ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇప్పటిదాకా 10 కోట్లకు పైగా టీకా డోసులు


గత 24 గంటల్లో 35 లక్షల డోసులు

సగటు రోజువారీ టీకాలలో భారత్ దే అగ్రస్థానం

రోజువారీ కేసుల్లో 10 రాష్ట్రాలవాటా 81%

Posted On: 11 APR 2021 11:55AM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పంపిణీ జరిగిన కోవిడ్ టీకాల సంఖ్య ఈ రోజుకు 10 కోట్లు దాటింది.  ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం

15,17,963 శిబిరాలద్వారా మొత్తం 10,15,95,147  టీకా డోసుల పంపిణీ జరిగింది. ఇందులో 90,04,063 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన

మొదటి డోసులు,  55,08,289 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండో డోసులు,   99,53,615 డోసులు కోవిడ్ యోధుల మొదటి డోసులు, 

47,59,209 డోసులు కోవిడ్ యోధుల రెండో డోసులు కాగా 3,96,51,630 డోసులు 60 ఏళ్ళు పైబడ్డవారి మొదటి డోసులు, 18,00,206 

డోసులు 60 ఏళ్ళు పైబడ్డవారి రెండో డోసులు కాగా 45-60 ఏళ్ళ మధ్య ఉన్నవారి మొదటి డోసులు  3,02,76,653, రెండో డోసులు

 6,41,482  ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళమధ్య వారు

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

90,04,063

55,08,289

99,53,615

47,59,209

3,02,76,653

6,41,482

3,96,51,630

18,00,206

10,15,95,147

 

ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకాలలో 60.27% ఎనిమిది రాష్ట్రాలలో ఇచ్చినవే.

 

గత 24 గంటలలో 35 లక్షలకు పైగా టీకాలు వేశారు.  టీకాల కార్యక్రమం మొదలైన 85వ రోజు (ఏప్రిల్10, 2021)నాడు 35,19,987 

మందికి టీకాలిచ్చారు. అందులో  31,22,109 మంది 42,553 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకోగా  3,97,878 మంది రెండో డోస్

తీసుకున్నారు.

 

తేదీ: ఏప్రిల్ 10, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 -60 ఏళ్ళవారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

15,690

28,468

86,285

1,00,174

20,21,609

59,418

9,98,525

2,09,818

31,22,109

3,97,878

 

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కోవిడ్ టీకాల సంఖ్యను గమనిస్తే భారతదేశంలో సగటున రోజుకు 38,34,574 డోసులు ఇస్తున్నారు.

ఇది క్రమంగా పెరుగుదలబాటలోనే సాగుతోంది.

భారత్ లోను, విదేశాలలోనూ రోజువారీ సగటు కోవిడ్ టీకాలను ఈ క్రింది చిత్రపటం చూపుతోంది.

భారత్ లో కొత్త కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో 1,52,879  కొత్త కేసులు వచ్చాయి. పది రాష్ట్రాలు – మహారాష్ట్ర,

చత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్నాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కలిసి 80.92% వాటా పొందాయి. రోజువారీ

కొత్త కేసులలో మహారాష్ట్ర అత్యధికంగా 55,411 నమోదు కాగా ఆ తరువాత స్థానంలో చత్తీస్ గఢ్ లో 14,098, ఉత్తరప్రదేశ్ లో  

12,748 కేసులు వచ్చాయి.

ఈ క్రింద చూపిన విధంగా పదహారు రాష్ట్రాలు రోజువారీ కోవిడ్ కేసులలో పెరుగుదలచూపుతున్నాయి.  

 

 

 

 

భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 11,08,087 కు చేరింది. ఇది దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ బారిన

పడినవారిలో 8.29% .  గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్యలో నికర పెరుగుదల 61,456 గా నమోదైంది.  

ఐదు రాష్టాలు- మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్, కేరళ మాత్రమే మొత్తం చికిత్సపొందుతున్నవారిలో 70.82% వాటా కలిగి

ఉండగా ఒక్క మహారాష్ట్ర ఒక్కటే   ఈ కేసులలో  48.57% వాటా కలిగి ఉండటం విశేషం.

 
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులని ఈ క్రింది చిత్రపటం చూపుతుంది. 

 

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోవిడ్ బారినుంచి కోలుకున్నవారు నేటికి1,20,81,443 మంది కాగా కోలుకున్నవారి శాతం 90.44%.

గడిచిన 24 గంటలలో కోలుకున్నవారి సంఖ్య 90,584 

రోజువారీ కోవిడ్ మరణాలు పెరుగుదలబాటలో సాగుతూనే ఉన్నాయి. గత 24 గంటలలో 839 మరణాలు నమోదయ్యాయి.

అందులో పది రాష్ట్రాలవాటా  86.41% కాగా మహారాష్ట్రలో అత్యధికంగా 309 మంది, చత్తీస్ గఢ్ లో 123 మంది చనిపోయారు.   

 

గత 24 గంటలలో పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. అవి: డామన్-డయ్యూ,

దాద్రా-నాగర్ హవేలి, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మిజోరం, మణిపూర్, లక్షదీవులు, అండమాన్- నికోబార్ దీవులు,

అరుణాచల్ ప్రదేశ్.

 

****



(Release ID: 1711048) Visitor Counter : 186