నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆలిండియా ట్రేడ్ టెస్ట్ ఫర్ క్రాఫ్ట్ ఇనస్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీం (సిఐటిఎస్) 2019-2020 ఫలితాలను ప్రకటించిన డిజిటి-ఎంఎస్‌డిఇ
Posted On:
06 APR 2021 4:24PM by PIB Hyderabad
నైపుణ్య అభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డిఇ) ఆధ్వర్యంలోని డైరెక్టొరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డిజిటి) మంగళవారం సిఐటిఎస్ విద్యాకాలం 2019-2020 కోసం ఆలిండియా ట్రేడ్ టెస్ట్ (ఎఐటిటి) ఫలితాలను ప్రకటించింది. ఈ పరీక్షకు 45 ఇనిస్టిట్యూట్‌ల నుండి, 34 వృత్తుల నుంచి మొత్తం 7,535 మంది ట్రైనీలు 2019-2020 కాలానికి సంబంధించి హాజరయ్యారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 79 పరీక్షా కేంద్రాలలో నిర్వహించడం జరిగింది. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఫర్ వుమెన్, జైపూర్ కు చెందిన డ్రెస్ మేకింగ్ వృత్తిలో ఉన్న సావిత్రి 95.44% శాతం మార్కులతో పరీక్షలో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా 242మంది ట్రైనీలు 90%కన్నా ఎక్కువ మార్కులను సాధించగా, 80.57% మంది విద్యార్ధులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలు https://ncvtmis.gov.in/Pages/CFI/Home.aspx అన్న ప్రభుత్వ వెబ్‌సైట్ లింక్‌లో అందుబాటులో ఉన్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా, థియరీ, ప్రాక్టికల్ పరీక్షలను కఠినమైన కోవిడ్ ప్రోటోకాళ్ళను పాటిస్తూ అక్టోబర్, నవంబర్ 2020లో రెండు బ్యాచీలలో నిర్వహించారు.
స్కిల్ ట్రైనింగ్‌లో తమ కెరీర్‌ను సాగించాలనే ఆశయం కలిగిన ఐటిఐ ట్రైనీలకు డిజిటి క్రాఫ్ట్స్ ఇనస్ట్రక్టర్ ట్రైనింగ్ స్కీం పథకం (సిఐటిఎస్) కింద క్రాఫ్ట్స్ ఇనస్ట్రక్టర్ ట్రైనింగ్ కార్యక్రమాలను నిర్వహించింది. నైపుణ్యం కలిగిన మాన్ పవర్‌కు శిక్షణను ఇచ్చేందుకు, హాండ్స్ ఆన్ నైపుణ్యాలను బదిలీ చేసే సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యతను ఇనస్ట్రక్టర్ ట్రైనీలకు నైపుణ్యాలు, శిక్షణా పద్ధతులు రెండింటిలో సమగ్ర శిక్షణ ఇస్తున్నారు. ఏడాది కాలం జరిగే సిఐటిఎస్ శిక్షణ చివరిలో, 34 వృత్తులు ప్రతిదానిలోనూ ఆలిండియా ట్రేడ్ టెస్ట్ (ఎఐటిటి)ని డిజిటి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది.
విజయవంతమైన ట్రైనీలకు అభినందనలు చెప్తూ, ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి దార్శశనికతను దృష్టిలో పెట్టుకుని, ప్రవీణులైన నైపుణ్యాల శిక్షకులను తయారు చేయడంలో సిఐటిఎస్ కీలక పాత్ర పోషిస్తుందని డిజిటి డైరెక్టర్ జనరల్ (ట్రైనింగ్) నీలంషమీ రావ్ అన్నారు. ఈ ప్రవీణులైన నైపుణ్యాల శిక్షలకులను హాండ్స్ ఆన్ నైపుణ్యాల పరిజ్ఞానాన్ని, శిక్షణాశాస్త్రంతో సాధికారం చేసి, క్షేత్ర స్థాయిలో కూడా నైపుణ్యాల శిక్షణను అందించేందుకు కృషి చేస్తుందన్నారు. అంతేకాకుండా, ఈ పరీక్షలో మహిళలు అద్భుతంగా రాణించడం గమనార్హం, ఇది మహిళా సాధికారతపై మా దృష్టిని ప్రతిఫలిస్తుంది, అని నీలం అన్నారు.
మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (ఎంసిక్యూలు) కలిగిన ఈ పరీక్ష, అభ్యర్ధులకు వృత్తిపట్ల ఉన్న జ్ఞానాన్ని పరీక్షిస్తుంది. ట్రైనీ సాధించిన సాధించిన హాండ్స్ ఆన్ నైపుణ్యాలను పరీక్షించేందుకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తుంది. దీనిని ఒక ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్, ఆ రంగంలో నిపుణులు ట్రైనీల జ్ఞానాన్ని అంచనా వేస్తారు. ట్రైనింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత వారికి నేషనల్ క్రాఫ్ట్ ఇనస్ట్రక్టర్ సర్టిఫికెట్ (ఎన్‌సిఐసి)ను ప్రదానం చేస్తారు.
అన్ని వృత్తులలోనూ అగ్రస్థానం సాధించిన వారి జాబితాను ఈ వెబ్‌సైట్ లింక్ https://www.dgt.gov.in లోనూ, అన్ని ఎన్ ఎస్‌టిఐఎస్, ఆర్‌డిఎస్‌డిఇఎస్ వెబసైట్లలో https://dgt.gov.in/central-institutes-lists అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
***
(Release ID: 1709972)
Visitor Counter : 184