నీతి ఆయోగ్
దేశవ్యాప్తంగా అటల్ ఇన్నొవేషన్ మిషన్ కింద ఏర్పాటు చేసిన 295 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను దత్తత తీసుకున్న సిఎస్ఐఆర్
విద్యార్ధులలో స్టెమ్ ఆధారిత పరిశోధన, ఆవిష్కరణల ఆసక్తిని పెంపొందింప చేయడం ద్వారా పరిశోధనశాలలు, శాస్త్రవేత్తలు గరిష్ఠ ప్రయోజనం పొందేటట్టు చేయడం దీని లక్ష్యం
నీతి ఆయోగ్ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమమైన అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఎఐఎం) కు చెందిన దేశవ్యాప్తంగా గల 295 అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చి (సిఎస్ ఐ ఆర్) అధికారికంగా దత్తత తీసుకుంది. విద్యార్ధులలో శాస్త్రీయ పరిశోధన, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందింప చేసేందుకు ఈ చర్య తీసుకుంది.
సిఎస్ ఐఆర్‌కు 36 పరిశోధన శాలలు ఉన్నాయి. ఇవి 295 ఎటిఎల్‌లు, దేశ వ్యాప్తంగా గల వాటి విద్యార్ధులను దత్తత తీసుకున్నాయి.
Posted On:
09 APR 2021 5:31PM by PIB Hyderabad
ఇది దేశవ్యాప్తంగా గల యువ ఆవిష్కర్తలకు అద్భుత అవకాశం కానుంది. దేశంలోని అద్భుత శాస్త్రవేత్తల వద్ద యువ ఆవిష్కర్తలు నేర్చుకోవడానికి అవకాశంకలుగుతుంది. ఈ అవకాశంవల్ల వినూత్న ఆలోచనలు కలిగిన విద్యార్ధులు తమ పాఠశాలలకు,కుటుంబాలకు, స్థానిక కమ్యూనిటీలకు ఆదర్శంగా నిలవనున్నారు.
అత్యున్నత రిసెర్చ్‌స్కాలర్లను , శాస్త్రవేత్తలను సిఎస్ ఐ ఆర్ ప్రతి ఎటిఎల్‌కు మెంటార్లుగా నామినేట్ చేయనుంది. వీరు రిసోర్స్ పర్సన్స్‌గా వ్యవహరిస్తారు. ఎఐఎం, సిఎస్ ఐ ఆర్ లు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన వివిధ అంశాలపై విద్యార్దులకు వెబినార్లు నిర్వహించనుంది.
ఈ కొలాబరేషన్‌కు సంబంధించి ఈ రోజు జరిగిన వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ నీతిఆయోగ్ అదనపు కార్యదర్శి, ఎఐఎం మిషన్ డైరక్టర్ ఆర.రమణన్ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి, శాస్త్ర, పారిశ్రామిక పరిశోధనలలోఅనువర్తిత ఆవిష్కరణలకు గల ప్రాధాన్యతను తెలియజేసిందని అన్నారు.అందువల్ల సిఎస్ ఐ ఆర్‌తో ఈ భాగస్వామ్యం అటల్ ఇన్నొవేషన్ మిషన్‌కు సంబంధించిఇది ఒక కీలక విజయమని అన్నారు.స్టెమ్‌రీసెర్చ్, ప్రభుత్వ ,ప్రైవేటు సంస్థలతో ఆవిష్కరణల కొలాబరేషన్లు కీలకపాత్ర వహించనున్నాయని అన్నారు.
సిఎస్ఐఆర్‌తో ఈ కొలాబరేషన్ ఎటిఎల్ పాఠశాల విద్యార్ధులకు కల్పించిన అకకాశానికి మంచి ఊతం ఇవ్వనుంది. సిఎస్ఐఆర్ పరిశోధన శాలల ద్వారా శాస్త్ర పరిశోధనకు అధునాతన సాంకేతిక పరిజ్క్షానాన్ని ఇది వారికి అందుబాటులోకి తీసుకురానుంది. ఇది నూతన విద్యా విధానం 2020 కి అనుగుణంగా ఉండడమే కాక, ఆత్మనిర్భర భారత్‌కు మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎస్ ఐఆర్ డిజి శేఖర్ సి మండే, దేశంలోని విద్యార్ధులవద్దకు సిఎస్ఐఆర్ చేరడం ఒక ఆసక్తికర మైలురాయి అని అన్నారు. సిఎస్ ఐఆర్ ఎల్లప్పుడూ ఆవిష్కరణలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో దేశ ప్రజలతో మమేకమై ఉందని, గత కొద్ది సంవత్సరాలలో జిజ్ఞాస కార్యక్రమం ద్వారా సిఎస్ ఐఆర్ సుమారు 3 లక్షల మందికి పైగా విద్యార్ధులతో సంబంధాలు కలిగి ఉందని ఆయన అన్నారు. ఎఐఎంతో భాగస్వామ్యం విద్యార్థులతో సంబంధాలను మరింత పెంపొందించుకోవడానికి అవకాశంకలిగిస్తుందని అన్నారు.
ఎఐఎం కార్యకలాపాలను డాక్టర్ మండే ప్రశంసించారు. దేశ వ్యాప్తంఆ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఎంటర్‌ప్రెన్యూయర్ షిప్ విషయంలో , దేశంలో ఇంక్యుబేషన్ సెంటర్ల సంస్కృతిని ప్రోత్సహించడంలో ఇది ఎంతో చేసిందన్నారు.
జోర్హాట్ సిఎస్ఐఆర్ - ఎన్.ఇ.ఐ.ఎస్‌టి డైరక్టర్ డాక్టర్ జి.నరహరి శాస్త్రి మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం, వినూత్న ఆవిష్కరణల ఆలోచనల విషయంలో మనం కలసికట్టుగా ముందుకు వస్తున్నామని ఇది సిఎస్ఐఆర్‌కు ఎఐఎంకు కీలకమని అన్నారు.
మారుమూల ప్రాంతాలలోని విద్యార్దులు ఎటిఎల్ లో పనిచేస్తున్న తీరు ఒక అద్భుత అనుభవం. దేశ భవిష్యత్ శాస్త్రవేత్తలు రూపొందుతున్నతీరు గర్వకారణం. వీరిని చూసి దేశం గర్వ పడుతోందని డాక్టర్ శాస్త్రి అన్నారు.
హెచ్ ఆర్ డిజి హెడ్ డాక్టర్ అంజన్ రే మాట్లాడుతూ, దేశంలోని ప్రతి జోన్‌లో గల సిఎస్ ఐఆర్ ప్రయోగశాలలు అన్ని ప్రాంతీయ భాషల వారితో అనుసంధానమై ఉంటాయని , ఇవి స్థానిక రాయబారులుగా పనిచేస్తాయని అన్నారు. సిఎస్ఐఆర్ వర్చువల్ ల్యాబ్ జిగ్యాసా 2.0 కార్యక్రమంలో ఎఐఎం ఒక భాగస్వామి కావచ్చని అన్నారు.దీనిని గౌరవ ప్రధానమంత్రి ఆకాంక్షల మేరకు చేపట్టడం జరిగిందని అన్నారు. ఎఐఎంతో సిఎస్ఐఆర్ భాగస్వామ్యం ఎఐఎం ఆవిష్కరణల శక్తిని , పరిశొధన అభివృద్ధి సామర్ధ్యాన్ని పెంపొందిస్తుందని అలాగే ఈ దేశ యువత కోసం సిఎస్ఐఆర్ సామర్థ్యాన్ని పెంచుతుందని డాక్టర్ అంజన్ రే అన్నారు.
ఎఐఎం, సిఎస్ఐఆర్ లు రెండూ ఈ కొత్త కొలాబరేషన్‌ద్వారా వినూత్న మైలురాళ్లను సాధించనున్నాయి.
***
(Release ID: 1710946)
Visitor Counter : 270