ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400 వ జయంతి (ప్రకాశ్ పర్వ్) ను స్మరించుకోవడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి సంఘం సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
Posted On:
08 APR 2021 2:09PM by PIB Hyderabad
శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400 వ జయంతి (ప్రకాశ్ పర్వ్) ను స్మరించుకోవడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి సంఘం సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గురువారం నాడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించడమైంది.
శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400వ ప్రకాశ్ పర్వ్ ను స్మరించుకోవడం కోసం ఒక భవ్యమైన దృష్టి కోణాన్ని వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి కి సమావేశ ఆహ్వానితులు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ అందించిన వివిధ తోడ్పాటుల ను ధార్మిక స్వేచ్ఛ కోసం ఆయన చేసిన త్యాగాన్ని వారు గుర్తు కు తెచ్చుకొన్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని స్మరించుకొనే విషయం లో వారు అనేక సూచన లను, సలహాల ను అందించారు. ఆయన జీవితం లోని వివిధ పార్శ్వాల ను ప్రముఖం గా ప్రచారం లోకి తీసుకు రావడం ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ సందేశం అందరికీ చేరేటట్లు సామూహిక ప్రయత్నాలు జరగవలసి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అన్నారు. సంస్మరణ కు సంబంధించి ఇంత వరకు అందిన సూచనల పై సంస్కృతి శాఖ కార్యదర్శి ఒక నివేదిక ను సమర్మించారు.
సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ సమావేశం లో పాలుపంచుకొన్నవారు వారి సలహాల ను ఇచ్చినందుకు గాను ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు. శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400వ ప్రకాశ్ పర్వ్ సందర్భం ఒక ఆధ్యాత్మిక విశేష ఘట్టమని, అంతేకాకుండా అది ఒక జాతీయ కర్తవ్యమని ఆయన అన్నారు. శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ జీవితం నుంచి నేర్చుకొన్న పాఠాలను, ఆయన ప్రబోధాల ను శ్రీ మోదీ ప్రస్తావిస్తూ, గురువు గారి వద్ద నుంచి మనమంతా ప్రేరణ ను పొందుతున్నామన్నారు. ఈ పాఠాల ను యువతరం అర్థం చేసుకొనేటట్లు చూడటం ముఖ్యమని ఆయన ప్రత్యేకం గా పేర్కొన్నారు. ఆయన సందేశాన్ని ప్రపంచవ్యాప్తం గా యువజనుల కు చేర్చాలి అంటే, అందుకుగాను డిజిటల్ మాధ్యమాల ను ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.
సిక్కు గురువుల పరంపర దానంతట అదే ఒక సంపూర్ణమైన జీవిత తర్కం అని ప్రధాన మంత్రి అన్నారు. గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాశ్ పర్వ్, శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400వ ప్రకాశ్ పర్వ్ లతో పాటు, శ్రీ గురు గోవింద్ సింహ్ జీ 350వ ప్రకాశ్ పర్వ్ ను నిర్వహించేందుకు ప్రభుత్వానికి దక్కిన అవకాశం, ఒక విశేష అధికారం, ఒక సౌభాగ్యం అని ఆయన అన్నారు.
సమావేశం లో చోటు చేసుకొన్న చర్చల ను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400వ ప్రకాశ్ పర్వ్ ను మరింత ఎక్కువ మంది స్మరించుకొనేందుకు వీలుగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాల ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమాల నిర్వహణ తీరు ఎలా ఉండాలి అంటే, అవి శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ జీవితం, ప్రబోధాల గురించి మాత్రమే కాకుండా, యావత్తు గురు పరంపర కు ప్రపంచమంతట మంచి ప్రచారం దక్కాలని ఆయన అన్నారు. సిక్కు సముదాయం, గురుద్వారాలు, ప్రపంచవ్యాప్తం గా అందిస్తున్న సామాజిక సేవల ను ప్రధాన మంత్రి కొనియాడుతూ, సిక్కు సంప్రదాయానికి చెందిన ఈ అంశం పై సముచితమైన పరిశోధనతో పాటు, నిగ్గుతేలిన వాస్తవాల ను గ్రంథస్తం చేయడం జరగాలని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ సమావేశానికి పూర్వ ప్రధాని డాక్టర్ మన్ మోహన్ సింహ్; కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ శాహ్; లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా; రాజ్య సభ డిప్యూటీ చైర్ మన్ శ్రీ హరివంశ్; రాజ్య సభ లో ప్రతిపక్ష నేత శ్రీ మల్లికార్జున్ ఖర్గే; హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్; పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ శ్రీ అమరీందర్ సింహ్; రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గహ్లోత్; అమృత్‌సర్ శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షురాలు బీబీ జాగీర్ కౌర్ గారు; పార్లమెంటు సభ్యులు శ్రీ సుఖ్‌బీర్ సింహ్ బాదల్ మరియు శ్రీ సుఖ్‌దేవ్ సింహ్ డిండ్‌సా; పార్లమెంటు పూర్వ సభ్యులు శ్రీ తార్‌లోచన్ సింహ్; అమూల్, ఎండి శ్రీ ఆర్.ఎస్. సోధీ; ప్రముఖ పండితుడు శ్రీ అమర్‌జీత్ సింహ్ గ్రేవాల్ తదితరులు హాజరయ్యారు.
****
(Release ID: 1710443)
Visitor Counter : 188
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam