ప్రధాన మంత్రి కార్యాలయం
బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి; ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు అని ఆయన ప్రశంసించారు
దేశవ్యాప్తం గా 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ (ఎఫ్‌పిఒ స్)ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
Posted On:
29 FEB 2020 6:30PM by PIB Hyderabad
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 296 కిలో మీటర్ల పొడుగుతో కూడివుండే బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే కు చిత్రకూట్ లో ఈ రోజు న పునాది రాయి ని వేశారు. 2018వ సంవత్సరం ఫిబ్రవరి లో ప్రకటించిన ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడోర్ తాలూకు నోడ్స్ కు అదనం గా ఈ చర్య ను చేపట్టారు. 14,849 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మాణమయ్యే ఈ ఎక్స్ ప్రెస్ వే తో చిత్రకూట్, బాందా, మహోబా, హమీర్ పుర్, జాలౌన్, ఔరైయా మరియు ఇటావా జిల్లాల కు లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నారు. ఇదే కార్యక్రమం లో భాగం గా 10,000 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేశన్స్ ను కూడా ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా, పిఎమ్- కిసాన్ స్కీము లో భాగం గా లాభితులు అందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి)లను వితరణ చేసేందుకు ఉద్దేశించిన ఒక కార్యక్రమాన్ని సైతం ఆయన ప్రారంభించారు.
దేశం లో ఉపాధి కల్పన కై అనేక కార్యక్రమాల ను చేపడుతున్న ప్రభుత్వాన్ని శ్రీ మోదీ మెచ్చుకొంటూ, బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే లేదా ప్రతిపాదిత గంగా ఎక్స్ ప్రెస్ వే యుపి లో సంధానాన్ని అధికం చేయడం ఒక్కటే కాకుండా అనేక ఉద్యోగ అవకాశాల ను కూడా కల్పిస్తాయని, మరి అలాగే పెద్ద నగరాల లో అందుబాటులో ఉండేటటువంటి సదుపాయాల ను ప్రజల కు కల్పిస్తాయని కూడా వివరించారు.
భూతల వ్యవస్థ లు, నౌక లు మరియు జలాంతర్గాములు, యుద్ధ విమానాలు, హెలీకాప్టర్ లు, ఆయుధాలు మరియు సెన్సర్ ల వరకు పలు రకాల భారీ రక్షణ పరికరాల ఆవశ్యకతల ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ సంవత్సరం బడ్జెటు లో యుపి డిఫెన్స్ కారిడోర్ కోసం 3700 కోట్ల రూపాయలు కేటాయించడమైందన్నారు. బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే తో యుపి డిఫెన్స్ కారిడోర్ తాలూకు పనుల లో ఒక కదలిక వస్తుంది అని కూడా ఆయన అన్నారు.
దేశం లో రైతుల ఆదాయాన్ని అధికం చేయడం మరియు వారికి సాధికారిత ను కల్పించడం కోసం 10,000 ఎఫ్‌పిఒ స్ ను నెలకొల్పే ఒక పథకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇప్పటి వరకు ఒక ఉత్పత్తిదారు గా ఉన్న రైతు ఎఫ్‌పిఒ స్ ద్వారా వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తాడు అంటూ ప్రధాన మంత్రి అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల ను గురించి ఆయన చెప్తూ, ప్రభుత్వం రైతు కు ఆందోళన ను కలిగిస్తున్న ప్రతి ఒక్క అంశం పైనా.. అవి ఎంఎస్‌పి లు కావచ్చు, సాయిల్ హెల్త్ కార్డు కావచ్చు, యూరియా కు 100 శాతం వేప పూత కావచ్చు, దశాబ్దాల తరబడి అసంపూర్తి గా నిలచిపోయిన సాగు నీటి పారుదల పథకాల ను పూర్తి చేయడం కావచ్చు.. ప్రభుత్వం కసరత్తు చేసిందని ప్రధాన మంత్రి అన్నారు.
ఎఫ్‌పిఒ స్ రైతు ల కృషి ని సమష్టీకరించడం లో తోడ్పాటు ను అందిస్తాయని, దీని ద్వారా వారు వారి యొక్క దిగుబడుల ను ఒక ఉత్తమమైన ధర కు విక్రయించ గలుగుతారని ప్రధాన మంత్రి అన్నారు. అదే విధం గా, దేశం లోని 100 కు పైగా ఆకాంక్షభరిత జిల్లాల లోని ఎఫ్‌పిఒ స్ కు మరిన్ని ప్రోత్సాహకాల ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. దేశం లోని ‘ఆకాంక్షభరిత జిల్లాల’లో ప్రతి ఒక్క బ్లాకు లో కనీసం ఒక ఎఫ్‌పిఒ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
యావత్తు ఉత్తర్ ప్రదేశ్ లో చిత్రకూట్ సహా సుమారు 2 కోట్ల రైతు కుటుంబాలు ఒక సంవత్సరం లో 12 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాని కి హక్కు కలిగిన వారు అవుతున్నారని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ సొమ్ము ను వారి యొక్క బ్యాంకు ఖాతాల లో నేరు గా జమ చేయడం జరుగుతోందన్నారు. ఇందులో మధ్యవర్తుల ప్రమేయం గాని, ఎటువంటి వివక్ష కు తావు గాని లేదు అని పేర్కొన్నారు. బుందేల్ ఖండ్ పేరు తో, రైతుల పేరు తో వేల కోట్ల విలువైన ప్యాకేజీల ను ప్రకటించినప్పటికినీ అటువంటిది ఏమీ రైతు జేబు లోకి ఏమీ రాని కాలాల తో ఈ అంశాన్ని ఆయన పోల్చారు. పిఎమ్ కిసాన్ యోజన లబ్ధిదారుల ను పిఎమ్ జీవన్ జ్యోతీ బీమా తో, పిఎమ్ జీవన్ సురక్ష బీమా పథకం తో కూడా ముడిపెడుతున్నట్లు ఆయన వివరించారు. ‘‘దీని ద్వారా రైతుల కు కష్టకాలం లో 2 లక్షల రూపాయల వరకు బీమా సొమ్ము అందేందుకు అవకాశం ఉంటుంది’’ అని ఆయన చెప్పారు.
రైతు యొక్క ఆదాయాన్ని అధికం చేయడం కోసం ఒక 16 అంశాల కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు. రైతు కు అతడి పొలాని కి కొన్ని కిలో మీటర్ల దూరం లోపల ఒక గ్రామీణ బజారు సౌకర్యాన్ని కల్పించేందుకు వీలు గా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని, ఈ బజారు అతడి ని దేశం లోని ఏ విపణి కి అయినా జోడిస్తుందంటూ ప్రధాన మంత్రి వివరించారు. ఈ గ్రామీణ అంగళ్ళు రానున్న కాలాల్లో వ్యావసాయిక ఆర్థిక వ్యవస్థ తాలూకు నూతన కేంద్రాలు గా మారుతాయి అని ఆయన అన్నారు.
***
(Release ID: 1708472)
Visitor Counter : 152