమే కావటం గమనార్హం. అత్యధికంగా ఆక్సిజెన్ వాడుకుంటున్న రాష్టాలు- మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, ఢిల్లీ కాగా ఆ తరువాత స్థానాల్లో చత్తీస్ గఢ్, పంజాబ్, రాజస్థాన్ ఉన్నాయి.

కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండటంతో ఆక్సిజెన్ నిల్వలు అందుబాటు సైతం రాష్ట్రాల అవసరాలకు తగినట్టుగా ఉండాల్సి ఉంది. తయారీ సంస్థల దగ్గర నిల్వలు 50 వేల మెట్రిక టన్నులకి పైగా ఉన్నాయి. ఇప్పుడు పెంచిన ఉత్పత్తి, నిల్వల కారణంగా అవసరాలకు ఏమాత్రం లోటు వచ్చే అవకాశమే లేదు. అదే సమయంలో రాష్టాలు కూడా ఆక్సిజెన్ ను హేతుబద్ధంగా వాడాలని, వృధా కాకుందా చూడాలని సాధికార బృందం సూచిస్తోంది. అన్ని జిల్లాలకూ అవసరానికి తగినట్టు సాఫీగా సిలిండర్లు, ట్యాంకర్లు అందేలా చూడటానికి అన్ని రాష్టాలూ కంట్రో రూమ్స్ ఏర్పాటు చేయాలని కూడా సూచించింది.

సాధికార బృందం ఈ దిగువ పేర్కొన విధంగా బాధిత రాష్టాలకు ఆక్సిజెన్ సాఫీగా అందటానికి రకరకాల చర్యలు తీసుకుంటోంది:

ప్రతి ఆక్సిజెన్ ప్లాంట్ దాని ఉత్పత్తి సామర్థ్యానికి తగినట్టుగా ఉత్పత్తి పెంచటం, దీనివలన 100 శాతం ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించటం ద్వారా లోటు లేకుండా చూడటం

స్టీల్ ప్లాంట్స్ లో అందుబాటులో ఉన్న  అదనపు నిల్వలు వాడుకోవటం. గత కొద్ది రోజుల్లో స్టీల్ ప్లాంట్లలో ఉత్పత్తి పెరగటం వలన వాటినుమ్చి 14,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వచ్చింది.

ఆక్సిజెన్ ఉత్పత్తి చేసే రాష్ట్రాల సమాచారాన్ని. స్టీల్ ప్లాంట్ల సమాచారాన్ని అందుబాటులో ఉంచటం వలన స్పష్టత పెరగటం,  అందుబాటులో ఉన్నదనే ధీమా పెరగటం సాధ్యమవుతుంది. అందువలన మహారాష్టకు  రోజూ డోల్వి ( మహారాష్ట్ర)లోని జె ఎస్ డబ్ల్యు  నుంచి సకాలంలో అందగలదు. చత్తీస్ గఢ్ కు భిలాయ్ లోని సెయిల్ నుంచి, కర్నాటకకు బళ్ళారిలోని జె ఎస్ డబ్ల్యు నుంచి, మధ్య ప్రదేశ్ కు చత్తీస్ గఢ్ లోని భిల్లాయ్ ఉక్కు కర్మాగారం నుంచి అందుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఇప్పుడున్న సవాలు ఆక్సిజెన్ తక్కువ అవసరమున్న రాష్ట్రాల నుంచి ఎక్కువ అవసరమున్న రాష్ట్రాలకు తరలించటమే.  అందువలన ఆ సమాచారాన్ని అందుబాటులో ఉంచితే సమస్య తీరుతుంది. అందుకే తయారీదారుల సమాచారఅన్ని అవసరమున్న రాష్టాలకు తెలియజేస్తున్నారు. భారత ప్రభుత్వం, రాష్టాలు సమన్వయంతో దీన్ని సాధించగలుగుతున్నాయి. ప్రస్తుతం ఏప్రిల్ 30 వరకు ఎలాంటి సమస్యా లేకుండా తగినన్ని ఆక్సిజెన్ నిల్వలున్నాయి.  

రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ, రైల్వే మంత్రిత్వశాఖ, వివిధ రాష్ట్రాల రవాణాశాఖల అధికారులతో ఒక ఉపసంఘం ఏర్పాటైంది.దీని వలన ద్రవ రూప ఆక్సిజెన్ ట్యాంకర్ల రవాణా సులభతరమైంది. రైళ్ళ ద్వారా రవాణాకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

ఆక్సిజెన్ ట్యాంకర్లు నిరాటంకంగా ప్రయాణించటానికి ఈ దిగువ చర్యలు తీసుకుంటున్నారు:

నైట్రోజెన్ ట్యాంకర్లను ఆక్సిజెన్ సరఫరాకు వాడుకునేలా పెట్రోలియం అండ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఆదేశాలిచ్చింది. దీనివలన అందుబాటులో ఉండే ట్యాంకర్ల సంఖ్య పెరిగింది.  

ఇతర రాష్టాల రిజిస్త్రేషన్ లేని వాహనాలు సైతం ఆక్సిజెన్ రవాణా చేయటానికి ఎలాంటి అవరోధాలూ ఉండవు.

పారిశ్రామిక సిలిండర్లను సైతం ఆక్సిజెన్ నింపి సరఫరా చేయటానికి అనుమతించారు. రాష్ట్రాలవారీ  వాడకం నిబంధన ఉండదు.  

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మరో లక్ష ఆక్సిజెన్  సిలిండర్ల కొనుగోలుకు అనుమతి పొందింది.

ఆస్పత్రులలో సొంతగా ఆక్సిజెన్ తయారుచేసుకోవటానికి వీలుగా అనుమతించిన ప్లాంట్లను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.

ఆక్సిజెన్ ఎక్కువ అవసరమున్న రాష్ట్రాల పరిస్థితి మీద రోజువారీ సమీక్ష. ఆక్సిజెన్ తయారీ సంస్థలు, స్టీల్ ప్లాంట్లు కూడా ఇందులో పాల్గొంటాయి. దీనివలన ఏ రాష్ట్రపు సమస్య అయినా పరిష్కారం సులభమవుతుంది. అంతర్రాష్ట రవాణా సమస్యలు తలెత్తవు. రోజువారీ అవసరాలు, సరఫరా మీద అవగాహాన్ రావటానికి లోపాలు నివారించటానికి వీలవుతుంది.

ఆక్సిజెన్ అవసరలు అనూహ్యంగా పెరిగాయని, ఏప్రిల్ 30 నాటికి అవసరమయ్యే ఆక్సిజెన్ డిమాండ్ కూడా కొన్ని రాష్ట్రాలలో  చాలా ఎక్కువగా చూపారని, కోవిడ్ కేసులతో పొంతనలేకుండా అవసరాలు ఉన్నాయని  ఈ సమీక్షా సమావేశం సందర్భంగా వెల్లడైంది. అందువలన  ఆ రాష్ట్రాలలో ఆక్సిజెన్ వాడకంలో హేతుబద్ధతను కూడా సమీక్షించాలని నిర్ణయించారు.

ఆక్సిజెన్ అవసరాలను, సరఫరాను ఈ సాధికార బృందం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంది. ఎక్కడా అవాంతరం కలగని విధంగా ఆక్సిజెన్ అందుబాటులో ఉండేట్టు చూడాలని నిర్ణయించింది.

 

****



(Release ID: 1711976) Visitor Counter : 262