ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, పంజాబ్, కేరళ, తమిళనాడు, గుజరాత్,

మధ్యప్రదేశ్ రాష్టాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఆరున్నర కోట్ల కోవిడ్ టీకా డోసులు
నేటి నుంచి 45 ఏళ్ళు పైబడ్డవాళ్ళందరికీ కోవిడ్ టీకాలు

Posted On: 01 APR 2021 11:31AM by PIB Hyderabad

ఎనిమిది రాష్టాలు - మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, కర్నాటక, పంజాబ్, కేరళ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్  లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  గత 24 గంటలలో  72,330  కొత్త కరోనా కేసులు నమోదు కాగా అందులో 84.61%  ఈ ఎనిమిది రాష్టాలనుంచే రావటం గమనార్హం.  మహారాష్ట్రలో అత్యధికంగా 39,544 కొత్త కేసులు రాగా చత్తీస్ గఢ్ లో 4,563. కర్నాటకలో  4,225 కేసులు వచ్చాయి.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00152KT.jpg

ఈ క్రింద చూపిన 10 రాష్ట్రాలలో కేసుల పెరుగుదల కనబడుతోంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002UAU2.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003HCD8.jpg

దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసుల సంఖ్య 5,84,055 కి చేరుకుంది. ఇది దేశంలొ నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో 4.78%.  గత 24 గంటలలో కోవిడ్ బాధితుల సంఖ్య నికరంగా  31,489  కేసుల పెరుగుదల నమోదు చేసుకుందిఐదు రాష్ట్రాలు- మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, చత్తీస్ గఢ్, పంజాబ్ రాష్ట్రాలు కలిసి మొత్తం చికిత్సలో ఉన్న కేసుల్లో 78.9% వాటా ఉండటం గమనార్హం. ఒక్క మహారాష్ట్రలోనే 61% మంది చికిత్స పొందుతున్నవారున్నారు. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZAMF.jpg

మొత్తం కోవిడ్ నిర్థారణ పరీక్షలల్లో ఆర్ టి –పిసిఆర్ పరీక్షలు తక్కువ నమోదు చేసుకుంటున్న రాష్టాలను ఈ క్రింది చిత్రపటం చూపుతోంది. మొత్తం పరీక్షలలో ఆర్ టి – పిసి ఆర్ పరీక్షలు కనీసం 70% ఉండేట్టు చూడాలని కేంద్రం రాష్ట్రాలను కోరుతోంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005N3W1.jpg

45 ఏళ్ళు పైబడ్డవాళ్లందరికీ కోవిడ్ టీకాలిచ్చే కార్యక్రమం ఈరోజు ప్రారంభమవుతుంది. ఈ ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 10,86,241 శిబిరాల ద్వారా ఆరున్నర కోట్ల (6,51,17,896) టీకా డోసుల పంపిణీ పూర్తయింది.  ఇందులో 82,60,293 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 52,50,704 రెండో డోసులు, 91,74,171 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 39,45,796 డోసులు వారికిచ్చిన రెండో డోసులు,   78,36,667 డోసులు 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 17,849 వాళ్ళకిచ్చిన రెండో డోసులు, 3,05,12,070 డోసులు 60 ఏళ్ళ పైబడ్డ వారి మొదటి డోసులు, 1,20,346  డోసులు వారి రెండో డోసులు ఉన్నాయి.   

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 - 60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు 

60 ఏళ్ళు పైబడ్డవారు

 

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

82,60,293

52,50,704

91,74,171

39,45,796

78,36,667

17,849

3,05,12,070

1,20,346

6,51,17,896

 

టీకాల కార్యక్రమం మొదలైన 75వ రోజైన మార్చి 31న 20,63,543 టీకా డోసులిచ్చారు.  అందులో  17,94,166 మంది  39,484 శిబిరాల

ద్వారా మొదటి డోస్ అందుకోగా 2,69,377 మంది రెండో డోస్ తీసుకున్నారు.

 

తేదీ : మార్చి 31, 2021

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45 - 60 ఏళ్ళ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు  

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

44,054

31,179

1,25,754

1,55,329

4,83,710

11,025

11,40,648

71,844

17,94,166

2,69,377

 

దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల కార్యక్రమాన్ని ఈ దిగువ చిత్రపటం చూపుతుంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006V47Y.jpg

భారతదేశంలో ఇప్పటిదాకా మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్నవారు 1,14,74,683 కు చేరుకున్నారు.  జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం  93.89%. గత 24 గంటలలో 40,382 మంది కోలుకున్నారు.  

గడిచిన 24 గంటలలో 459 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి.  ఆరు రాష్ట్రాలలో  83.01% మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 227 మంది చనిపోగా పంజాబ్ లో 55 మంది చనిపోయారు.  

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007TVG7.jpg

గత 24 గంటలలో పదిహేను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కోవిడ్ మరణం ఒక్కటి కూడా నమోదు కాలేదు. అవి: చండీగఢ్, జార్ఖండ్, ఒడిశా, లద్దాఖ్, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి, పుదుచ్చేరి, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, లక్షదీవులు, మేఘాలయ, మిజోరం, అండమాన్-నికొబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్ 

 

 

****(Release ID: 1708963) Visitor Counter : 133