రక్షణ మంత్రిత్వ శాఖ
లా పెరోస్ విన్యాసాల్లో పాల్గొననున్న భారత నౌకాదళ నౌకలు, విమానం
Posted On:
05 APR 2021 1:12PM by PIB Hyderabad
తూర్పు హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఏప్రిల్ అయిదవ తేదీ నుంచి ఏడవ తేదీవరకు జరగనున్న లా పెరోస్ విన్యాసాల్లో భారత నౌకాదళ యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సత్పురా (సమగ్ర హెలికాప్టర్‌తో) ఐఎన్ఎస్ కిల్తాన్‌తో పాటు పి 81 లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ తొలిసారిగా పాల్గొనున్నాయి. ఫ్రెంచ్ నేవీ (ఎఫ్ఎన్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (రాన్), జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్డిఎఫ్) మరియు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యుఎస్ఎన్) ల నౌకలు, విమానాలతో కలసి భారత నావికాదళ నౌకలు విమానాలు సముద్రంలో జరిగే విన్యాసాల్లో పాల్గొంటాయి. మూడు రోజుల పాటు ఈ విన్యాసాలను నిర్వహిస్తారు.
ఫ్రెంచ్ నేవీ నేతృత్వంలో జరగనున్న లా పెరోస్ విన్యాసాల్లో ఎఫ్ఎన్ షిప్స్ టోన్నెర్రే అనే ఉభయచర దాడి ఓడ మరియు ఫ్రిగేట్ సర్కోఫ్ పాల్గొనున్నాయి. యునైటెడ్ స్టేట్స్ నేవీ ఉభయచర రవాణా డాక్ షిప్ సోమర్సెట్ , ఆస్ట్రేలియన్ కి చెందిన యుద్ధ నౌక అంజాక్, ట్యాంకర్ సిరియస్ ఈ వ్యాయామంలో పాల్గొంటాయి. డిస్ట్రాయర్ అకెబోనో జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ షిప్ కు విన్యాసాల్లో ప్రాతినిధ్యం వహిస్తుంది. నౌకలతో పాటు నౌకల్లో మోహరించి పనిచేసే సమగ్ర హెలికాప్టర్లు కూడా ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి.
ఉపరితల యుద్ధం, వైమానిక యుద్ధం మరియు ఉపరితల రక్షణ , శత్రువుపై కాల్పులు జరపడం, ఒక నౌక నుంచి మరో నౌకకి వెళ్లడం , వ్యూహాత్మక విన్యాసాలు మరియు సముద్రంలో తిరిగి ఇంధనం నింపడంలాంటి సంక్లిష్టమైన కార్యక్రమాలను నిర్వహించడానికి నౌకాదళాలు కలిగి వుండే శక్తిసామర్ధ్యాలను లా పెరోస్ విన్యాసాలలో ప్రదర్శిస్తారు.
స్నేహపూర్వక నావికాదళాల శక్తిసామర్ధ్యాలు,, సమన్వయం ఒకదానితో ఒకటి కలసి పనిచేయడం లాంటి అంశాల ప్రదర్శనకు ఈ విన్యాసాలు వేదిక కానున్నాయి. ఈ విన్యాసాల్లో పాల్గొనడం ద్వారా శత్రువుల బారి నుంచి సముద్రాలను రక్షించడం, నిబంధనల మేరకు పారదర్శకంగా ఇండో-పసిఫిక్ లో స్నేహపూర్వక నౌకాదళాలతో కలసి పనిచేయాలన్న భారత నౌకాదళ నిబద్ధతను ప్రదర్శిస్తుంది.
***
(Release ID: 1709639)
Visitor Counter : 287