హోం మంత్రిత్వ శాఖ
ఛత్తీస్ గఢ్ లో నక్సలైట్లతో పోరాటం చేస్తూ వీర మరణం పొందిన జవాన్లకు జగదల్‌పూర్ వద్ద ఘన నివాళి ఘటించిన కేంద్ర హోంవాఖ మంత్రి శ్రీ అమిత్ షా.
అమర జవానుల ధైర్యసాహసాలకు సెల్యూట్ చేసిన ఆయన వారి ధైర్యసాహసాలను, త్యాగాలను దేశం మరిచిపోదని అన్నారు.
దేశం మొత్తం అమరజవానులకు అండగా నిలిచిందని, నక్సలైట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధాన్ని సమర్థవంతంగా ముగించడానికి కంకణబద్దులమై వున్నామని స్పష్టం చేసిన శ్రీ అమిత్ షా.
ఈ పోరాటంలో అమరులైన ఛత్తీస్‌గఢ్ పోలీసులకు, సిఆర్ పిఎఫ్ జవాన్లకు, కోబ్రా బెటాలియన్ సభ్యులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం తరఫున, మొత్తం దేశం తరఫున నివాళులు ఘటిస్తున్నా: శ్రీ అమిత్ షా
నక్సలైట్లపై సాగుతున్న ఈ పోరాటానికి సరైన ముగింపు పలకాలనేది ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యతని, గత కొన్ని సంవత్సరాలుగా నక్సలైట్లపై జరుగుతున్న పోరాటం నిర్ణయాత్మక దశకు చేరుకున్నదని స్పష్టం చేసిన శ్రీ అమిత్ షా.
నక్సలైట్ల దాడి నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రితోను, ఉన్నతాధికారులతోను, ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన శ్రీ అమిత్ షా. వామపక్ష ఉగ్రవాద పరిస్థితుల గురించి సమీక్ష చేసిన శ్రీ అమిత్ షా
నక్సలైట్లకు వ్యతిర
Posted On:
05 APR 2021 8:00PM by PIB Hyderabad
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం లో నక్సలైట్లతో పోరాటం చేస్తూ వీర మరణం పొందిన జవాన్లకు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా జగదల్‌పూర్ వద్ద ఘన నివాళి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన అమర జవానుల ధైర్యసాహసాలకు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమరజవానుల ధైర్యసాహసాలను, త్యాగాలను దేశం మరిచిపోదని అన్నారు. దేశం మొత్తం అమర జవానుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. నక్సలైట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటాన్ని సరైన పద్ధతిలో ముగింపునిస్తామని ఆయన అన్నారు.
ఏప్రిల్ 3న రాష్ట్రంలో జరిగిన నక్సల్స్ దాడి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆధ్వర్యంలో ఒక ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బగేల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వామపక్ష ఉగ్రవాద పరిస్థితులపైన సమీక్ష సమావేశం కొనసాగింది. సమీక్ష సమావేశం తర్వాత మీడియాను ఉద్దేశించి శ్రీ అమిత్ షా మాట్లాడారు. ఈ పోరాటంలో అమరులైన ఛత్తీస్‌గఢ్ పోలీసులకు, సిఆర్ పిఎఫ్ జవాన్లకు, కోబ్రా బెటాలియన్ సభ్యులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం తరఫున, మొత్తం దేశం తరఫున నివాళులు ఘటించామని ఆయన తెలిపారు. అమరజవాన్ల త్యాగం వృధాగా పోదని, వారి త్యాగాలను దేశం గుర్తుపెట్టుకుంటూనే వుంటుందని తద్వారా ఈ పోరాటాన్ని నిర్ణయాత్మక ముగింపుకు తేవడం జరుగుతుందని ఆయన అన్నారు.
నక్సలైట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి సరైన ముగింపు పలకాలనేది శ్రీ మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన కృషి కారణంగా నక్సలైట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో నిర్ణయాత్మక దశకు చేరుకున్నామని, ఇప్పుడు జరిగిన దురదృష్టకర ఘటన తమ నిర్ణయాన్ని మరింత బలోపేతం చేసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బేగల్, భద్రతాదళాల అధికారులతోను జరిగిన సమీక్షా సమావేశం నిర్ణయం ప్రకారం నక్సలైట్లపై పోరాటాన్ని నెమ్మదింప చేసే ప్రసక్తే లేదని అన్నారు. జవాన్ల నైతికస్థయిర్యం ఏమాత్రం దెబ్బతినలేదనడానికి ఇదే 1నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
నక్సలైట్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం ఆగదని ఇది మరింత ఉధృతంగా సాగుతుందని హోంమంత్రి శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. చివరికంటూ పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో చివరికి ప్రభుత్వానిదే విజయమని ఆయన అన్నారు. గత ఐదారు సంవత్సరాల్లో ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో భద్రతాదళాల క్యాంపులు నిర్వహించామని ఇది చెప్పుకోదగ్గ విజయమని ఆయన అన్నారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోయాయని ఈ క్రమంలో ఇలాంటి దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి చాలా ప్రగతిని సాధించడం జరిగిందని, కోవిడ్ 19 మహమ్మారి కారణంగా గత ఒక ఏడాదిగా అభివృద్ధి పనులు నెమ్మదించాయని శ్రీ అమిత్ షా తెలిపారు. గిరిజన ప్రజల ప్రతినిధులనుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రినుంచి, ఇంకా ఇతర ఎంపీలనుంచి తీసుకున్న సూచనల ప్రకారం పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు..
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తూనే సాయుధ నక్సలైట్లను తుదముట్టించడానికి పోరాటం జరుగుతూనే వుంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అమరజవానుల కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడిన శ్రీ అమిత్ షా...అమర జవానుల ఉన్నత త్యాగాలను దేశం మరిచిపోదని అన్నారు. ఈ విషాద సమయంలో దేశం మొత్తం జవానుల వెంట నిలుస్తుందని అన్నారు. ఏ లక్ష్యంకోసమైతే అమర జవాన్లు కృషి చేశారో ఆ లక్ష్యాన్ని సాధించడం జరుగుతుందని అమరజవాన్ల త్యాగాలు వృధాపోవని ఆయన అన్నారు.
*****
(Release ID: 1709857)
Visitor Counter : 189