ఆర్థిక మంత్రిత్వ శాఖ

భారత ఈక్విటీ మార్కెట్లలోకి రూ.2,74,034 కోట్ల విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు (పిఎఫ్ఐ) ప్రవాహం

Posted On: 06 APR 2021 10:28AM by PIB Hyderabad
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి 2,74,034 కోట్ల రూపాయల బలమైన విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (ఎఫ్‌పిఐ) ప్రవాహం వచ్చి చేరింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ మౌలిక అంశాల పట్ల విదేశీ పెట్టుబడిదారుల స్థిరమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

ఆర్థిక సంవత్సరం  2020-21 

ఈక్విటీలో నికర పెట్టుబడి (రూ.కోట్లలో)

ఏప్రిల్ 

-6884

మే 

14569

జూన్ 

21832

జులై 

7563

ఆగష్టు 

47080

సెప్టెంబర్ 

-7783

అక్టోబర్ 

19541

నవంబర్ 

60358

డిసెంబర్ 

62016

జనవరి 

19473

ఫిబ్రవరి 

25787

మర్చి 

10952

మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరంలో.. 

274034

2021 ఏప్రిల్ 1వ తేదీ వరకు; source: NSDL

వినూత్నంగా రూపొందించిన ఉద్దీపన ప్యాకేజీల అమలు చేయడంతో వేగంగా బలమైన ఎఫ్‌పిఐ ప్రవాహాలు వచ్చాయి. ఇటీవలి కాలంలో ఎఫ్‌పిఐల కోసం సౌలభ్యం మరియు పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, రెగ్యులేటర్లు ప్రధాన విధాన కార్యక్రమాలను చేపట్టాయి. వీటిలో ఎఫ్‌పిఐ రెగ్యులేటరీ పాలన సరళీకరణ, హేతుబద్ధీకరణ, సెబీతో రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ కామన్ అప్లికేషన్ ఫారం (సిఎఎఫ్) కార్యాచరణ, పాన్ కేటాయింపు, బ్యాంక్ మరియు డీమాట్ ఖాతాలను తెరవడం మొదలైనవి ఉన్నాయి. భారతీయ కంపెనీలలో మొత్తం ఎఫ్‌పిఐ పెట్టుబడి పరిమితి 24% నుండి రంగాల పరిమితికి పెరగడం ప్రధాన సెక్యూరిటీల సూచికలలో భారతీయ సెక్యూరిటీల వాటా పెంచడానికి ఒక ఉత్ప్రేరకంగా ఉంది, తద్వారా నిష్క్రియాత్మకంగా మరియు చురుకుగా ఉన్న భారీ ఈక్విటీ ప్రవాహాలను భారత మూలధన మార్కెట్లలోకి సమీకరించడం జరిగింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనా 10 శాతంగా ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, అనేక ప్రపంచ పరిశోధనా సంస్థలు భావిస్తున్నాయి. సమీప భవిష్యత్తులో భారతదేశం ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా కొనసాగుతుందని ఆ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

 

****



(Release ID: 1709859) Visitor Counter : 197