సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రజనీకాంత్ కు 51వ దాదాసాహెద్ ఫాల్కే అవార్డు ప్రకటించిన కేంద్రమంత్రి
प्रविष्टि तिथि:
01 APR 2021 12:46PM by PIB Hyderabad
ప్రముఖ నటుడు శ్రీ రజనీకాంత్ దాదాసాహెద్ ఫాల్కే అవార్డుకు ఎంపికచేసినట్టు కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. 2019 సంవత్సరానికిగాను 51వ దాదాసాహెద్ ఫాల్కే అవార్డును అందజేస్తామని మంత్రి ఈ వెల్లడించారు. జాతీయ చలన చిత్ర అవార్డులతో పాటు దాదాసాహెద్ ఫాల్కే అవార్డును మే మూడవ తేదీన ప్రధానం చేస్తారు.
అయిదుగురు సభ్యులతో కూడిన జ్యూరీ దాదాసాహెద్ ఫాల్కే అవార్డుకు శ్రీ రజనీకాంత్ పేరును ఏకగ్రీవంగా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వం దీనిని ఆమోదించిందని శ్రీ జవదేకర్ తెలిపారు. అవార్డు వివరాలను ఢిల్లీలో మంత్రి వెల్లడించారు. జ్యూరీ సభ్యులుగా
శ్రీమతి ఆశా భోంస్లే
శ్రీ మోహన్ లాల్
. శ్రీ బిస్వాజిత్ ఛటర్జీ.
శ్రీ శంకర్ మహాదేవన్.
శ్రీ సుభాష్ ఘై వ్యవహరించారు.
అవార్డుకు ఎంపికైన శ్రీ రజనీకాంత్ ను అభినందించిన మంత్రి ఆయన 50 సంవత్సరాలకు పైగా భారతీయులను తన నటనతో అలరిస్తున్నారని అన్నారు. రజనీకాంత్ ఒక దిగ్గజ నటుడని మంత్రి అన్నారు.
***
(रिलीज़ आईडी: 1708977)
आगंतुक पटल : 283