రాష్ట్రపతి సచివాలయం
పుతండు పిరప్పు, రొంగాలీ బిహూ, నబ బర్ష, వైశాఖాది పండుగల సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు
Posted On:
13 APR 2021 5:25PM by PIB Hyderabad
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెల 14, 15 తేదీల్లో జరుపుకునే పర్వదినాలను పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పుతండు పిరప్పు, రొంగాలీ బిహూ, నబ బర్ష, వైశాఖాది పండుగల సందర్భంగా ఒక సందేశం ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తన సందేశంలో ఇలా పేర్కొన్నారు. :-
“పుతండు, పిరప్పు, రొంగాలీ బిహూ, నబ బర్ష, వైశాఖాది సందర్భంగా, భారతదేశంలో, విదేశాల్లో నివసించే భారతీయులందరికీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
కొత్త సంవత్సరం ప్రారంభానికి సూచనగా ఈ పండుగలను దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు వివిధ రకాలుగా ఇనుమడించిన ఉత్సాహం, ఆశాభావంతో జరుపుకుంటారు. మన విభిన్నత్వాన్ని, వినూత్న సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ పండుగలు నిర్వహిస్తారు. రైతుల నిర్విరామ శ్రమకు, కృషికి అందించే గౌరవానికి సూచనగా కూడా ఈ పండుగలను పరిగణిస్తారు.
ఈ సందర్భంగా సహచర దేశవాసులకు శాంతి, సౌభాగ్యం, ఆనందం కలిగించేందుకు మనమంతా ప్రతిన బూనుదాం. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం, ప్రగతి సందేశాన్ని వ్యాపింప జేయడానికి ప్రతిజ్ఞ చేద్దాం. మనమంతా సంతోషంగా, హృదయపూర్వకంగా సమైక్యంగా ముందుకు సాగుతూ, దేశ ప్రగతియే లక్ష్యంగా కొత్త ఉత్సాహంతో పనిచేద్దాం.”
రాష్ట్రపతి సందేశం కోసం దయజేసి ఇక్కడ క్లిక్ చేయండి
****
(Release ID: 1711580)
Visitor Counter : 176