భారత ఎన్నికల సంఘం
అస్సాం, కేరళ, తమిళనాడు,పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి శాసనసభలకు ఎన్నికలు, వివిధ రాష్ట్రాలలో లోక్‌సభ, శాసనసభ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్‌పై నిషేధం
Posted On:
26 MAR 2021 4:59PM by PIB Hyderabad
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 126 (ఎ), సబ్ సెక్షన్ (1) కింద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు దఖలుపడిన అధికారాల క్రింద 2021 మార్చి 27( శనివారం) ఉదయం 7 గంటల నుంచి 2021ఏప్రిల్ 29 (గురువారం ) రాత్రి 7.30 గంటల మధ్య ఏదైనా ఎక్జిట్ ఫోల్ నిర్వహించడం ప్రింట్ మీడియాలో ప్రచురించడం, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రసారం చేయడం, ప్రచారం కల్పించడం లేదా మరేదైనా రూపంలో దానిని వెలువరించడాన్ని ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఎన్నికల కమిషన్ 2021 ఫిబ్రవరి 26న జారీ చేసిన పత్రికా ప్రకటన, 2021 మార్చి 16న జారీచేసిన ప్రకటన ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి శాసనసభ జనరల్ ఎన్నికలు, లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు, వివిధ రాష్ట్రాలలో శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల సందర్భంగా ఇది వర్తిస్తుంది.
దీనికితోడు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 125 (1)(బి) ప్రకారం ఏదైనా ఎన్నికలకు సంబంధించిన సమాచారం అంటే ఒపీనియన్ పొల్ ఫలితాలు లేదా ఏదైనా ఇతర పోల్ సర్వేను ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియా లో ప్రసారం చేయడం సంబంధిత జనరల్ ఎన్నికలు, ఉప ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ ప్రాంతాలలో పోలింగ్ ముగియడానికి ముందు 48 గంటల కాలంలో ప్రసారం చేయడాన్ని నిషేధించారు.
ఇందుకు సంబంధించి 2021 మార్చి 24న జారీచేసిన నోటిఫికేషన్‌ను సంబంధిత వర్గాల సమాచారం కోసం జతచేయడమైనది.
ఇసిఐ నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
***
(Release ID: 1708049)
Visitor Counter : 150