ఆర్థిక మంత్రిత్వ శాఖ
పిఎంఎంవై ప్రారంభించినప్పటి నుంచి 14.96 లక్షల కోట్ల రూపాయల మేరకు 28.68 కోట్ల రుణాలుగా బ్యాంకులు, ఎన్.బి.ఎఫ్.సిలు, ఎం.ఎఫ్.ఐ లచే జారీ
2015-18 సంవత్సరాల మధ్య 1.12 కోట్ల నికర అదనపు ఉపాధి కల్పనకు సహాయపడిన పిఎంఎంవై
Posted On:
07 APR 2021 9:43AM by PIB Hyderabad
సామాజికంగా, ఆర్ధికంగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలు , అణగారిన వర్గాల సమగ్ర అభివృద్ధికి, వారికి ఆర్థిక మద్దతు నిచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ కట్టుబడి ఉంది. చిన్న ఎంటర్‌ప్రెన్యుయర్లనుంచి , కష్టపడి పనిచేసే రైతుల వరకు అన్ని వర్గాల వారికి వారి ఆర్ధిక అవసరాలు తీర్చే0ందుకు వివిధ కార్యకలాపాల ద్వారా పలు చర్యలు చేపడుతున్నది. ఈ దిశగా చేపట్టిన కీలక కార్యక్రమం ప్రధానమంత్రి ముద్రా యోజన (పిఎంఎంవై). ఇది మిలియన్ల కొద్ది ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, వారి విలువ పెంచడానికి, వారికి
స్వేచ్ఛ నిచ్చేందుకు దోహదపడుతున్నది.
పిఎంఎంవైని గౌరవ ప్రధానమంత్రి 2015 ఏప్రిల్ 8న ప్రారంభించారు. సహకారేతర, వ్యవసాయేతర చిన్న మైక్రో ఎంటర్ ప్రైజ్‌లకు పది లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేసేందుకు దీనిని ప్రారంభించారు. పిఎంఎంవై కి సంబంధించి ఆరవ వార్షికోత్సవం జరగబోతున్న వేళ ఈ పథకం, అది ఇప్పటివరకు సాధించిన విజయాలకు సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం.
ముద్రా యోజన ఎందుకు?
ఇండియా యువత ఎక్కువ గా కలిగిన ఉత్సాహం, ఆకాంక్షలు కలిగిన దేశం. భారత దేశ అభివృద్ధికి వీలు కలిగించేందుకు వీలుగా యువతలో ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంపొందించడం అవసరం. దీనివల్ల ఇండియా నూతన తరం పరిష్కారాలను కనుగొనగలదు. ఇండియాలో బలమైన ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌ను పెంపొందించేందుకు ఎన్.డి.ఎ ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌లోనే ప్రధానమంత్రి ముద్రా యోజనను ప్రారంభించింది.
ముద్రా యోజన ఎలా పనిచేస్తుంది?
పిఎంఎంవై కింద పది లక్షల రూపాయల వరకు హామీ లేని రుణాలను మెంబర్ లెండింగ్ సంస్థలు (ఎం.ఎల్.ఐలు), అంటే షేడ్యూల్డు వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్.ఆర్.బిలు), చిన్న ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్.ఎఫ్.బిలు), నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్.బి.ఎఫ్.సిలు), మైక్రో ఫైనాన్స్ ఇన్ స్టిట్యూషన్లు (ఎం.ఎఫ్.ఐలు) తదితరాలు అందజేస్తాయి.
తయారీరంగం, ట్రేడింగ్ ,సేవల రంగాలకు వ్యవసాయ అనుబంధ రంగాల కార్యకలాపాలకు ఆదాయాన్ని సృష్టించే కార్యకలాపాలకు రుణాలు అందజేస్తారు.
ముద్రారుణాలను మూడు విభాగాలలో ఇస్తారు. అవి శిశు, కిశోర్, తరుణ్. ఇది ఆయా సంస్థల వృద్ధి, అభివృద్ధి, రుణం కోరుతున్న వారి ఫండింగ్ అవసరాలను సూచిస్తాయి.
శిశుఃః రూ 50,000 వరకు రుణాలు వర్తిస్తాయి.
కిశోరః రూ 50,000ల నుంచి 5 లక్షల రూపాయల వరకు వర్తిస్తాయి.
తరుణ్ః 5 లక్షల రూపాయల పైన 10 లక్షల రూపాయల వరకు రుణాలు
కొత్త తరం యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా వారిలో ఎంటర్ ప్రెన్యుయర్‌షిప్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రధానంగా శిశు కేటగిరీలోన్‌లపై దృష్టిపెట్టారు. ఆ తర్వాత కిశోర్, తరుణ్ కేటగిరీలపై దృష్టిపెట్టడం జరుగుతుంది.
19-03-2021 నాటికి ఈ పథకం సాధించిన విజయాలు:
ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి 10-03-2021 నాటికి 28.68 కోట్ల రుణాల కింద సుమారు 14.96 లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది.
4.20 కో్ట్ల పిఎంఎంవై రుణానలు 2020-21 సంవత్సరంలో మంజూరు చేశారు. 2020-21 ఆర్ధికసంవత్సరంలో 19-03-2021 నాటికి 2.66 లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
సగటు రుణం టికెట్ సైజు రూ 52,000లు
రుణాలలో 88 శాతం శిశు కేటగిరీకి చెందినవి.
దాదాపు 24 శాతం రుణాలు కొత్త ఎంటర్‌ప్రెన్యుయర్లకు ఇచ్చినవి.
రుణాలలో 68 శాతం రుణాలు మహిళా ఎంటర్‌ప్రెన్యూయర్లకు ఇచ్చినవి.
51 శాతం రుణాలు ఎస్.సి, ఎస్‌టి, ఓబిసి రుణగ్రహీతలకు ఇచ్చినవి.
రుణగ్రహీతలలో ఒబిసిలు 28.42 శాతం ఉన్నారు.
మైనారిటీ కమ్యూనిటీ రుణ గ్రహీతలకు 11 శాతం రుణాలు మంజూరు చేశారు.
కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ నిర్వహించిన సర్వే ప్రకారం, 2015- 2018 మధ్య పిఎంఎంవై 1.12 కోట్ల అదనపు ఉపాధిని
కల్పించినట్టు తేలింది. ఈ పెరిగిన 1.12 కోట్ల ఉపాధిలో సుమారు 69శాతం మహిళలు 69 లక్షలు (62 శాతం మంది ఉన్నారు)
***
(Release ID: 1710200)
Visitor Counter : 206