ప్రధాన మంత్రి కార్యాలయం

ఓరాకాందీ లో గల హరి మందిర్ ను సందర్శించిన ప్ర‌ధాన మంత్రి; అక్కడి సాముదాయిక స్వాగత కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు

Posted On: 27 MAR 2021 6:28PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాంగ్లాదేశ్ లో తన రెండు రోజుల యాత్ర లో రెండో రోజు న ఓరాకాందీ లో గల హరి మందిర్ లో అర్చన లు చేసి, ఈశ్వరుని ఆశీర్వాదాలను అందుకొన్నారు.  అక్కడి పూజనీయ ఠాకుర్ పరివారం వంశజుల తో ఆయన మాట్లాడారు కూడాను.
 



ప్రధాన మంత్రి ఓరాకాందీ లో మతువా సముదాయం ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.  శ్రీ శ్రీ హరి చంద్ ఠాకుర్ జీ సంఘ సంస్కరణల తాలూకు తన పవిత్రమైనటువంటి సందేశాన్ని ప్రచారం చేసింది అక్కడి నుంచే.  భారతదేశం, బాంగ్లాదేశ్ లు వాటి అభివృద్ధి, పురోగతి ల ద్వారా యావత్తు ప్రపంచం తాలూకు ప్రగతి ని చూడాలని కోరుకొంటున్నాయి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  ఉభయ దేశాలు ప్రపంచం లో అస్థిరత్వం, భయం, అశాంతి లకు బదులు స్థిరత్వాన్ని, ప్రేమ ను, శాంతి ని ఆకాంక్షిస్తున్నాయి అని ఆయన అన్నారు.  శ్రీ శ్రీ హరి చంద్ ఠాకుర్ జీ మనకు ఇచ్చిన విలువలు కూడా ఇవే అని ఆయన గుర్తు కు తెచ్చారు.
 



ప్రస్తుతం, భారతదేశం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మరియు సబ్ కా విశ్వాస్’ అనే మంత్రం తో ముందుకు సాగుతోందని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావిస్తూ, ఈ ప్రస్థానం లో బాంగ్లాదేశ్ ‘శొహొజాత్రి’ గా ఉందన్నారు.  అదే కాలం లో, బాంగ్లాదేశ్ వికాసం, పరివర్తన ల తాలూకు ఒక బలమైనటువంటి ఉదాహరణ ను ప్రపంచం ఎదుట ఆవిష్కరిస్తున్నదని, ఈ ప్రయాసల లో బాంగ్లాదేశ్ కు ‘శొహొజాత్రి’ గా భారతదేశం ఉంటోందని ఆయన అన్నారు.

ఓరాకాందీ లో బాలికల కోసం ఇప్పటికే పనిచేస్తున్న ఒక మాధ్యమిక పాఠశాల ను ఉన్నతీకరించడం, ఒక ప్రాథమిక పాఠశాల ను ఏర్పాటు చేయడం సహా అనేక అంశాలపై ప్రధాన మంత్రి ప్రకటన చేశారు.  శ్రీ శ్రీ హరి చంద్ ఠాకుర్ జయంతి సందర్భం లో ప్రతి సంవత్సరం నిర్వహించే ‘బరూనీస్నాన్’ లో పాలుపంచుకోవడానికి గాను భారతదేశం నుంచి ప్రజలు పెద్ద సంఖ్య లో ఓరాకాందీ కి తరలివస్తున్నారని, వారి ప్రయాణం సాఫీ గా సాగేటట్లుగా అవసరమైన అన్ని చర్యల ను తీసుకోవడం జరుగుతుందని కూడా ఆయన అన్నారు.


 

***
 



(Release ID: 1708216) Visitor Counter : 186