ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ లో పెరుగుతున్న కరోనా కేసులు
దేశవ్యాప్తంగా 6 కోట్ల 10 లక్షలకు పైగా కోవిడ్ టీకా డోసుల పంపిణీ
Posted On:
30 MAR 2021 11:40AM by PIB Hyderabad
ఆరు రాష్టాలు - మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ లో కరోనాకేసులు పెరుగుతున్నాయి. మొత్తం కరోనా కేసులలో ఈ రాష్ట్రాల వాటా 78.56% నమొదైంది. గత 24 గంటలలో 56,211 కొత్త కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులోనే
31,643 కేసులు వచ్చాయి. పంజాబ్ లో 2,868, కర్నాటకలో 2,792 నమోదయ్యాయి.
క్రింద చూపిన విధంగా పది రాష్ట్రాలలో కరోనాకేసులు పెరుగుతూ ఉన్నాయి.
భారత దేశంలో మొత్తం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 5,40,720 కి చేరింది. ఇది మొత్తం కొవిడ్ కేసులలో 4.47% . గత 24 గంతలలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య నికరంగా18,912 పెరిగింది. చికిత్స పొందుతున్నవారిలో 79.64% వాటా మహారాష్ట, కేరళ, పంజాబ్, కర్నాటక, చత్తీస్ గఢ్ రాష్టాలదే ఉండగా మహారాష్ట్ర అత్యధికంగా 62% వాటాతో ఉంది.
మరోవైపు ఈ ఉదయం 7 గంటలవరలు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 10,07,091 శిబిరాల ద్వారా 6,11,13,354 టీకాల పంపిణీ జరిగింది. ఇందులో 81,74,916 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 51,88,747 ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండో డోసులు, 89,44,742 కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డొసులు, 37,11,221 ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండో డోసులు, 68,72,483 45 ఏళ్ళు పైబడ్డ దీర్ఘకాల వ్యాధిగ్రస్తుల కిచ్చిన మొదటి డోసులు, 405 వారికిచ్చిన రెండో డోసులు కాగా 2,82,19,257 డోసులు 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు, 1583 వారికిచ్చిన రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 - 60 ఏళ్ళ మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
81,74,916
|
51,88,747
|
89,44,742
|
37,11,221
|
68,72,483
|
405
|
2,82,19,257
|
1583
|
6,11,13,354
|
కోవిడ్ టీకాల కార్యక్రమం మొదలైన 73వరోజైన మార్చి 29 నాడు 5,82,919 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 5,51,164 మంది కోవిడ్ యోధులు, ఆరోగ్య సిబ్బంది 14,608 శిబిరాల ద్వారా మొదటి డోస్ అందుకోగా 31,755 మంది రెండో డోస్ అందుకున్నారు.
తేదీ: మార్చి 29, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 - 60 ఏళ్ళ మధ్య దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
17,919
|
10,682
|
32,629
|
19,085
|
1,41,260
|
405
|
3,59,356
|
1,583
|
5,51,164
|
31,755
|
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 1,13,93,021 కు చేరింది. అంటే, జాతీయ స్థాయిలో 94.19% కోలుకున్నట్టు..
గత 24 గంటలలో కోలుకున్నవారి సంఖ్య 37,028 .
***
(Release ID: 1708488)
Visitor Counter : 275
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam