ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

టీకా ఉత్సవ్ మూడో రోజుకు భారత్ లో మొత్తం డోసులు 10.85 కోట్లు


గత 24 గంటల్లో 40 లక్షలకు పైగా డోసులు

భారత్ లో టీకాలు ప్రపంచంలో అత్యధిక స్థాయిలో కొనసాగింపు

10 రాష్ట్రాలలో కోవిడ్ కేసుల పెరుగుదల

Posted On: 13 APR 2021 10:39AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇచ్చిన కోవిడ్ టీకాల సంఖ్య  టీకా ఉత్సవ్ మొదలైన మూడవ రోజైన నేటికి 10.85 కోట్లకు చేరింది. ఈ ఉదయం 7 గంటలవరకు

10,85,33,085 టీకా డోసులు 16,08,448 శిబిరాల ద్వారా పంపిణీ జరిగింది. ఇందులో  90,33,621 డోసులు ఆరోగ్య సిబ్బంది తీసుకున్న

మొదటి డోసులు,   55,58,103 రెండో డోసులు కాగా, 1,00,78,589 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 49,19,212 

డోసులు కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోసులు కాగా 4,17,12,654 డోసులు 60 ఏళ్ళు పైబడ్డ వారి మొదటి డోసులు. 22,53,077 

రెండో డోసులు,  3,42,18,175 డోసులు 45-60 ఏళ్ళ మధ్య వారి మొదటి డోసులు,  7,59,654 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళమధ్య వారు

 60 పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

90,33,621

55,58,103

1,00,78,589

49,19,212

3,42,18,175

7,59,654

4,17,12,654

22,53,077

10,85,33,085

 

దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాలలో ఎనిమిది రాష్ట్రాలవాటా 60.16% ఉంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RZ81.jpg

గత 24 గంటలలో 40 లక్షలకు పైగా కోవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగింది. టీకాల కార్యక్రమం మొదలైన 87 వ రోజైన ఏప్రిల్ 12న

40,04,521 డోసులిచ్చారు. అందులో 34,55,640  మంది లబ్ధిదారులు 52,087 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకోగా

5,48,881 మంది రెండో డోస్ తీసుకున్నారు

 

తేదీ: ఏప్రిల్ 12, 2021 (87వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ మధ్య వారు

60 ఏళ్ళు దాటినవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

20,332

33,759

81,711

1,23,456

21,71,264

81,294

11,82,333

3,10,372

34,55,640

5,48,881

 

ప్రపంచమంతటా చూసినప్పుడు రోజువారీ కోవిడ్ టీకా డోసులు భారత్ లో ఎక్కువగా ఉంటున్నాయి. భారత్ లో ప్రస్తుతం సగటున రోజుకు

41,69,609 టీకా డోసులిస్తున్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002V8E5.jpg

భారత్ లో రోజువారీ కొత్త కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. గత 24 గంటలలో 1,61,736 కేసులు నమోదయ్యాయి.  అందులో పది రాష్ట్రాలు –

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్, ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు, మధ్య ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, కేరళలో దాదాపు 80.80% కేసులు  రాగా

ఒక్క మహారాష్ట్రలోనే ఒక్క రోజులో  51,751 కేసులు, ఉత్తరప్రదేశ్ లో13,604 , చత్తీస్ గఢ్ లో13,576 కేసులు వచ్చాయి.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003I0GB.jpg

పదహారు రాష్ట్రాలు రోజువారీ కొత్త  కోవిడ్ కేసుల పెరుగుదల నమోదు చేసుకుంటున్నట్టు ఈ దిగువ పటం చూపుతుంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00442I6.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005P1ET.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006142B.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007WQJW.jpg

 

భారతదేశంలో ప్రస్తుతం కోవిడ్ చికిత్స పొందుతున్నవారి సంఖ్య 12,64,698 కు చేరింది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన

పాజిటివ్ కేసులలో. 9.24%. గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా 63,689 కేసుల పెరుగుదల నమోదు చేసుకుంది.

 ఐదు రాష్ట్రాలు – మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ కలిసి అందులో 68.85%  వాటా ఉండగా ఒక్క మహారాష్ట్రలోనే చికిత్సలో

ఉన్నవారి వాటా  44.78%

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008FQ4V.jpg

 భారత్ లో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య ఇప్పటికి  1,22,53,697 కు చేరుకోగా, కోలుకున్నవారి శాతం  89.51%. గత 24 గంటలలో

కోలుకున్నవారు 97,168. గత 24 గంటలలో కోవిడ్ వల్ల 879  మంది చనిపోగా అందులోపది రాష్టాలవాటా 88.05% గా నమోదైంది.

మహారాష్ట్రలో అత్యధికంగా 258 మంది చనిపొగా ఆ తరువాత స్థానంలో ఉన్న చత్తీస్ గడ్ లో 132 మంది చనిపోయారు

.https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009XA75.jpg

 గత 24 గంటలలో కోవిడ్ మరణాలు ఒకటి కూడా లేని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు  పదమూడు ఉన్నాయి. అవి: కమ్మూ-కశ్మీర్, అస్సాం,

లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మిజోరం, మణిపూర్, లక్షదీవులు,

అండమాన్-నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్

 

****


(Release ID: 1711571) Visitor Counter : 241