వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెమొరాండం (ఐఇఎం) మంజూరు చేసేందుకు కాగితంలేని ప్రక్రియ అభివృద్ధి
Posted On:
30 MAR 2021 3:04PM by PIB Hyderabad
పారదర్శకత, వ్యాపారం చేయడాన్ని సులభతరం చేయడానికి అవకాశాలను పెంచేందుకు డిపిఐఐటి తన ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెమొరాండం (ఐఇఎం) పోర్టల్ ను పునర్వ్యవస్థీకరించింది. ఒక కంపెనీ అన్ని ప్రాంతాలు, రంగాల వివరాలను ఒకే చోట పొందే విధంగా ఏక ఐఇఎం వ్యవస్థను ఆధునీకరించిన పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది.
ఎటువంటి ఆటంకాలు లేకుండా ఒకే ఫార్మ్‌లో పెట్టుబడి సంకల్పాలు (ఐఇఎం - పార్ట్ ఎ), ఉత్పత్తి ప్రారంభమైన అంశం నమోదు (ఐఇఎం- పార్ట్ బి) ద్వారా సౌలభ్యాన్ని అందిస్తోంది. గతంలో నమోదు చేసిన ఐఇఎంలలో మార్పులను కూడా తేలికగా చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ సమాచార నమోదు తిరిగి చేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది.
ఆమోదానికి సంబంధించిన సమాచారాన్ని కాగితంతో పనిలేని విధంగా దరఖాస్తుదారులకు ఇమెయిల్, ఎస్ ఎంఎస్‌ల ద్వారా అందించడం జరుగుతుంది. అలాగే ఏకకాల సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు పంపడం జరుగుతుంది. దరఖాస్తును సమర్పించడానికి, ఐఇఎం సర్టిఫికెట్ పొందేందుకు http://services.dipp.gov.in అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా జి2బి పోర్టల్ ను యాక్సెస్ చేయవచ్చు.
పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ లేక క్రమబద్ధీకరణ) చట్టం, 1951 కింద పారిశ్రామిక వ్యవస్థాపకులు ఇండస్ట్రియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ మెమొరాండ్‌ను (ఐఇఎం)ను దాఖలు చేసేందుకు దరఖాస్తులను అందుకునేందుకు జి2బి పోర్టల్‌ను డిపిఐఐటి నిర్వహిస్తోంది.
***
(Release ID: 1708605)
Visitor Counter : 249